తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Elevate Ev : హోండా ఎలివేట్​కు ఈవీ టచ్​.. లాంచ్​ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన సంస్థ!

Honda Elevate EV : హోండా ఎలివేట్​కు ఈవీ టచ్​.. లాంచ్​ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన సంస్థ!

Sharath Chitturi HT Telugu

05 September 2023, 6:30 IST

google News
    • Honda Elevate EV : హోండా ఎలివేట్​ ఈవీ మోడల్​ను సిద్ధం చేస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా 2030 వరకు ఇండియాలో 4 ఎస్​యూవీలను లాంచ్​ చేయనున్నట్టు స్పష్టం చేసింది.
హోండా ఎలివేట్​కు ఈవీ టచ్​..
హోండా ఎలివేట్​కు ఈవీ టచ్​..

హోండా ఎలివేట్​కు ఈవీ టచ్​..

Honda Elevate EV : ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలివేట్​ ఎస్​యూవీని తాజాగా లాంచ్​ చేసిన హోండా సంస్థ మంచి జోరు మీద ఉంది! లాంచ్​తో పాటు.. ఈ ఎలివేట్​ ఎస్​యూవీకి చెందిన ఎలక్ట్రిక్​ వర్షెన్​ గురించి కూడా కీలక అప్డేట్​ ఇచ్చేసింది. 2026 నాటికి ఎలివేట్​ ఈవీని లాంచ్​ చేయనున్నట్టు ప్రకటించింది.

"హోండా ఎలివేట్​ ఈవీ వర్షెన్​పై ఫోకస్​ చేస్తున్నాము," అని హోండా కార్స్​ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ టకుయా సుమురా తెలిపారు. ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలక్ట్రిక్​ వాహనాలకు మంచి డిమాండ్​ ఉంది. అనేక ఆటోమొబైల్​ సంస్థలు.. పోటీపడి మరీ ఈవీలను దింపుతున్నాయి. కానీ హోండాకు ఇంకా ఒక్క ఈవీ కూడా ఇక్కడ లేదు. 2026లో లాంచ్​ అయ్యే హోండా ఎలివేట్​ ఈవీ.. సంస్థ నుంచి వచ్చే తొలి ఎలక్ట్రిక్​ మోడల్​గా నిలిచే అవకాశం ఉంది.

2030 వరకు లైనప్​..

మరోవైపు హోండాకు ఇండియాలో ఎస్​యూవీలే లేవు! హోండా ఎలివేట్​.. సంస్థ నుంచి వచ్చిన తొలి ఎస్​యూవీగా నిలిచింది. అటు ఈవీ, ఇటు ఎస్​యూవీ సెగ్మెంట్​లో ఈ సంస్థ కాస్త వెనకపడిందనే చెప్పుకోవాలి. అయితే.. 2030 వరకు లైనప్​ను సిద్ధం చేసుకుంటున్నట్టు హోండా చెబుతోంది. 2030 నాటికి ఇండియాలో కనీసం నాలుగు ఎస్​యూవీలను లాంచ్​ చేస్తామని వెల్లడించింది.

"గతేడాదితో పోల్చుకుంటే.. ఈ ఏడాది మిడ్​-సైజ్​ ఎస్​యూవీ సెగ్మెంట్​ సేలస్​ 34శాతం పెరిగాయి. దీనిపై మేము ఫోకస్​ పెంచుతున్నాము," అని హోండా కార్స్​ ఇండియా వీపీ కునాల్​ బెహ్ల్​ తెలిపారు.

ఎలివేట్​ ధరలు ఇవే..

Honda Elevate price in India : హోండా ఎలివేట్​లో మొత్తం నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అవి ఎస్​వీ, వీ, వీఎక్స్​, జెడ్​ఎక్స్​. వాటి ఎక్స్​షోరూం ధరలు..

ఎస్​వీ ఎంటీ- రూ. 10.99లక్షలు

వీ ఎంటీ- రూ. 12,10,900

వీఎక్స్​ ఎంటీ- రూ. 13,49,000

జెడ్​ఎక్స్​- రూ. 14,89,900

వీ సీవీటీ- రూ. 13,20,900

వీఎక్స్​ సీవీటీ- రూ. 14,59,900

జెడ్​ఎక్స్​- రూ. 15,99,900

హోండా ఎలివేట్​లో 1.5 లీటర్​ ఐ-వీటెక్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 119 హెచ్​పీ పవర్​ను, 145 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ మేన్యువల్​, సీవీటీ గేర్​బైక్స్​ దీని సొంతం. ఈ మోడల్​ మేన్యువల్​ వేరియంట్​ మైలేజ్​ 15.3 కేఎంపీఎల్​ అని, సీవీటీ వేరియంట్​ మైలేజ్​ 16.92 కేఎంపీఎల్​ అని సంస్థ చెబుతోంది.

ఈ కొత్త ఎస్​యూవీ ఫీచర్స్​ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం