తెలుగు న్యూస్ / ఫోటో /
Honda Elevate SUV: హోండా ఎలివేట్ కొనే ప్లాన్ ఉందా?.. అయితే, ఈ రివ్యూ చూడండి..
మిడ్ సైజ్ ఎస్ యూవీ సెగ్మెంట్లో ఎలివేట్ (Honda Elevate) ను హోండా సంస్థ ఇటీవల లాంచ్ చేసింది. ఆ కారు రోడ్ రివ్యూని ఈ పిక్చర్స్ లో చూడండి..
(2 / 8)
హోండా ఎలివేట్ లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, సీవీట్ అనే రెండు ట్రాన్స్ మిషన్ చాయిసెస్ ఉన్నాయి.
(3 / 8)
ఎక్స్టీరియర్ డిజైన్ ను ఆకర్షణీయంగా రూపొందించారు. స్వ్వేర్ షేప్ గ్రిల్ తో మాస్క్యులైన లుక్ వచ్చింది. ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్ లైట్స్ ఉన్నాయి.
(4 / 8)
వేరియంట్ ను బట్టి ఈ కార్ లో 16 ఇంచ్ ల, 17 ఇంచ్ ల అలాయ్ వీల్స్ ను అమర్చారు. డోర్స్ పై, రూఫ్ రెయిల్స్ పై క్లాడింగ్ తో ఎక్స్ ట్రా అప్పీల్ వచ్చింది.
(5 / 8)
డాష్ బోర్డ్ ను లగ్జూరియస్ గా తీర్చిదిద్దారు. ఇన్ఫోటైన్ మెంట్ కన్సోల్ ను మిగతా హోండా కార్లతో పోలిస్తే, మరింత డైనమిక్ గా డిజైన్ చేశారు. వైర్ లెస్ ఫోన్ చార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి.
(6 / 8)
డ్రైవర్ డిస్ ప్లే సెమీ డిజిటల్ గా ఉంటుంది. ఇది కొంత ఔట్ డేటెడ్ గా ఉంది. దీన్ని పూర్తిగా డిజిటల్ గా తీర్చి దిద్దితే బావుంటేది.
(7 / 8)
హోండా ఎలివేట్ లో క్యాబిన్ చాలా విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. వెనుక సీట్లో కూర్చునే వారు కూడా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు.
ఇతర గ్యాలరీలు