Mini Cooper EV : మినీ కూపర్ ఈవీ.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే!
03 September 2023, 10:20 IST
- Mini Cooper EV : మినీ కూపర్ ఈవీ మోడల్ని సంస్థ అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. ఇండియాలో కూడా ఈ మోడల్ లాంచ్కానుంది. ఆ వివరాలు..
మినీ కూపర్ ఈవీ.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే!
Mini Cooper EV : లగ్జరీ వాహనాల తయారీ సంస్థ మినీ.. సరికొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని పేరు 2024 మినీ కూపర్ ఈవీ. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలనే తయారు చేయాలని లక్ష్యం పెట్టుకున్న ఈ ఆటోమొబైల్ సంస్థ.. మినీ కూపర్ ఈవీపై భారీ ఆశలే పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుంది.
కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ ఫీచర్స్ ఏంటి?
2024 మినీ కూపర్ ఎలక్ట్రిక్ వాహనాన్ని బీస్పోక్ ఈవీ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తోంది సంస్థ. ఇదొక 3- డోర్ హ్యాచ్‌బ్యాక్. డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇందులో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వస్తున్నాయి. సంస్థకు చెందిన ఇతర వాహనాల్లో ఫ్రెంట్లో కనిపించే ఫౌక్స్ ఎయిర్ వెంట్ కూడా లేదు.
2024 Mini Cooper EV : ఇక ఇంటీరియర్ విషయానికొస్తే.. ఈ 2024 మినీ కూపర్ ఈవీ.. 1959 బీఎంసీ మినీ మోడల్‌ను పోలి ఉంటుంది. అంటే ఇందులో సర్క్యులర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తోంది. ఈ మధ్య కాలంలో ఇది ఏ వాహనంలో కూడా కనిపించడం లేదు.
ఇక కర్వ్డ్ డాష్‌బోర్డ్‌లో 9.44 ఇంచ్ ఓఎల్ఈడీ ఇన్స్ట్రుమెంట్ టచ్‌స్క్రీన్ కూడా లభిస్తోంది. ఇది సర్క్యులర్ షేప్‌లో ఉంటుంది.
ఇదీ చూడండి- Tata Nexon facelift : టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఫిక్స్
ఈ వెహికిల్ రేంజ్ ఎంత?
2024 మినీ కూపర్ ఈవీ రెండు వర్షెన్స్లో అందుబాటులోకి రానుంది. బేస్ మోడల్ పేరు కూపర్ ఈ. ఇందులో 40.7కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఫ్రెంట్ మౌంటెడ్ మోటార్ ఉంటుంది. ఇది 184 హెచ్‌పీ పవర్‌ను, 290 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 305కి.మీల దూరం ప్రయాణిస్తుందని తెలుస్తోంది.
Mini Cooper EV price : ఇక రెండో వర్షెన్ పేరు మినీ కూపర్ ఎస్ఈ. ఇందులో 54.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన మోటార్ ఉంటుంది. దీని రేంజ్ 402కి.మీలు అని సంస్థ చెబుతోంది. ఈ రెండు వర్షెన్లను కూడా 10శాతం నుంచి 80శాతం వరకు ఛార్జ్ చేసేందుకు 30 నిమిషాల సమయం కూడా పట్టదు!
ఇండియాలో లాంచ్ ఎప్పుడు?
Mini Cooper EV India launch : ఆల్ న్యూ మినీ కూపర్ ఈవీ ఇండియాలో కూడా లాంచ్కానుంది. 2024 తొలి త్రైమాసికంలో ఈ మోడల్ ఇండియాలో అందుబాటులోకి రానుంది. ధర, లాంచ్ డేట్, ఇతర ఫీచర్స్ వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు.