Tata Nexon facelift : టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్​ ఫిక్స్​-tata nexon facelift teased for the first time ahead of launch ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Nexon Facelift : టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్​ ఫిక్స్​

Tata Nexon facelift : టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్​ ఫిక్స్​

Sharath Chitturi HT Telugu
Sep 02, 2023 07:20 AM IST

Tata Nexon facelift : టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ఈ నెలలో లాంచ్​కానుంది. తాజాగా టీజర్​ రిలీజ్​ అయ్యింది. ఆ వివరాలు..

ఇదిగో టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​..
ఇదిగో టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​..

Tata Nexon facelift : టాటా మోటార్స్​ బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటైనా టాటా నెక్సాన్​కు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతోందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా.. ఈ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​కు సంబంధించిన టీజర్​ను సంస్థ రిలీజ్​ చేసింది. అంతేకాకుండా ఈ మోడల్​ లాంచ్​ డేట్​ కూడా ఫిక్స్​ అయ్యింది. ఈ నెల 14న.. 2023 టాటా నెక్సాన్​ ఎస్​యూవీ లాంచ్​ అవుతుంది.

కొత్తగా.. సరికొత్తగా..

ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్​పోలో టాటా కర్వ్​ కాన్సెప్ట్​ను రివీల్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఇక ఈ టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను కర్వ్​ ఆధారంగా రూపొందించింది. ఇక టీజర్​లో వెహికిల్​ ఫ్రెంట్​ ఫేస్​ కనిపిస్తోంది. ఇందులోని ఎల్​ఈడ డీఆర్​ఎల్స్​కు కొత్త డిజైన్​ వచ్చింది. వీటికి మంచి ఇతర వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే కొన్ని స్పై షాట్స్​ ఇప్పటికే ఆన్​లైన్​లో చక్కర్లు కొడుతున్నాయి. వీటి ద్వారా పలు కీలక వివరాలు లీక్​ అయ్యాయి.

లీక్స్​ ప్రకారం.. 2023 టాటా నెక్సాన్​లో ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, స్టీరింగ్​ వీల్​ సెటప్​, ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, అలాయ్​ వీల్స్​ వంటివి కొత్తగా ఉంటాయి. ఇందులో 360 డిగ్రీ కెమెరా వస్తుందట. ఫ్రెంట్​ పార్కింగ్​ సన్సార్​లు కూడా ఉండొచ్చు. ప్రస్తుతం ఉన్న మోడల్​లోని ఫీచర్స్​తో పాటు ఇవి అదనంగా ఉంటాయని సమాచారం. అంతేకాకుండా.. న్యూ లెథరెట్​ వెంటిలేటెడ్​ సీట్స్​, వాయిస్​ కమాండ్స్​, వయర్​లెస్​ ఛార్జర్​ వంటివి కూడా వస్తాయని తెలుస్తోంది.

2023 Tata Nexon launch date : ఇక ఈ టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​లో 1.2 లీటర్​ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 118 హెచ్​పీ పవర్​ను, 170 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న 6 స్పీడ్​ మేన్యువల్​, ఆటోమెటిక్​ గేర్​బాక్స్​లతో పాటు డ్యూయెల్​-క్లచ్​ ట్రాన్స్​మిషన్​ ఆప్షన్​ కూడా వస్తోందని లీక్స్​ సూచిస్తున్నాయి.

లాంచ్​ తర్వాత ఈ టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​.. మారుతీ సుజుకీ బ్రెజా, హ్యుందాయ్​ వెన్యూ, కియా సోనెట్​ వంటి సబ్​-కాంపాక్ట్​ ఎస్​యూవీలకు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం