Honda Acura ZDX EV : 10 నిమిషాల ఛార్జ్​తో 130 కి.మీల రేంజ్​ ఇచ్చే హోండా ఈవీ ఇదే!-honda acura zdx electric suv can go 81 miles with 10 minutes of charge ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Acura Zdx Ev : 10 నిమిషాల ఛార్జ్​తో 130 కి.మీల రేంజ్​ ఇచ్చే హోండా ఈవీ ఇదే!

Honda Acura ZDX EV : 10 నిమిషాల ఛార్జ్​తో 130 కి.మీల రేంజ్​ ఇచ్చే హోండా ఈవీ ఇదే!

Sharath Chitturi HT Telugu
Aug 18, 2023 07:53 AM IST

Honda Acura ZDX EV : హోండాకు చెందిన అకురా నుంచి జెడ్​డీఎక్స్​ ఈవీ లాంచ్​కు సిద్ధమవుతోంది. ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

0 నిమిషాలు ఛార్జ్​ చేస్తే 810 కి.మీల రేంజ్​ ఇచ్చే హోండా ఈవీ..
0 నిమిషాలు ఛార్జ్​ చేస్తే 810 కి.మీల రేంజ్​ ఇచ్చే హోండా ఈవీ.. (Acura website)

Honda Acura ZDX EV : జపనీస్​ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండాకు చెందిన లగ్జరీ వాహనాల యూనిట్​ అకురా నుంచి కొత్తగా ఒక ఎలక్ట్రిక్​ వాహనం రానుంది. దీని పేరు అకురా జెడ్​డీఎక్స్​ ఈవీ. టెస్లా, ఫోర్డ్​ వంటి దిగ్గజ సంస్థలకు పోటీనిచ్చే విధంగా ఈ మోడల్​ ఉండనుంది. ఈ ఈవీకి సంబంధించి, ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హోండా అకురా జెడ్​డీఎక్స్​ ఈవీ..

పర్ఫార్మెన్స్​, ఫీచర్స్​ కలయికలో ఉండే ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​.. 2024లో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. దీని బేస్​ ప్రైజ్​ 60వేల డాలర్లుగా ఉండొచ్చు. ఇండియన్​ కరెన్సీలో అది సుమారు రూ. 50లక్షలు. లగ్జరీ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లో దీనికి మంచి డిమాండ్​ లభిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే, ప్రీమియం బాంగ్​ అండ్​ ఓలుఫ్​సెన్​ ఆడియో సిస్టెమ్​ వంటివి ఈ ఈవీలో ఉంటాయి. రేర్​ పెడిస్ట్రియన్​ అలర్ట్​, హ్యాండ్స్​ ఫ్రీ క్రూజ్​ డ్రైవర్​ అసిస్టెన్స్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ కూడా దీని సొంతం.

ఈ మోడల్​కు సంబంధించిన ఫీచర్స్​, బ్యాటరీ వంటి వివరాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఇందులోని బేస్​ వేరియంట్​ రేంజ్​ దాదాపు 525కి.మీలని తెలుస్తోంది. కాగా.. బ్యాటరీని 10 నిమిషాలు ఛార్జ్​ చేస్తే.. ఏకంగా 130 కి.మీల దూరం ప్రయాణిస్తుందని సమాచారం.

ఛార్జింగ్​ స్టేషన్లు కూడా..!

2024 Honda Acura ZDX EV first look : ఈ లగ్జరీ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఎస్​యూవీతో.. అమెరికాలో విప్లవం సృష్టించాలని హోండా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. 2024 తొలినాళ్లల్లో దీని డెలివరీలు మొదలుపెట్టాలని ప్లాన్​ చేస్తుండగా.. అంతకన్నా ముందే.. 30వేలకుపైగా ఛార్జింగ్​ స్టేషన్స్​ని కూడా సెటప్​ చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ మోడల్​ కోసం ప్రత్యేక ఎక్స్​క్లూజివ్​ ఆన్​లైన్​ సేల్స్​ను తీసుకురానున్నట్టు సమాచారం.

లగ్జరీ ఈవీలు కొనాలని భావించే కస్టమర్లకు నెంబర్​ 1. ఆప్షన్​గా ఈ అకురా జెడ్​డీఎక్స్​ ఉండాలని సంస్థ భావిస్తోంది. సరికొత్త ఫీచర్స్​ను సైతం తీసుకొచ్చి, డ్రైవింగ్​ ఎక్స్​పీరియెన్స్​ను మెరుగుపరచాలని ప్రయత్నిస్తోంది.

హోండా నుంచి కొత్త ఎస్​యూవీ..

ఇండోనేషియాలో జరిగిన గోయికిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్​ ఆటో షోలో భాగంగా.. ఓ కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ప్రోటోటైప్​ (కాన్సెప్ట్​)ను ఆవిష్కరించింది హోండా సంస్థ. ఈ హోండా ఎస్​యూవీ ఈ: ప్రోటోటైప్​లో ఫ్యూచరిస్టిక్​ డిజైన్​ కనిపిస్తోంది. అడ్వాన్స్​డ్​ టెక్నాలజీని కూడా ఉపయోగించినట్టు తెలుస్తోంది. డైనమిక్​ డిజైన్​ స్టైల్​తో కూడిన ఈ కారులో డ్రైవింగ్​ ఎక్స్​పీరియన్స్​ అద్భుతంగా ఉంటుందని సంస్థ చెబుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం