Renault Kwid EV : ఇండియాలో క్విడ్ ఈవీ లాంచ్‌కు రెనాల్ట్ ప్లాన్స్..!
07 April 2023, 7:47 IST
- Renault Kwid EV launch in India : ఇండియాలో క్విడ్ ఈవీని లాంచ్ చేసేందుకు రెనాల్ట్ ప్లాన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 2024 చివర్లో ఇండియాలో క్విడ్ ఈవీ లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇండియాలో రెనాల్ట్ క్విడ్ ఈవీ లాంచ్..!
Renault Kwid EV launch in India : ఇండియా మార్కెట్లో.. డిమాండ్ అధికంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌పై ఇప్పుడు దాదాపు అన్ని ఆటో సంస్థలు దృష్టిసారించాయి. కొత్త కొత్త లాంచ్‌లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా.. ఈ జాబితాలోకి రెనాల్ట్ కూడా చేరే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. క్విడ్‌కు ఈవీ వర్షెన్‌ను తీసుకొచ్చి.. ఇండియా మార్కెట్లో వేగంగా వృద్ధి చెందాలని రెనాల్ట్ సంస్థ భావిస్తున్నట్టు సమాచారం.
క్విడ్ ఈవీ కోసం ప్లాన్స్..!
క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌కు మేడ్-ఇన్- ఇండియా ఎలక్ట్రిక్ వర్షెన్ లాంచ్ చేసే విషయంపై రెనాల్ట్ కసరత్తులు చేస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే.. భాగస్వామి సంస్థ నిస్సాన్ మోటార్‌తో ఈ విషయంపై ఇంకా చర్చలు జరిపినట్టు కనిపించడం లేదు. కానీ ఈవీ సెగ్మెంట్లో బిజినెస్‌ను చూసి.. ఎలక్ట్రిక్ వాహనాలను ఇండియాలోకి తీసుకొచ్చేందుకు రెనాల్ట్ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. 2022లో ఇండియా ఈవీ సెగ్మెంట్ వేగంగా వృద్ధిచెందింది. కానీ మొత్తం వాహనాల సేల్స్‌లో ఇది 1శాతం కన్నా తక్కువగానే ఉన్నప్పటికీ.. 2030 నాటికి 30శాతం టార్గెట్‌ను ప్రభుత్వం పెట్టుకోవడంతో ఇక్కడ మంచి వ్యాపారం జరుగుతుందని రెనాల్ట్ భావిస్తున్నట్టు సమాచారం.
Renault Kwid EV : ఈ విషయంపై త్వరలో సమీక్ష జరగనున్నట్టు.. అందులో డిమాండ్, ధర, ఈవీని స్థానికంగా తయారు చేసే సామర్థ్యం వంటి అంశాలను రెనాల్ట్ పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. 2024 చివర్లో రెనాల్ట్ నుంచి ఓ ఈవీ రావొచ్చని ఊహాగానాలు ఇప్పటికే జోరందుకున్నాయి.
ఇండియాలో రెనాల్ట్ మంచి మార్కెటే ఉంది! 2022లో తక్కువ కార్లే అమ్మినా.. ఆ సంస్థ ఇంకా లాభాల్లోనే ఉంది.
Renault Kwid EV price : తాజా వార్తలపై రెనాల్ట్ ఇండియా స్పందించలేదు. కానీ.. అంతర్జాతీయంగా ఈవీ మార్కెట్‌పై దృష్టిసారించినట్టు వ్యాఖ్యానించింది. ఈ సెగ్మెంట్లో ఇండియా అనేది కీలకమైన మార్కెట్ అని పేర్కొంది.
ఇండియా ఆటో మార్కెట్ జోరు..
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో మార్కెట్‌గా ఇటీవలే అవతరించింది ఇండియా. జపాన్ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని దక్కించుకుంది. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో ఇండియా దూసుకెళుతోంది. ఇటు ఈవీ సేల్స్ కూడా పెరుగుతున్నాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి సంస్థలు ఇప్పటికే ఈవీ సెగ్మెంట్లో దుమ్మురేపుతున్నాయి. మరి ప్రస్తుతం ఇండియాలో ఉన్న పోటీని తట్టుకుని, రెనాల్ట్ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాలి.