Dacia Bigster : ఎల్పీజీతో నడిచే ఈ ఎస్‌యూవీని చూశారా? రేంజ్ 1,450 కి.మీలు..
11 October 2024, 5:57 IST
- Renault Duster 2024 : రెనాల్ట్ డస్టర్ సరికొత్త అవతారంలో ప్రపంచం ముందుకు వచ్చింది. రెనాల్ట్ బడ్జెట్ ప్రాండ్ డాసియా.. బిగ్‌స్టర్ పేరుతో 7 సీటర్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ వెహికిల్ ఎల్పీజీతో కూడా నడుస్తోంది. రేంజ్ 1,450 కి.మీలు! పూర్తి వివరాల్లోకి వెళితే..
రెనాల్ట్ డస్టర్ ఆధారిత డాసియా బిగ్‌స్టర్,,
రెనాల్ట్ డస్ట్ర్తో భారతీయులకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇండియాలోకి వచ్చిన తొలి తరం ఎస్‌యూవీల్లో ఈ డస్టర్ ఒకటి. కానీ పోటీ తీవ్రమై, సేల్స్ పడిపోవడంతో ఈ మోడల్ని సంస్థ డిస్కంటిన్యూ చేసింది. కాగా రెనాల్ట్ డస్టర్‌ని సరికొత్త అవతారంలో తీసుకొచ్చేందుకు సంస్థ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ఎస్‌యూవీపై మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. రెనాల్ట్‌కి చెందిన బడ్జెట్ బ్రాండ్ డాసియా.. “బిగ్‌స్టర్” పేరుతో సరికొత్త డస్టర్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ బిగ్‌స్టర్ ఎస్యూవీ 7-సీటర్ వర్షెన్. ఈ బిగ్‌స్టర్ వర్షెన్ భవిష్యత్తులో భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. భారతదేశంలో గతంలో అమ్మకానికి ఉన్న రెనాల్ట్ డస్టర్ కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
బిగ్‌స్టర్ పొడవు 4.57 మీటర్లు. వెడల్పు 1.81 మీటర్లు. ఎత్తు 1.71 మీటర్లు. వీల్‌బేస్ 2.7 మీటర్లు. డస్టర్ కంటే డాసియా బిగ్‌స్టర్ 230 ఎంఎం పొడవు ఎక్కువ. వీల్ బేస్ 43 ఎంఎం ఎక్కువ.
డాసియా బిగ్‌స్టర్: స్పెసిఫికేషన్లు..
డాసియా బిగ్ స్టర్‌ని మూడు ఇంజిన్ ఆప్షన్లతో సంస్థ అందిస్తోంది. ఇందులో మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్, ఎల్పీజీ ఉన్నాయి. మైల్డ్-హైబ్రిడ్ బిగ్‌స్టర్ ఎస్‌యూవీలో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 140 హార్స్‌పవర్‌ని అందిస్తుంది, 48 వీ సిస్టమ్‌ని కలిగి ఉంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. అదనంగా, ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇందులో స్నో, మడ్ / శాండ్, ఆఫ్-రోడ్, నార్మల్, ఎకో, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి వివిధ డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. మరో ఇంజిన్ ఆప్షన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ వేరియంట్. ఇది మైల్డ్-హైబ్రిడ్ సహాయంతో ఎల్పీజీ, పెట్రోల్ రెండింటితో పనిచేస్తుంది. ఇది 140 హార్స్ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. డాసియా ప్రకారం, బిగ్‌స్టర్ ఎల్పీజీలో 50-లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 49-లీటర్ ఎల్పీజీ ట్యాంక్ ఉండటంతో రీఫ్యూయెలింగ్కి ముందు ఏకంగా 1,450 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది.
హైబ్రిడ్ కాన్ఫిగరేషన్ లో, 107-హార్స్ పవర్, 4 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ 1.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మద్దతుతో 50 హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేసే రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో కలిసి పనిచేస్తుంది. మొత్తం విద్యుత్ ఉత్పత్తి 155 హార్స్ పవర్‌కు చేరుకుంటుంది. పెట్రోల్ ఇంజిన్ కోసం 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఎలక్ట్రిక్ మోటార్ కోసం 2-స్పీడ్ ట్రాన్స్మిషన్ ద్వారా ఈ పవర్ ముందు చక్రాలకు వెళుతుంది.
డాసియా బిగ్‌స్టర్: డిజైన్
డిజైన్ పరంగా.. 2021లో ప్రదర్శించిన కాన్సెప్లో కనిపించే చాలా డిజైన్ అంశాలను డాసియా బిగ్‌స్టర్ ఎస్యూవీ నిలుపుకోగలిగింది. ఇది బుచ్ డిజైన్, ఫ్లాట్ బానెట్, వీల్ఆర్చ్లను పొందుతుంది. హెడ్ ల్యాంప్స్‌తో పాటు టెయిల్ ల్యాంప్స్ వద్ద, క్యాబిన్లో కూడా వై-యాక్సెంట్స్ ఉన్నాయి.
డాసియా డస్టర్: ఫీచర్లు..
డాసియా డస్టర్ 7 లేదా 10 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్, ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇండియాలో ఈ మోడల్ లాంచ్‌పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.