తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2024 Renault Duster: త్వరలో భారతీయ రోడ్లపై పరుగులు పెట్టనున్న 2024 రెనాల్ట్ డస్టర్

2024 Renault Duster: త్వరలో భారతీయ రోడ్లపై పరుగులు పెట్టనున్న 2024 రెనాల్ట్ డస్టర్

HT Telugu Desk HT Telugu

10 February 2024, 14:39 IST

  • 2024 Renault Duster: భారతీయ ఎస్ యూ వీ మార్కెట్ ను ఒకప్పుడు లీడ్ చేసిన రెనాల్ట్ డస్టర్ త్వరలో సరికొత్త రూపంలో మరోసారి ఇండియన్ రోడ్లపై పరుగులు పెట్టనుంది. ఈ సంవత్సరం చివరలో భారత మార్కెట్లోకి ఈ అప్ గ్రేడెడ్ ఎస్ యూ వీ ని తీసుకురావాలని రెనాల్ట్ భావిస్తోంది.

2024 రెనాల్ట్ డస్టర్
2024 రెనాల్ట్ డస్టర్ (Renault Türkiye)

2024 రెనాల్ట్ డస్టర్

ఈ ఏడాది చివరి నాటికి తన 2024 డస్టర్ కారును భారత మార్కెట్లోకి విడుదల చేయాలని రెనాల్ట్ భావిస్తోంది. తాజా మోడల్ లోగో, డిజైన్, బ్రాండింగ్ లలో స్వల్ప మార్పులతో డాసియా డస్టర్ ను పోలిన డిజైన్ తో దీన్ని భారతీయ మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఇండియన్ వేరియంట్ పవర్ట్రెయిన్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ, ప్రపంచంలోని పలు ఇతర దేశాల్లో 2024 డస్టర్ మూడు ఇంజన్ ఆప్షన్స్ తో వస్తోంది. అలాగే, భారత్ లో ఈ 2024 రెనాల్ట్ డస్టర్ ధర (2024 Renault Duster price) వివరాలు కూడా ఇంకా వెల్లడి కాలేదు.

మూడు ఇంజన్ వేరియంట్స్

ఆటో వర్గాల అంచనా ప్రకారం..

  • వాటిలో, 2024 Renault Duster మొదటి వేరియంట్ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉన్న 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్. ఇది 140 బిహెచ్ పి పవర్, 148 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ప్రొడ్యస్ చేస్తుంది. రెనాల్ట్ 24.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇంజన్ బ్యాటర్ పవర్ పైననే స్టార్ట్ అయ్యేలా, బ్రేక్ రీజనరేషన్ కు సపోర్ట్ చేసే 1.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ను ఇందులో అమర్చారు.
  • రెండవ వేరియంట్ 1.2-లీటర్, 3 సిలిండర్ల పెట్రోల్ ఇంజన్. దీనికి మిల్లర్ సైకిల్ పై పనిచేసే 48 వి ఎలక్ట్రిక్ మోటారు ను జతచేశారు. ఈ రెండు ఇంజన్ ను స్టార్ట్ చేసే సమయంలో, యాక్సిలరేషన్ సమయంలో కంబషన్ ఇంజన్ కు సహాయపడుతుంది. దీనివల్ల సగటు ఇంధన వినియోగం తగ్గుతుంది. అలాగే, ఇందులో 0.8 కిలోవాట్ల బ్యాటరీని రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా ఛార్జ్ చేస్తారు. ఈ వేరియంట్ 4×2, 4×4 వెర్షన్లలో 6-స్పీడ్ గేర్ బాక్స్ తో లభిస్తుంది.
  • 2024 డస్టర్ లో పెట్రోల్, ఎల్పీజీ కాంబో ఇంజన్ వర్షన్ కూడా ఉంది. ఇందులో రెండు ట్యాంకులు ఉంటాయి. అవి ఒక్కొక్కటి 50 లీటర్ల సామర్థ్యంతో, ఒకటి పెట్రోల్ కోసం, మరొకటి ఎల్పీజీ కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఈ వేరియంట్ లో వినియోగదారులు డ్యాష్ బోర్డ్ లోని ఒక బటన్ ను నొక్కడం ద్వారా పెట్రోల్ నుంచి ఎల్పీజీకి లేదా ఎల్పీజీ నుంచి పెట్రోలుకు మారవచ్చు. అయితే, ఈ ప్రత్యేక ఇంజిన్ ను భారత మార్కెట్లో అందించకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
  • 2024 డస్టర్ లో సిఎంఎఫ్-బి ప్లాట్ఫామ్ ఉంది. ఇది గతంలో శాండేరో, లోగాన్, జాగర్ వంటి మోడళ్లలో ఉపయోగించిన ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్. ఈ ప్లాట్ ఫాం ప్యాసింజర్ మరియు లగేజీ స్పేస్ ను పెంచడమే కాకుండా ఎస్ యూవీ యొక్క విద్యుదీకరణను కూడా సులభతరం చేస్తుంది.

తదుపరి వ్యాసం