Redmi Note 13 Pro : లాంచ్‌కు సిద్ధంగా రెడ్మీ నోట్ 13 సిరీస్.. ప్రో మోడల్ ఫీచర్స్ ఇవే!
19 September 2023, 13:19 IST
- Redmi Note 13 Pro : రెడ్మీ 13 సిరీస్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లోని ప్రో మోడల్ ఫీచర్స్ బయటకి వచ్చాయి. ఆ వివరాలు..
ఇంకొన్ని రోజుల్లో రెడ్మీ నోట్ 13 లాంచ్..
Redmi Note 13 Pro : సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది రెడ్మీ సంస్థ. ఈ రెడ్మీ నోట్ 13 సిరీస్.. ఈ నెల 21న లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఇందులో నోట్ 13, నోట్ 13 ప్రో, నోట్ 13 ప్రో ప్లస్ గ్యాడ్జెట్స్ ఉండనున్నట్టు సమాచారం. లాంచ్‌కి ముందే.. ప్రో మోడల్‌కు సంబంధించి కొన్ని ఫీచర్స్ బయటకు వచ్చాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము..
రెడ్మీ నోట్ 13 ప్రో ఫీచర్స్ ఇవే..!
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ ప్లస్ రిసొల్యూషన్తో కూడిన 6.67 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉండొచ్చు. అండర్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ లభిస్తుందని సమాచారం.
ఈ గ్యాడ్జెట్ రేర్‌లో 200ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ మాక్రో కెమెరా లెన్స్‌లు ఉండొచ్చు. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది.
ఈ రెడ్మీ నోట్ 13 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ఉండనుంది. ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేయొచ్చు. కాగా ఇందులో 5,120ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని, దీనికి 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుందని తెలుస్తోంది. 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్, 16జీబీ ర్యామ్- 1టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉండొచ్చు.
ఇదీ చూడండి:- 200ఎంపీ రేర్- 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో హానర్ 90.. ధర ఎంతంటే!
ఈ వివరాలన్నీ గీక్‌బెంచ్ అనే ప్లాట్ఫామ్లో దర్శనమిచ్చాయి. ఇదొక బెంచ్‌మార్కింగ్ సైట్. స్మార్ట్‌ఫోన్ సీపీయూ, జీపీయూ పర్ఫార్మెన్స్ని టెస్ట్ చేసేందుకు మొబైల్ సంస్థలు తమ గ్యాడ్జెట్స్‌ని ఇక్కడికి పంపిస్తుంటాయి.
Redmi Note 13 launch date : ఈ మోడల్‌కు సంబంధించిన మరిన్ని ఫీచర్స్, ధర వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. అయితే.. రెడ్మీ 13 సిరీస్‌లో.. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఎన్నడూ లేని విధంగా ఫ్లాగ్‌షిఫ్ ఫీచర్స్ వస్తాయని షావోమీ జనరల్ మేనేజర్ వాంగ్ టెంగ్ తెలిపారు. ఇక ప్రో ప్లస్ మోడల్లో.. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వచ్చే అవకాశం ఉంది. ఇదే నిజమైతే.. ఈ ప్రాసెసర్ వాడుతున్న తొలి స్మార్ట్‌ఫోన్‌గా ఈ మోడల్ నిలిచిపోతుంది.
ఈ సిరీస్ తొలుత చైనాలో లాంచ్ అవ్వొచ్చు. అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.