తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme Pad 2 Lite: విశాలమైన డిస్ ప్లే, భారీ బ్యాటరీతో రియల్మీ ప్యాడ్ 2 లైట్ లాంచ్

Realme Pad 2 Lite: విశాలమైన డిస్ ప్లే, భారీ బ్యాటరీతో రియల్మీ ప్యాడ్ 2 లైట్ లాంచ్

Sudarshan V HT Telugu

13 September 2024, 22:24 IST

google News
  • Realme Pad 2 Lite: రియల్మీ ప్యాడ్ 2 లైట్ భారత్ లో లాంచ్ అయింది. ఈ కొత్త టాబ్లెట్లో పెద్ద డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ ఉన్నాయి. ఈ లేటెస్ట్ టాబ్లెట్ ధర,ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

విశాలమైన డిస్ ప్లే, భారీ బ్యాటరీతో రియల్మీ ప్యాడ్ 2 లైట్
విశాలమైన డిస్ ప్లే, భారీ బ్యాటరీతో రియల్మీ ప్యాడ్ 2 లైట్ (Realme)

విశాలమైన డిస్ ప్లే, భారీ బ్యాటరీతో రియల్మీ ప్యాడ్ 2 లైట్

Realme Pad 2 Lite LAUNCH: రియల్మీ ప్యాడ్ 2 లైట్ టాబ్లెట్ ను భారత్ లో లాంచ్ చేసింది. 10.95 అంగుళాల డిస్ ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ సెట్ ను ఇందులో అందించారు. ఇందులో భారీ 8300 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపర్చారు. ఈ ట్యాబ్ స్మార్ట్ ఏఐ ఫంక్షనాలిటీని అందిస్తుంది. ఈ ట్యాబ్లెట్ రెండు రంగుల్లో, రెండు స్టోరేజ్ ఎంపికల్లో లభిస్తుంది.

రియల్ మీ ప్యాడ్ 2 లైట్: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

రియల్ మీ ప్యాడ్ 2 లైట్ స్పెషాలిటీల్లో ముఖ్యమైనది భారీ డిస్ ప్లే. ఇందులో 10.95 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ఇది మెయిన్ స్ట్రీమ్ టాబ్లెట్ మార్కెట్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. డిస్ ప్లే 1920×1200 రిజల్యూషన్ ను సపోర్ట్ చేస్తుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. రియల్ మీ ప్యాడ్ 2 లైట్ టాబ్లెట్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఇందులో 16 జీబీ వరకు డైనమిక్ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను అందించారు. ఇందులోని డైనమిక్ ర్యామ్ ఎక్స్పాన్షన్ (DRE) టెక్నాలజీతో వినియోగదారులు రోమ్ ను వర్చువల్ ర్యామ్ గా ఉపయోగించడానికి వీలు కలుగుతుంది.

భారీ బ్యాటరీ

15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 8300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. అదనంగా, ఇది ఇంటెలిజెంట్ స్పీడ్ రిడక్షన్ ఫీచర్ ను కలిగి ఉంది, ఇది బ్యాటరీ 80% చేరుకున్న తర్వాత ఛార్జింగ్ వేగాన్ని నెమ్మదిస్తుంది, ముఖ్యంగా రాత్రిపూట వాడకం సమయంలో. రియల్మీ ప్యాడ్ 2 లైట్ 8.32 మిల్లీమీటర్ల మందంతో స్లిమ్ ప్రొఫైల్ ను కలిగి ఉంది.

రియల్ మీ ప్యాడ్ 2 లైట్: ధర, లభ్యత

రియల్ మీ (realme) ప్యాడ్ 2 లైట్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి స్పేస్ గ్రే, నెబ్యులా పర్పుల్. 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ట్యాబ్ అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.14,999 కాగా, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999. త్వరలోనే ఇది realme.com, ఫ్లిప్ కార్ట్, ఇతర మెయిన్లైన్ ఛానళ్లలో కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది.

తదుపరి వ్యాసం