Realme GT 6T Vs Poco F6: రియల్మీ జీటీ 6టీ వర్సెస్ పోకో ఎఫ్6: ఈ రెండు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లో ఏది బెటర్?
24 May 2024, 16:35 IST
Realme GT 6T Vs Poco F6: ఇటీవల విడుదల అయిన పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? లేటెస్ట్ గా మార్కెట్లోకి విడుదల అయిన రియల్మీ జీటీ 6టీ, పోకో ఎఫ్ 6 లను పరిశీలించండి. ఈ రెండు స్పెసిఫికేషన్స్ లో పోలికలను మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం.
రియల్మీ జీటీ 6టీ వర్సెస్ పోకో ఎఫ్6
Realme GT 6T Vs Poco F6: రియల్మీ జీటీ 6టీ, పోకో ఎఫ్6 రెండూ శక్తివంతమైన ప్రాసెసర్, పనితీరు సామర్థ్యాలతో మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి ఈ వారం అరంగేట్రం చేశాయి. ఆశ్చర్యకరంగా రెండు స్మార్ట్ఫోన్లను హెవీ-డ్యూటీ, మల్టీటాస్కింగ్ కోసం రూపొందించారు. వీటిలో కొన్ని తాజా ఫ్లాగ్షిప్ ఫీచర్లు ఉన్నాయి. అయితే, రియల్మీ జీటీ 6టీ లేదా పోకో ఎఫ్6.. ఈ రెండింటిలో ఏ స్మార్ట్ ఫోన్ మంచిది? అనే విషయం అర్థం చేసుకోవడానికి వాటిలోని స్పెసిఫికేషన్లు, ఫీచర్లను తెలుసుకుందాం.
రియల్మీ జీటీ 6టీ వర్సెస్ పోకో ఎఫ్6
డిస్ప్లే: రియల్ మి జీటీ 6టీలో, అలాగే పోకో ఎఫ్6లో 6.67 అంగుళాల డిస్ప్లే ఉంది. విజువల్స్ విషయానికొస్తే రియల్మీ 3డీ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లేను, పోకో ఎఫ్6 1.5కే అమోఎల్ఈడీ డిస్ప్లేను అందిస్తున్నాయి. రెండు స్మార్ట్ఫోన్లు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తాయి. బ్రైట్ నెస్ పరంగా, జీటీ 6టీ 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 6000 నిట్స్ లోకల్ బ్రైట్ నెస్ కు సపోర్ట్ చేస్తుంది. మరోవైపు, పోకో (Poco) ఎఫ్ 6 2400 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ ను అందిస్తుంది.
కెమెరా: రెండు స్మార్ట్ఫోన్లు డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉన్నాయి. అయితే రియల్మీ (Realme) జీటీ 6టీ స్మార్ట్ఫోన్లో 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ సోనీ లైట్ 600 సెన్సార్, 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. పోకో ఎఫ్6లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్, ఓఐఎస్ సపోర్ట్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. రియల్మీలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, పోకో ఎఫ్6లో 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
పర్ఫార్మెన్స్: రియల్మీ జీటీ 6టీ స్మార్ట్ఫోన్లో స్నాప్డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్, 12 జీబీ LPDDR5X ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఉన్నాయి. పోకో ఎఫ్6లో 4ఎన్ఎం క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 12 జీబీ పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఉన్నాయి. రెండు స్మార్ట్ఫోన్లు శక్తివంతమైన చిప్సెట్ను అందిస్తాయి. ఇది ఆన్-డివైజ్ ఏఐ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ: రియల్ మి జీటీ 6టీ (Realme GT 6T) స్మార్ట్ఫోన్లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. పోకో ఎఫ్6 (Poco F6)లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
ధర: రియల్మీ జీటీ 6టీ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999. పోకో ఎఫ్6 8 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.29,999గా ఉంది.