Poco F6 launch : పోకో ఎఫ్​6 లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!-poco f6 to launch on may 23 check expected specs launch details and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Poco F6 Launch : పోకో ఎఫ్​6 లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Poco F6 launch : పోకో ఎఫ్​6 లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
May 14, 2024 07:20 AM IST

Poco F6 price : పోకో ఎఫ్6 మే 23న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

పోకో ఎఫ్​6 ఇండియా లాంచ్​ డేట్​ ఫిక్స్​
పోకో ఎఫ్​6 ఇండియా లాంచ్​ డేట్​ ఫిక్స్​ (Poco)

Poco F6 price in India : సరికొత్త స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది పోకో. ఈ పోకో ఎఫ్6.. మే 23న అధికారికంగా లాంచ్ కానుంది. దుబాయ్​లో స్థానిక కాలమానం ప్రకారం.. మే 23 సాయంత్రం 3 గంటలకు, యూకేలో మధ్యాహ్నం 12 గంటలకు, భారత్ లో సాయంత్రం 4.30 గంటలకు ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ట్విట్టర్​లో సంస్థ ఇటీవల చేసిన ప్రకటనతో ఎఫ్​6 స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అఫీషియల్​గా రివీల్​ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

పోకో ఎఫ్ 6 గ్లోబల్ లాంచ్

పోకో ఎఫ్6 స్మార్ట్​ఫోన్​ గురించి నిర్దిష్ట వివరాలు బ్రాండ్ వెల్లడించనప్పటికీ, ఫ్లిప్​కార్ట్​టీజర్ నుంచి వచ్చిన సంకేతాల ప్రకారం.. ఈ పోకో ఎఫ్6.. రెడ్మీ టర్బో 3 రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు. మే 23 లాంచ్​తో ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

పోకో ఎఫ్6 స్పెసిఫికేషన్లు ఇవేనా?

Poco F6 specifications : పలు లీక్స్​ ప్రకారం.. పోకో ఎఫ్6లో 6.67 ఇంచ్​ 1.5కే రిజల్యూషన్ అమోఎల్ఈడీ డిస్ప్లేతో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​ ఉంటుంది. స్నాప్​డ్రాగన్​ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్​, 12 జీబీ ఎల్పీడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఇందులో ఉండొచ్చు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 అల్ట్రా వైడ్ సెన్సార్ కూడా ఉండనుంది. 90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఆశించవచ్చు.

ఇక ఈ పోకో ఎఫ్​6 స్మార్ట్​ఫోన్​ ధర వివరాలపై క్లారిటీ రాలేదు.

ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. మే 23 లాంచ్​తో పోకో ఎఫ్​6 స్మార్ట్​ఫోన్​ ధర, ఫీచర్స్​ వివరాలు అందుబాటులోకి వస్తాయి. మేము మీకు అప్డేట్​ చేస్తాము.

రియల్​మీ జీటీ 6టీ లాంచ్ డేట్​ ఫిక్స్​..

Realme GT 6T launch in India : రియల్​మీ జీటీ 6టి.. గత కొంతకాలంగా టాక్ ఆఫ్ ది టౌన్​గా ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​ డిజైన్, ధర, స్పెసిఫికేషన్లను వెల్లడించే పనిలో టిప్​స్టర్లు ఉన్నారు. ఇక ఇప్పుడు.. ఈ మొబైల్​ ఇండియా లాంచ్​ను అధికారికంగా ప్రకటించింది రియల్​మీ సంస్థ. స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన మెటాలిక్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ను కూడా రివీల్​ చేసింది. రియల్​మీ జీటీ 6టీ స్మార్ట్​ఫోన్​లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. పలు మీడియా కథనాల ప్రకారం.. ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ .31999. అంటే.. ఇదొక మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ అని అర్థం చేసుకోవచ్చు రియల్​మీ జీటీ 6టీ లాంచ్​ డేట్​, ఎక్స్​పెక్టెడ్​ ఫీచర్స్​ వంటి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇంకో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగు ఛానెల్​ని ఫాలో అవ్వండి.

సంబంధిత కథనం