Poco X5 5G : ఇండియాలో పోకో ఎక్స్​5 లాంచ్​.. ఫీచర్స్​, ధర వివరాలివే!-tech news poco x5 5g launched in india with 48mp camera check price here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Poco X5 5g : ఇండియాలో పోకో ఎక్స్​5 లాంచ్​.. ఫీచర్స్​, ధర వివరాలివే!

Poco X5 5G : ఇండియాలో పోకో ఎక్స్​5 లాంచ్​.. ఫీచర్స్​, ధర వివరాలివే!

Sharath Chitturi HT Telugu
Apr 07, 2024 11:50 AM IST

Poco X5 5G price in India : Poco X5 5G : ఇండియాలో పోకో ఎక్స్​5 లాంచ్​ అయ్యింది. ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఇదిగో పోకో ఎక్స్​5 5జీ.. సూపర్​ ఫీచర్స్​ని చెక్​ చేయండి..
ఇదిగో పోకో ఎక్స్​5 5జీ.. సూపర్​ ఫీచర్స్​ని చెక్​ చేయండి..

Poco X5 5G launch date in India : ప్రముఖ స్మార్ట్​ఫోన్ బ్రాండ్ పోకో.. కొత్త గ్యాడ్జెట్​ని ఇండియాలో లాంచ్​ చేసింది. దీని పేరు పోకో ఎక్స్5 5జీ. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్​ఫోన్​.. క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్​ 695 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ స్క్రీన్, 5జీ సపోర్ట్ వంటివి ఈ పోకో స్మార్ట్​ఫోన్​కి లభిస్తున్నాయి. ఇక ఈ గ్యాడ్జెట్​ స్పెసిఫికేషన్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

పోకో ఎక్స్5 5జీ ధర, లభ్యత..

పోకో ఎక్స్5 5జీలో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఈ స్మార్ట్​ఫోన్ బేస్ వేరియంట్​లో 6 జీబీ ర్యామ్- 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. దీని ధర రూ.18,999గా ఉంది. ఇక.. మరో వేరియంట్​ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.20,999గా ఉంది. ఈ రెండు మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్స్​ని ధరలను చూస్తే స్పష్టమైపోతోంది.

పోకో ఎక్స్5 5జీ ఫోన్ సూపర్నోవా గ్రీన్, వైల్డ్​క్యాట్​ బ్లూ, జాగ్వార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఏప్రిల్​ 21న కంపెనీ వెబ్​సైట్, ఫ్లిప్​కార్ట్​ ద్వారా ఈ స్మార్ట్​ఫోన్​ సేల్​లోకి వెళ్లనుంది.

Poco X5 5G price in India : పోకో ఎక్స్5 5జీ కొనుగోలుపై లాంచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి! ఐసీఐసీఐ కార్డుదారులకు రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ.2,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు.

పోకో ఎక్స్ 5 5జీ స్పెసిఫికేషన్లు..

పోకో ఎక్స్5 5జీ క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 6.67 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్​తో వస్తుంది. స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. మరియు 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటును అందిస్తుంది. సన్​లైట్ మోడ్​తో వస్తున్న ఈ స్మార్ట్​ఫోన్ గరిష్టంగా 1200నిట్స్​ బ్రైట్​నెస్​ని పొందింది.

Poco X5 5G features : ఈ పోకో కొత్త మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ రేర్​లో ట్రిపుల్ కెమెరా సెటప్​ను అందించింది సంస్థ. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్. కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. హెచ్​డీర్​, నైట్ మోడ్, ఏఐ సీన్ డిటెక్షన్ వంటి ఫీచర్ల సైతం ఇందులో లభిస్తున్నాయి.

సెల్ఫీల కోసం పోకో ఎక్స్5 5జీ స్మార్ట్​ఫోన్స్​లో 13 మెగాపిక్సెల్ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్ ఐపీ53 రేటింగ్​తో వస్తుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

Poco X5 5G : 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్​తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ డివైజ్ కేవలం 22 నిమిషాల్లోనే 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయగలదని కంపెనీ చెబుతోంది.

WhatsApp channel

సంబంధిత కథనం