Porsche Cayenne facelift : పోర్షే నుంచి రెండు ఫేస్‍లిఫ్ట్ వర్షెన్లు లాంచ్.. ధరలు ఎంతంటే!
22 April 2023, 11:16 IST
- Porsche Cayenne facelift : పోర్షే నుంచి కొత్తగాా రెండు ఫేస్‍లిఫ్ట్ వర్షెన్లు లాంచ్ అయ్యాయి. వీటి ధరలు, ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
పోర్షే కెయెన్ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ లాంచ్..
Porsche Cayenne facelift : పోర్షే నుంచి రెండు వెహికిల్స్‌కి చెందిన ఫేస్‍లిఫ్ట్ వర్షెన్లు ఇండియా మార్కెట్లో లాంచ్ అయ్యాయి! అవే.. పోర్షే కెయెన్ ఫేస్‍లిఫ్ట్, పోర్షే కెయెన్ కూపే ఫేస్‍లిఫ్ట్. వీటి ఎక్స్‌షోరూం ధరలు రూ. 1.36కోట్లు, రూ. 1.42కోట్లుగా ఉన్నాయి. 2023 జులై నుంచి వీటి డెలివరీలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం వీటి బేస్ మోడల్స్ అందుబాటులో ఉన్నా, ఈ- హైబ్రీడ్ కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారీ మార్పులతో ఫేస్‍లిఫ్ట్ వర్షెన్లు..!
పోర్షే కెయెన్కు ఇది థర్డ్ జనరేషన్. దీని లుక్స్ స్వల్పంగా మారాయి. స్కల్ప్టెడ్ బానెట్, మాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్ కొత్తగా ఉన్నాయి. 12 రంగులు, 24 అలాయ్ వీల్స్ ఆప్షన్స్‌లో ఈ మోడల్ అందుబాటులో ఉండటం విశేషం. వీల్ బేస్ సైజ్ 20-22 ఇంచ్‌ల వరకు ఉంటుంది.
Porsche Cayenne facelift 2023 : కెయెన్ ఫేస్‍లిఫ్ట్ వర్షెన్ రేర్‌లో టెయిల్ ల్యాంప్స్‌ను కనెక్ట్ చేస్తూ ఓ లైట్‌బార్ ఉంది. నెంబర్ ప్లేట్‌ని కూడా టెయిల్ గేట్ నుంచి బంపర్‌కు రిలోకేట్ చేశారు. ఇది మంచి అప్డేట్ అనే చెప్పుకోవచ్చు.
Porsche Cayenne facelift వర్షెన్కు సంబంధించిన ఫొటోలను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ఇంటీరియర్ విషయానికొస్తే.. కెయెన్లో భారీగానే మార్పులు జరిగినట్టు కనిపిస్తోంది! ఇందులో ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్ ఉంది. 12.6 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచ్ సెంటర్ టచ్‌స్క్రీన్‌తో పాటు ఆప్షనల్‌గా 10.9 ఇంచ్ ప్యాసింజర్ టచ్‌స్క్రీన్ వంటివి కేబిన్‌లో కనిపిస్తాయి. న్యూ స్టీరింగ్ వీల్, డాష్‌బోర్డ్ మౌంటెడ్ డ్రైవ్ సెలెక్టర్, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్లు కూడా మారాయి.
Porsche Cayenne Coupe facelift launch : ప్రస్తుతం ఈ రెండు మోడల్స్‌లోనూ ఒకటే ఇంజిన్ (3.0లీటర్ ట్విన్- టర్బోఛార్జ్డ్ వీ6 పెట్రోల్) ఉంది. ఇది 353 హెచ్‌పీ పవర్‌ను, 500ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ కూడా లభిస్తోంది. రానున్న హైబ్రీడ్ మోడల్లో ఇదే ఇంజిన్‌తో పోటు ఒక ఈ- మోటార్ ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా ఇది 470హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుందని సమాచారం. ఓన్లీ ఎలక్ట్రిక్ మోడ్‌లో ఈ మోడల్స్ 90కి.మీలు ప్రయాణించొచ్చని సంస్థ చెబుతోంది.
పోర్షే కెయెన్ ఫేస్‍లిఫ్ట్ వర్షెన్.. మాసరాటే లెవాంటే, రేంజ్ రోవర్ స్పోర్ట్‌కు గట్టిపోటీనిస్తుండగా.. కెయెన్ కూప్ ఫేస్‍లిఫ్ట్ మోడల్ ఆడీ క్యూ8తో ఢీకొట్టనుంది!