తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Poco X6 Sale: భారత్ లో పొకొ ఎక్స్ 6 సేల్ ప్రారంభం; 12 జీబీ ర్యామ్ వేరియంట్ ధర ఎంతంటే..?

POCO X6 sale: భారత్ లో పొకొ ఎక్స్ 6 సేల్ ప్రారంభం; 12 జీబీ ర్యామ్ వేరియంట్ ధర ఎంతంటే..?

HT Telugu Desk HT Telugu

14 February 2024, 15:33 IST

  • POCO X6 sale in India: పొకొ ఎక్స్ 6 (POCO X6) సేల్ ప్రారంభమైంది. ఇది ప్రత్యేకంగా Flipkartలో అందుబాటులో ఉంది. 12GB RAM మరియు 256GB స్టోరేజ్ తో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ శక్తివంతమైన పనితీరు, అద్భుతమైన ప్రదర్శన, అధునాతన కెమెరా సామర్థ్యాలతో మార్కెట్లో కొత్త ప్రమాణాలను సెట్ చేస్తుందని భావిస్తున్నారు.

పొకొ ఎక్స్ 6 5 జీ స్మార్ట్ ఫోన్
పొకొ ఎక్స్ 6 5 జీ స్మార్ట్ ఫోన్ (Amazon)

పొకొ ఎక్స్ 6 5 జీ స్మార్ట్ ఫోన్

POCO X6 price: భారతదేశంలో POCO X6 సేల్ ప్రారంభమైంది. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభించే ఈ కొత్త వేరియంట్ ధర రూ. 20,999 గా నిర్ణయించారు. ఇది రెండు కలర్స్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి, మిర్రర్ బ్లాక్, స్నో స్టార్మ్ వైట్. కస్టమర్లు ICICI క్రెడిట్/డెబిట్ కార్డ్‌లను ఈఎంఐ లావాదేవీ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే, రూ. 3000 తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. లేదా వర్కింగ్ కండిషన్ లో ఉన్న మీ స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా కూడా రూ 3 వేల డిస్కౌంట్ పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Bank holiday tomorrow: అక్షయ తృతీయ సందర్భంగా బ్యాంకులకు రేపు సెలవు ఉంటుందా?

Maruti Suzuki Swift launch: మారుతి సుజుకీ స్విఫ్ట్ 2024 మోడల్ లాంచ్; మైలేజీ 25 కిమీల పైనే. ధర కూడా అందుబాటులోనే..

Simpl layoffs: ఫిన్ టెక్ కంపెనీ ‘సింప్ల్’ లో 25% ఉద్యోగులకు ఉద్వాసన; ఉద్యోగులకు సీఈఓ క్షమాపణలు

Train ticket Booking: ఈ యాప్ తో ఆన్ లైన్ లో రైలు టికెట్లు బుక్ చేసుకోవడం చాలా ఈజీ.. జనరల్ టికెట్స్ కూడా కొనేయొచ్చు..

ఏఐ ఆధారిత ట్రిపుల్ కెమెరా సిస్టమ్

POCO X6 లో అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌ ను అమర్చారు. ఇది అత్యాధునిక 4nm ప్లాట్‌ఫారమ్‌లో ఆకట్టుకునే పనితీరును అందిస్తుంది. దీని డైనమిక్ 8-కోర్ CPU, Adreno GPU A710 అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి. ఈ పొకొ ఎక్స్ 6 స్మార్ట్ ఫోన్ , 120Hz రిఫ్రెష్ రేట్ తో, 1.5K రిజల్యూషన్‌తో 6.67అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే, డాల్బీ విజన్, వేగవంతమైన టచ్ శాంప్లింగ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ సెక్యూరిటీ కూడా ఉంది. అంతేకాదు, ఇది కేవలం 181 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఇందులో AI-ఆధారిత ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఈ ఫోన్ లో 67W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేసే 5100mAh బ్యాటరీ ఉంటుంది.

ఇన్-డిస్ ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌

సెక్యూరిటీ ఆప్షన్ల విషయానికి వస్తే, POCO X6లో వేగవంతమైన, సురక్షితమైన అన్‌లాకింగ్ కోసం ఇన్-డిస్ ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఉంటుంది. అదనపు సౌలభ్యం కోసం AI ఫేస్ అన్‌లాక్‌ సదుపాయం కూడా ఉంది. 10 5G బ్యాండ్‌లకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా MIUI 14పై పనిచేస్తుంది. POCO X6లో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ అదనపు ఆకర్షణ.