Petrol diesel price : పెట్రోల్, డీజిల్‌పై రూ. 10 తగ్గింపు- త్వరలోనే గుడ్ న్యూస్!
30 December 2023, 11:55 IST
- Petrol diesel price drop : పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై ఓ ప్రకటన వస్తుందని తెలుస్తోంది.
పెట్రోల్‌పై రూ. 10 తగ్గింపు- త్వరలోనే గుడ్ న్యూస్!
Petrol diesel price cut news today : దేశంలో పెట్రోల్- డీజిల్ ధరలు దిగొస్తాయని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు జోరందుకున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటం, ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. ఇక ఇప్పుడు.. ఇదే విషయంపై తాజాగా ఓ వార్త బయటకి వచ్చింది. లీటరు పెట్రోల్‌పై రూ. 10ని తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు, త్వరలోనే ప్రజలకు గుడ్ న్యూస్ అందనున్నట్టు సమాచారం.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు..
2024 ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం ఇవ్వాలని కేంద్రం భావిస్తోందట. ఇదే విషయంపై అన్ని చర్చలు ముగిసినట్టు, కేంద్ర ఆర్థికశాఖ సంతకం ఒక్కటే మిగిలినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సంతకాలు పెట్టి, ఆదేశాలు అమల్లోకి వచ్చిన తర్వాత.. లీటరు పెట్రల్‌పై రూ. 10, లీటర్ డీజిల్‌పైనా రూ. 10 తగ్గుతుందని పేర్కొన్నాయి.
petrol diesel price cut news : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించి దాదాపు రెండేళ్లు గడిచిపోయాయి. చివరిగా.. ఆయా ధరలపై రూ. 8, రూ. 6 కట్ ఇచ్చింది కేంద్రం. అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి.
ఇక ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు పెరిగిన విషయం వాస్తవమే. కానీ ఆ తర్వాత ధరలు గణనీయంగా దిగొచ్చాయి. చమురు సంస్థలకు మంచి లాభాలే వచ్చాయి. ఫలితంగా.. ప్రజలకు కాస్త ఉపశమనం కల్పించాలని ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు కేంద్రం ఇటీవలే సూచించింది. ఆయా సంస్థలు కూడా ఇందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది.
Petrol and diesel price in Hyderabad : గత మూడు త్రైమాసికాలుగా.. చమురు సంస్థలు లాభాల్లో ఉన్నాయి. ఫలితంగా నష్టాలు దాదాపు తగ్గాయి. ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీఎస్ లాభాలు.. గత త్రైమాసికంలో రూ. 28వేల కోట్లు దాటేశాయి. నష్టాలను దాదాపు రికవరీ చేసేయడంతో ధరలను తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
కూరగాయల రేట్లు, నిత్యావసరాల ధరలు పెరిగిపోతుండటంతో సామాన్యుడిపై ఆర్థిక భారం పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే.. ప్రజలకు కచ్చితంగా ఉపశమనం కలుగుతుంది.
మరి తాజా వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు! కానీ పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు వ్యవహారం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.