Save petrol and diesel : గూగుల్​ మ్యాప్స్​లో కొత్త ఫీచర్​- ఇక పెట్రోల్​ ఖర్చులు తగ్గడం పక్కా!-can google help save petrol diesel new feature promises fuel efficient drive ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Save Petrol And Diesel : గూగుల్​ మ్యాప్స్​లో కొత్త ఫీచర్​- ఇక పెట్రోల్​ ఖర్చులు తగ్గడం పక్కా!

Save petrol and diesel : గూగుల్​ మ్యాప్స్​లో కొత్త ఫీచర్​- ఇక పెట్రోల్​ ఖర్చులు తగ్గడం పక్కా!

Sharath Chitturi HT Telugu
Dec 16, 2023 08:05 AM IST

Google Maps fuel efficient drive : మీ పెట్రోల్​, డీజిల్​ ఖర్చులను తగ్గించే విధంగా గూగుల్​ మ్యాప్స్​లో ఓ కొత్త ఫీచర్​ని తీసుకొచ్చింది గూగుల్​ సంస్థ. ఈ ఫీచర్​ ఎలా పనిచేస్తుందంటే..

గూగుల్​ మ్యాప్స్​లో కొత్త ఫీచర్​- ఇక పెట్రోల్​ ఖర్చులు తగ్గడం పక్కా!
గూగుల్​ మ్యాప్స్​లో కొత్త ఫీచర్​- ఇక పెట్రోల్​ ఖర్చులు తగ్గడం పక్కా!

Google Maps fuel efficient drive : హైదరాబాద్​తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో లీటరు పెట్రోల్​ ధర రూ. 100 కన్నా ఎక్కువగానే ఉంది. లీటరు డీజిల్​ కూడా ఎప్పుడో రూ. 95 దాటేసింది. మన వాహనాల పరిస్థితి చూస్తేనేమో.. మైలేజ్​ తక్కువగా ఉంటుంది! ఫలితంగా జేబుకు చిల్లుపడుతూనే ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడి, పెట్రోల్​ ఖర్చులను తగ్గించుకోవాలని ఉందా? అయితే.. గూగుల్​ మ్యాప్స్​లోని ఓ కొత్త ఫీచర్​ మీకు సాయం చేస్తుంది!

గూగుల్​ మ్యాప్స్​తో పెట్రోల్​ ఖర్చులు తగ్గించుకోండి..

గూగుల్​ మ్యాప్స్​లో.. ఫ్యూయెల్​- ఎఫీషియెంట్​ డ్రైవ్​ ఫీచర్​ని తీసుకొచ్చింది ఈ దిగ్గజ టెక్​ సంస్థ. ప్రస్తుతం ఇది కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉంది. త్వరలో ఇండియాలో కూడా అందుబాటులోకి రానుంది.

కాగా.. మీరు ఏదైనా ట్రిప్​ మొదలుపెడితే.. ఫ్యూయెల్​ ఎఫీషియెంట్​ రూట్​ని కూడా గూగుల్​ మ్యాప్స్​ సూచిస్తుంది. కెనడా, యూకేతో పాటు ఇతర యూరోపియన్​ దేశాల్లో ఈ ఫీచర్​ పనిచేస్తోంది. హైబ్రీడ్​ష ఎలక్ట్రిక్​ వాహనాలకు కూడా ఈ ఫీచర్​ పనిచేస్తుండటం విశేషం.

Google Maps latest news : గూగుల్​ మ్యాప్స్​ సెట్టింగ్స్​లో ఈ ఫీచర్​ ఉంటుందట. మనం ఏ కారు నడుపుతున్నామో, దాని ఇంజిన్​ వివరాలను సెలక్ట్​ చేసుకోవాలి. అప్పుడు, దానంతట అదే, బెస్ట్​- ఫ్యూయెల్​ ఎఫీషియెంట్​ రూట్​ని వెతికి మనకి చెబుతుంది.

"ఈ ఫీచర్​ని ఆన్​ చేస్తే.. ఫ్యూయెల్​ ఎఫీషియెన్సీపైనే గూగుల్​ మ్యాప్స్​ దృష్టిపెడుతుంది. రియల్​ టైమ్​ ట్రాఫిక్​తో పాటు ఇతర అంశాలను పరిగణించదు," అని గూగుల్​ చెబుతోంది.

ఇలా యాక్టివేట్​ చేసుకోవచ్చు..

ఇండియాలో ఈ ఫీచర్​ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. గూగుల్​ మ్యాప్స్​ ఓపెన్​ చేయండి.

స్టెప్​ 1:- మీ ఫోన్​లో ఓపెన్​ చేసిన గూగుల్​ మ్యాప్స్​లోని ప్రొఫైల్​ ఐకాన్​ క్లిక్​ చేయండి.

Tips to save petrol bill : స్టెప్​ 2:- నేవిగేషన్​ సెట్టింగ్స్​లోకి వెళ్లండి. అక్కడ రూట్​ ఆప్షన్స్​ కనిపిస్తాయి.

స్టెప్​ 3:- అందులోని ఆప్షన్స్​ని చూసి, ఫ్యూయెల్​ ఎఫీషియెన్స్​ రూట్​పై క్లిక్​ చేయండి. ఆ తర్వాత ఈకో- ఫ్రెండ్లీ రూటింగ్​పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 1:- ఆ తర్వాత మీ వెహికిల్​ ఇంజిన్​ని సెలక్ట్​ చేసుకోండి. అంతే!

మీరు ఇంజిన్​ వివరాలను చెప్పకపోతే.. ఆటోమెటిక్​గా పెట్రోల్​ ఆప్షన్​ని పిక్​ చేసుకుంటుంది గూగుల్​ మ్యాప్స్​. తమకు అందుబాటులో ఉన్న డేటాను వాడుకుని ఫ్యూయెల్​ ఎఫీషియెన్సీని లెక్కించి, మెరుగైన రూట్​ని ఇస్తామని గూగుల్​ చెబుతోంది. మరి ఇది ఇండియా రోడ్లపై ఏమేరకు ఫలితాల్ని ఇస్తుందో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం