Google Maps new features: గూగుల్ మ్యాప్స్ లో మూడు సరికొత్త యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్
Google Maps new features: గూగుల్ మ్యాప్స్ (Google Maps) లోకి మూడు సరికొత్త ఫీచర్స్ వచ్చాయి. వినియోగదారుల ట్రావెల్ ప్లాన్ మరింత సులభతరం అయ్యేలా ఈ ఫీచర్స్ ను రూపొందించారు.
Google Maps new features: గూగుల్ మ్యాప్స్ (Google Maps) లోకి మూడు సరికొత్త ఫీచర్స్ వచ్చాయి. వినియోగదారుల ట్రావెల్ ప్లాన్ మరింత సులభతరం అయ్యేలా ఈ ఫీచర్స్ ను రూపొందించారు.
glanceable directions: గ్లాన్సబుల్ డైరెక్షన్స్
కొత్తగా గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చిన ఫీచర్స్ లో గ్లాన్సబుల్ డైరెక్షన్స్ (glanceable directions) కీలకమైనది. లాక్ స్క్రీన్ పై, రూట్ ఓవర్ వ్యూపై కూడా ట్రావెల్ ప్రొగ్రెస్ ను ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ను ఇనేబుల్ చేసుకుని, గమ్యస్థానానికి చేర్చే వివిధ మార్గాలను చూపమని రిక్వెస్ట్ చేయడం ద్వారా.. ట్రిప్ ప్రొగ్రెస్ ను, మార్గంలో ముందు వచ్చే టర్నింగ్స్ గురించి, గమ్యస్థానానికి చేరే కచ్చితమైన సమయం గురించి రెగ్యులర్ గా తెలుసుకోవచ్చు. ఒకవేళ యూజర్ తన మార్గాన్ని మార్చుకుంటే కూడా, ఈ ఫీచర్ వెంటనే ట్రిప్ వివరాలను అప్ డేట్ చేస్తుంది. గతంలో ఈ ఫీచర్ ఫుల్ నేవిగేషన్ మోడ్ లో ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు లాక్ స్క్రీన్ పై, రూట్ ఓవర్ వ్యూపై కూడా ఇది అందుబాటులో ఉంటుంది. త్వరలో గూగుల్ మ్యాప్స్ (Google Maps) లో ఈ ఫీచర్ ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. వాకింగ్, సైక్లింగ్, డ్రైవింగ్ మోడ్స్ లో ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైజెస్ లో దీనిని అందుబాటులోకి తీసుకువస్తారు.
Recents: రీసెంట్స్ ఫీచర్ అప్ డేట్
యూజర్ల ఇటీవలి ట్రావెల్ వివరాలను తెలిపే రీసెంట్స్ (Recents) ఫీచర్ ను కూడా అప్ డేట్ చేశారు. ఈ అప్ డేటెడ్ ఫీచర్ ద్వారా గూగుల్ మ్యాప్స్ యూజర్స్ ఇటీవల వెళ్లిన అన్ని ముఖ్యమైన ప్రదేశాలను సేవ్ చేస్తుంది. ఈ ఫీచర్ గతంలో ఉన్నప్పటికీ.. తాజా అప్ డేట్ వల్ల గూగుల్ మ్యాప్స్ విండోను క్లోజ్ చేసినప్పటికీ.. యూజర్ వెళ్లిన ప్లేసెస్ సేవ్ అవుతాయి. తాజా అప్ డేట్ తో.. అవసరం లేదనుకున్న ప్లేసెస్ ను యూజర్ డిలీట్ చేసుకోవచ్చు. ఒకే సమయంలో ఒకటికి మించిన ట్రిప్స్ ను ప్లాన్ చేసుకోవచ్చు. నచ్చిన, లేదా నచ్చని ప్లేసెస్ ను షేర్ చేసుకోవచ్చు.
Immersive View: ఇమెర్సివ్ వ్యూ
గూగుల్ మ్యాప్స్ లో ఇమెర్సివ్ వ్యూ (Immersive View) ఫీచర్ ను మరిన్ని నగరాలకు, మరిన్ని ప్రముఖ ప్రదేశాలకు విస్తరించారు. తాజాగా, ఆమ్ స్టర్ డామ్, డబ్లిన్, ఫ్లారెన్స్, వెనిస్ నగరాలకు ఈ ఫీచర్ ను విస్తరించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 500లకు పైగా ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, ల్యాండ్ మార్క్స్ కు ఈ ఇమెర్సివ్ వ్యూ (Immersive View) ఫీచర్ అందుబాటులో ఉంది. ఆయా పర్యాటక ప్రదేశం లేదా ల్యాండ్ మార్క్ కు సంబంధించిన వేలాది ఫొటోలను కృత్రిమ మేథ సాంకేతికతతో కంబైన్ చేసి, 3డీ లో చూసేలా ఈ ఇమెర్సివ్ వ్యూ ఫీచర్ అవకాశం కల్పిస్తుంది.