తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Paytm Fastags : ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఫాస్టాగ్స్​ పనిచేస్తాయా? యూజర్స్​కి అలర్ట్​..

Paytm FASTags : ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఫాస్టాగ్స్​ పనిచేస్తాయా? యూజర్స్​కి అలర్ట్​..

Sharath Chitturi HT Telugu

05 February 2024, 17:30 IST

    • Will Paytm FASTags work : ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఫాస్టాగ్​ పనిచేస్తుందా? చేయకపోతే ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి..
ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఫాస్టాగ్స్​ పనిచేస్తాయా? యూజర్స్​కి అలర్ట్​..
ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఫాస్టాగ్స్​ పనిచేస్తాయా? యూజర్స్​కి అలర్ట్​..

ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఫాస్టాగ్స్​ పనిచేస్తాయా? యూజర్స్​కి అలర్ట్​..

PayTm Payments bank crisis : పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​పై కఠిన ఆంక్షలు విధిస్తూ.. యావత్​ ఫిన్​టెక్​ మార్కెట్​కే షాక్​ ఇచ్చింది ఆర్​బీఐ. ఫిబ్రవరి 29 తర్వాత.. ఈ పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​.. ఇక ఎలాంటి డిపాజిట్లను స్వీకరించలేదు. ఈ వార్తలతో.. పేటీఎం యూజర్లలో ఆందోళన మొదలైంది. మరీ ముఖ్యంగా.. పేటీఎం ఫాస్టాగ్​ విషయంలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో.. మీ ప్రశ్నలకు సమాధానాలను ఇక్కడ తెలుసుకోండి..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఫాస్టాగ్​ పనిచేస్తుందా?

దీనికి సమాధానం.. అవును- కాదు! ఫిబ్రవరి 29 తర్వాత కూడా పేటీఎం ఫాస్టాగ్​ పనిచేస్తుంది. కానీ అందులో మీరు డబ్బులను యాడ్​ చేసుకోలేరు. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​పై ఆర్​బీఐ ఆంక్షలు విధించడమే ఇందుకు కారణం. ఫలితంగా.. పేటీఎం ఫాస్టాగ్​ని మీరు టాప్​-అప్​ చేసుకోలేరు. వాలెట్​లో డబ్బులు అయిపోతే ఇక కష్టమే! ఫిబ్రవరి 29లోపు ఆర్​బీఐ.. తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే.. ఇక అంతే.

పేటీఎం ఫాస్టాగ్​ని వేరే బ్యాంక్​కు పోర్ట్​ చేసుకోవచ్చా?

Paytm FASTags closure : పేటీఎం ఫాస్టాగ్​ మాత్రమే కాదు. ఏ ఫాస్టాగ్​ని కూడా పోర్ట్​ చేసుకునే వెసులుబాటు ప్రస్తుతం ఇండియాలో లేదు. ఒక బ్యాంక్​ నుంచి ఇంకో బ్యాంక్​కు పోర్ట్​ చేసుకోలేము. వాలిడ్​ ఫాస్టాగ్​ లేకపోతే.. ఇతర బ్యాంక్​లలో కొత్తది తీసుకోవాల్సిందే!

ఇదీ చూడండి:- Paytm Payments Bank : 1000 అకౌంట్లు- 1 పాన్​.. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ చేసిన తప్పులు ఇవే!

పేటీఎం ఫాస్టాగ్​ని వదిలేసి.. వేరే బ్యాంక్​లో కొత్త ఫాస్టాగ్​ని తీసుకోవాల్సిందేనా?

ప్రస్తుతానికైతే.. ఆర్​బీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు చాలా తక్కువే అని తెలుస్తోంది. అంటే.. మార్చ్​ నుంచి సరైన బ్యాలెన్స్​ లేకపోతే, మీ పేటీఎం ఫాస్టాగ్స్​ పనిచేయకపోవచ్చు! వేరే బ్యాంక్​ నుంచి ఫాస్టాగ్​ కొనుక్కోవడం బెటర్​!

ఫాస్టాగ్స్​ విషయంపై పేటీఎం ఏం చేస్తోంది?

Paytm FASTags transfer to other banks : ప్రస్తుతం ఉన్న సంక్షోభం.. కస్టమర్లపై ప్రభావం చూపించకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ చెప్పింది. మార్చ్​ నాటికి ఒక సొల్యూషన్​ని తీసుకొస్తామని స్పష్టం చేసింది. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. నిపుణుల్లో అనుమానాలు కూడా ఉన్నాయి.

ఇతర బ్యాంక్​లకు చెందిన ఫాస్టాగ్స్​ని పేటీఎంలో రీఛార్జ్​ చేసుకోవచ్చా?

దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. యాప్​ని పేటీఎం ఎలా మాడిఫై చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే.. ఇతర ఈ ఆప్షన్​ ఉంది. భవిష్యత్తులో ఉంటుందో లేదో చెప్పలేము. ఎందుకైనా మంచిది.. గూగుల్​ పే, ఫోన్​ పేని వాడి, మీ ఫాస్టాగ్స్​ని రీఛార్జ్​ చేసుకోవడం బెటర్​.

తదుపరి వ్యాసం