PhonePe: స్టాక్ మార్కెట్ సేవల్లోకి ఫోన్ పే.. కొత్త యాప్ లాంచ్
PhonePe Share.Market app: ప్రముఖ యూపీఐ పేమెంట్స్ అగ్రిగేటర్ ‘ఫోన్ పే’ ఇప్పుడు స్టాక్ మార్కెట్ సేవల్లోకి కూడా ప్రవేశించింది. తాజాగా, షేర్ మార్కెట్ (Share.Market) పేరుతో ఒక యాప్ ను ఆవిష్కరించింది.
PhonePe Share.Market app: ప్రముఖ యూపీఐ పేమెంట్స్ అగ్రిగేటర్ ఫోన్ పే ఇప్పుడు స్టాక్ మార్కెట్ సేవల్లోకి కూడా ప్రవేశించింది. తాజాగా, షేర్ మార్కెట్ (Share.Market) పేరుతో ఒక యాప్ ను ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులకు స్టాక్స్, మ్యుచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ ల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పిస్తోంది. షేర్ మార్కెట్ (Share.Market) యాప్ డిస్కౌంట్ బ్రోకింగ్ ప్లాట్ ఫామ్ అని ఫోన్ పే వెల్లడించింది. వినియోగదారులకు స్టాక్స్ కు సంబంధించిన వివరాలను, సూచనలను అందిస్తామని తెలిపింది. నిపుణులైన టీమ్ సాయంతో రీసెర్చ్ ఆధారిత సేవలు అందిస్తామని వెల్లడించింది.
ట్రేడింగ్ సేవలు..
రిటైల్ ఇన్వెస్టర్లకు స్టాక్స్ కొనడం, స్టాక్స్ అమ్మడం, ఇంట్రా డే ట్రేడింగ్, మ్యుచ్యువల్ ఫండ్స్ లో పెట్టుబడులు, ఈటీఎఫ్ ల్లో పెట్టుబడులు.. మొదలైన విషయాల్లో సేవలు అందిస్తామని ఫోన్ పే వెల్లడించింది. తమ సేవలు మొబైల్ యాప్ ద్వారా లేదా వెబ్ ప్లాట్ ఫామ్ పై పొందవచ్చని తెలిపింది. 2022 లో ఫోన్ పే వెల్త్ డెస్క్, ఓపెన్ ఓ అనే రెండు వెల్త్ టెక్ ప్లాట్ ఫామ్స్ ను కొనుగోలు చేసింది. ఆ రెండు ప్లాట్ ఫామ్స్ విలువ సుమారు 70 మిలియన్ డాలర్లు. వెల్త్ సర్వీసెస్ విభాగంలో అడుగు పెట్టే ఉద్దేశంతోనే ఈ ప్లాట్ ఫామ్స్ ను ఫోన్ పే కొనుగోలు చేసింది.
ఫోన్ పే నంబర్ ద్వారానే..
ఫోన్ పే కు చెందిన షేర్ మార్కెట్ యాప్ లో స్టాక్స్ ట్రేడింగ్ కోసం ప్రత్యేకంగా మార్కెట్ సెక్షన్ ను పొందుపర్చారు. ఇందులో వాచ్ లిస్ట్ స్టాక్స్ మొదలైనవి ఉంటాయి. ఫొన్ పే తో లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ ద్వారా ఈ షేర్.మార్కెట్ యాప్ లోకి లాగిన్ కావచ్చు. ఆ తరువాత కేవైసీ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ జనరల్ అట్లాంటిక్ ఈ సంవత్సరం కీలక ప్రకటన చేసింది. ఫోన్ పే లో 100 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది.