Paytm Payments Bank : 1000 అకౌంట్లు- 1 పాన్​.. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ చేసిన తప్పులు ఇవే!-how paytm payments bank came under rbis radar ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Paytm Payments Bank : 1000 అకౌంట్లు- 1 పాన్​.. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ చేసిన తప్పులు ఇవే!

Paytm Payments Bank : 1000 అకౌంట్లు- 1 పాన్​.. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ చేసిన తప్పులు ఇవే!

Sharath Chitturi HT Telugu
Feb 04, 2024 11:23 AM IST

Paytm Payments Bank crackdown : పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​లో ఏం తప్పులు జరిగాయి? దానిపై ఆర్​బీఐ ఎందుకు కఠిన ఆంక్షలు విధించింది?

1000 అకౌంట్లు- 1 పాన్​.. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ చేసిన తప్పులు ఇవే!
1000 అకౌంట్లు- 1 పాన్​.. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ చేసిన తప్పులు ఇవే! (Bloomberg)

RBI's Paytm crackdown : ప్రముఖ ఫిన్​టెక్​ సంస్థ పేటీఎం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​పై ఆర్​బీఐ కఠిన ఆంక్షలు విధించడం ఇందుకు కారణం. మదుపర్లకు భారీ నష్టాలను తీసుకొస్తూ.. పేటీఎం స్టాక్​ రెండు రోజుల్లో 40శాతం పతనమైంది. అసలు ఆర్​బీఐ.. పేటీఎంపై ఎందుకు ఆంక్షలు వేసింది? అసలు పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ చేసిన తప్పులేంటి? ఇక్కడ తెలుసుకుందాము..

పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​పై ఆంక్షలకు కారణం..

సంబంధిత వర్గాల ప్రకారం.. సరైన ఐడెంటిఫికేషన్​ లేని వందలాది అకౌంట్స్​.. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​లో ఉన్నట్టు ఆర్​బీఐకి తెలిసింది. వీటికి సరైన కేవైసీ లేదు. అయినప్పటికీ.. పేటీఎం వేదికగా రూ. కోట్లల్లో లావాదేవీలు జరిగాయి. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్​ జరిగిందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.

అంతేకాకుండా.. 1000 యూజర్స్​కి సంబంధించిన అకౌంట్స్​ అన్నింటికీ.. ఒక్కటంటే ఒక్కటే పాన్​ (పర్మనెంట్​ అకౌంట్​ నెంబర్​) ఉన్నట్టు సమాచారం. ఈ విషయంపై పేటీఎం ఇచ్చిన నివేదిక కూడా తప్పుగానే ఉందని.. ఆర్​బీఐ వెరిఫికేషన్​ ప్రాసెస్​లో తేలింట. ఆర్​బీఐ ఒక్కటే కాదు.. ఎక్స్​టర్నల్​ ఆడిటర్స్​ కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది.

Paytm Payments Bank : 'వీటిల్లోని కొన్ని అకౌంట్స్​ ద్వారా మనీ లాండరింగ్​ జరిగి ఉంటుందని ఆర్​బీఐ అనుమానిస్తోంది,' అని సోర్స్​లు చెబుతున్నాయి. అంతేకాకుండా.. ఈ విషయాన్ని ఈడీకి కూడా చెప్పిందట. పూర్తి వ్యవహారంపై హోంశాఖతో పాటు ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా నివేదిక సమర్పించిందని తెలుస్తోంది.

అక్రమ కార్యకలాపాలు జరిగాయని ఏదైనా ఆధారాలు లభిస్తే.. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​పై దర్యాప్తు చేపట్టేందుకు ఈడీ సిద్ధంగా ఉందని సమాచారం. సంస్థతో పాటు అసోసియేటెడ్​ పార్టీల మధ్య కూడా నాన్​-డిస్ల్కోజర్​ ట్రాన్సాక్షన్​ జరిగాయని తెలుస్తోంది. ఇది రెగ్యులేటర్లకు మరింత ఆందోళన కలిగించే విషయం. సంస్థ గవర్నెన్స్​ విషయంలో కూడా లోపాలు ఉన్నట్టు ఆర్​బీఐ గుర్తించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం.. పేటీఎం మాతృసంస్థ వన్​97 కమ్యూనికేషన్స్​- పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ మధ్య చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నాయి.

Paytm share price target : సోర్స్​ల ప్రకారం.. పేటీఎం పేరెంట్​ కంపెనీ ద్వారా చేసిన లావాదేవీలు.. డేటా ప్రైవసీకి విరుద్ధంగా జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే.. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​లో ట్రాన్సాక్షన్స్​ని ఆర్​బీఐ నిలిపివేసింది. వినియోగదారులు సేవింగ్స్​ అకౌంట్స్​, వాలెట్స్​, ఫాస్టాగ్స్​, ఎన్​సీఎంసీ కౌంట్స్​పై ఇప్పటికప్పుడు ప్రభావం పడలేదు. కానీ.. ఫిబ్రవరి 29 వరకు.. థర్డ్​ పార్టీ యాప్స్​పై సంస్థ భారీగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారీగా పతనమైన పేటీఎం స్టాక్​..

ఆర్​బీఐ నిర్ణయం.. పేటీఎం స్టాక్​పై పెద్ద ప్రభావమే చూపించింది. వాస్తవానికి.. ఈ పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​పై షేర్​హోల్డర్స్​లో భారీ అంచనాలు ఉండేవని మార్కెట్​ నిపుణులు చెబుతున్నారు. ఈ సంస్థ.. ఓ పెద్ద ఎంటీటీగా మారే అవకాశం ఉందని గతంలో అంచనాలు ఉండేవని, కానీ ఆర్​బీఐ నిర్ణయంతో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.

Paytm share price : పేటీఎం స్టాక్​.. రెండు రోజుల్లో 40శాతం పతనమైంది. గురు, శుక్ర ట్రేడింగ్​ సెషన్స్​లో వరుసగా రెండుసార్లు 20శాతం లోవర్​ సర్క్యూట్​ని హిట్​ చేసింది ఈ స్టాక్​. ఫలితంగా.. ఐదు రోజుల ముందు రూ. 800 దగ్గర ఉన్న పేటీఎం షేర్​​.. ఇప్పుడు.. రూ. 487.20 వద్దకు పడిపోయింది.

సంబంధిత కథనం