RBI recruitment : ఆర్​బీఐలో పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి-rbi to recruit 25 pharmacist posts check full details and how to apply ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rbi To Recruit 25 Pharmacist Posts, Check Full Details And How To Apply

RBI recruitment : ఆర్​బీఐలో పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి

Sharath Chitturi HT Telugu
Mar 22, 2023 05:40 PM IST

RBI recruitment 2023 : ఆర్​బీఐలో ఫార్మసిస్ట్​ ఉద్యోగాలకు పోస్టులు పడ్డాయి. 25 ఫార్మసిస్ట్​ పోస్టుల కోసం ఆర్​బీఐ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆర్​బీఐలో పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి
ఆర్​బీఐలో పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి (MINT_PRINT)

RBI recruitment 2023 : ఆర్​బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా)లో ఫార్మసిస్ట్​ పోస్టులకు నోటిఫికేషన్​ పడింది. ఆర్​బీఐ అధికారిక వెబ్​సైట్​ అయిన rbi.org.in లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

మొత్తం 25 ఫార్మసిస్ట్​ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది ఆర్​బీఐ. అప్లికేషన్​లను పంపించేందుకు తుది గడవు 2023 ఏప్రిల్​ 10.

ఫార్మసిస్ట్​ పోస్టుల దరఖాస్తుకు అర్హత..

RBI recruitment news : ఫార్మసిస్ట్​ పోస్టులకు దరఖాస్తు చేయాలని భావిస్తున్న వారి కనీస విద్యార్హత 10 తరగతి. ఆ తర్వాత ఫార్మసీలో కనీసం డిప్లమా (1948 ఫార్మసీ యాక్ట్​ కింద గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో) ఉండాలి.

ఎంపిక ప్రక్రియ ఇలా..

అప్లికేషన్లను పరిశీలించిన అనంతరం.. అర్హులైన అభ్యర్థులను షార్ట్​లిస్ట్​ చేస్తుంది ఆర్​బీఐ. పీజీ, డిగ్రీ, డిప్లమా క్వాలిఫికేషన్ల ఆధారంగా ఈ షార్ట్​లిస్ట్​ను రూపొందిస్తుంది. ఆ తర్వాత వారిని ఇంటర్వ్యూ చేస్తుంది. ఇంటర్వ్యూలో సెలక్ట్​ అయిన వారికి వైద్య పరీక్ష, డాక్యుమెంట్​ వెరిఫికేషన్​ ప్రక్రియ ఉంటుంది. అందులో ఎంపికైన వారికి ఉద్యోగాలొస్తాయి.

RBI recruitment : అప్లికేషన్లను ఆన్​లైన్​లో సబ్మీట్​ చేసిన అనంతరం.. సంబంధిత డాక్యుమెంట్​లను 2023 ఏప్రిల్​ 10లోగా.. Regional Director, Human Resource Management Department, Recruitment Section, Reserve Bank of India, Mumbai Regional Office, Shahid Bhagat Singh Road, Fort, Mumbai – 400001 అడ్రస్​కు మెయిల్​ చేయాల్సి ఉంటుంది.

మహిళలకు గుడ్ న్యూస్..

తెలంగాణలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఓవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు రాగా... ఆయా శాఖల నుంచి కూడా వేర్వురు నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇక వైద్యారోగ్యశాఖ నుంచి కీలకమైన ప్రకటనలు విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ వైద్యారోగ్యశాఖ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1540 ఆశా వర్కర్ల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఖాళీల వివరాలను కూడా పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel