తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Paytm Crisis: పేటీఎం షేర్ల లావాదేవీలపై బీఎస్ఈ కీలక నిర్ణయం; డైలీ లిమిట్ 10 శాతానికి తగ్గింపు

Paytm crisis: పేటీఎం షేర్ల లావాదేవీలపై బీఎస్ఈ కీలక నిర్ణయం; డైలీ లిమిట్ 10 శాతానికి తగ్గింపు

HT Telugu Desk HT Telugu

03 February 2024, 18:39 IST

  • Paytm crisis: సిస్టమ్ ఆడిట్ రిపోర్ట్, ఎక్స్‌టర్నల్ ఆడిటర్ నివేదికను అనుసరించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించిన తర్వాత స్టాక్ మార్కెట్లో పేటీఎం షేర్లలో భారీ పతనం  చోటు చేసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ లావాదేవీలను ఫిబ్రవరి 29వ తేదీ నుంచి నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గత వారం గురు, శుక్ర వారాల్లో వరుసగా రెండు సెషన్లలో పేటీఎం షేరు 20 శాతం చొప్పున లోయర్ సర్క్యూట్ ను తాకాయి. దాంతో స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్ఈ పేటీఎం షేర్ల రోజువారీ పరిమితిని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది.

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ పై నిషేధం

సిస్టమ్ ఆడిట్ నివేదిక, ఎక్స్ టర్నల్ ఆడిటర్ల నివేదిక తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జనవరి 31 న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) పై ఆంక్షలు విధించింది. దాంతో, పేటీఎం షేర్లు కుప్పకూలిపోయాయి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 లోని సెక్షన్ 35 ఎ కింద ఫిబ్రవరి 29 తర్వాత ఏదైనా కస్టమర్ ఖాతా, వాలెట్లు లేదా ఫాస్టాగ్లలో డిపాజిట్లు లేదా టాప్-అప్ లను స్వీకరించకూడదని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ పై ఆర్బీఐ నిషేధం విధించింది.

ఆర్బీఐ అనుమతి

వన్97 కమ్యూనికేషన్స్ మరియు పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క నోడల్ ఖాతాలను వీలైనంత త్వరగా రద్దు చేయాలని ఆర్బిఐ పేర్కొంది. ముఖ్యంగా తమ డిజిటల్ వాలెట్ల వ్యాపారానికి బ్యాంకింగ్ సేవలను అందించడానికి పేటీఎంతో వేరే బ్యాంక్ ఏదైనా భాగస్వామ్యానికి కూడా ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి అవసరమని నివేదికలు చెబుతున్నాయి.

వేేరే బ్యాంక్ తో టై అప్..

ఆర్బీఐ నిషేధం తర్వాత, పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఫిబ్రవరి 1, గురువారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL) తో కాకుండా ఇతర బ్యాంకులతో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తామని తెలిపింది. వేరే బ్యాంక్ లతో ఒప్పందం కుదుర్చుకుని పేటీఎంలో డిజిటల్ కార్యకలాపాలు కొనసాగిస్తామని పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. అది పెద్ద సమస్య కాదని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త బ్యాంకింగ్ సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా డిజిటల్ వాలెట్ వ్యాపారాన్ని కొనసాగిస్తామన్నారు.

20% లోయర్ సర్క్యూట్

వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు ఫిబ్రవరి 1 నుంచి వరుసగా 20 శాతం లోయర్ సర్క్యూట్లను తాకడంతో కేవలం రెండు రోజుల్లోనే పేటీఎం షేర్ల నుంచి సుమారు రూ.45,000 కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. శుక్రవారం పేటీఎం షేరు ధర రూ.487.2 వద్ద, 2022 నాటి రికార్డు కనిష్టానికి దగ్గరగా వచ్చింది. ప్రస్తుతం కంపెనీ విలువ 3.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తుందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా శనివారం వెల్లడించారు.

తదుపరి వ్యాసం