తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bomb Threats To Flights: ఒక్కరోజే 70 కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు

Bomb threats to flights: ఒక్కరోజే 70 కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు

Sudarshan V HT Telugu

24 October 2024, 17:57 IST

google News
  • Bomb threats to flights: భారతీయ విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. గత వారం రోజుల్లో 300 కు పైగా విమానాలు బాంబు బెదరింపులను ఎదుర్కొన్నాయి. తాజాగా, గురువారం ఒక్కరోజే 70 కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వాటిలో ఎయిరిండియా, విస్తారా, ఇండిగో, అకాశ ఎయిర్ కు చెందిన విమానాలున్నాయి.

70 కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు
70 కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు

70 కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు

Bomb threats to flights: వివిధ భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 70కి పైగా విమానాలకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిరిండియా, విస్తారా, ఇండిగోకు చెందిన 20 విమానాల రాకపోకలకు, అకాసా ఎయిర్ కు చెందిన 14 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన మొత్తం 20 దేశీయ, అంతర్జాతీయ విమానాలకు గురువారం భద్రతాపరమైన హెచ్చరికలు అందాయి. అవన్నీ ఫేక్ బెదిరింపులని తేలిందని, అయినా, తాము సంబంధిత అధికారులతో కలిసి, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించామని ఎయిర్ లైన్స్ ప్రకటించాయి.

అన్ని ఎయిర్ లైన్స్ కు బెదిరింపులు

తమ ఎయిర్ లైన్స్ విమానాలకు కూడా గురువారం బాంబు బెదిరింపులు అందాయని అకాసా ఎయిర్ ప్రతినిధి పేర్కొన్నారు. అకాసా ఎయిర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని, సెక్యూరిటీ, రెగ్యులేటరీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపారు. స్థానిక అధికారుల సమన్వయంతో అన్ని భద్రతా విధానాలను అనుసరిస్తున్నాంమని అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

వారిపై చర్యలు

విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపుల సమస్యను పరిష్కరించడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని, అలాంటి బెదిరింపులకు పాల్పడిన వారిని నో ఫ్లై జాబితాలో చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ఈ వారం ప్రారంభంలో చెప్పారు.

సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ కు వార్నింగ్

సోషల్ మీడియా (SOCIAL MEDIA) ప్లాట్ ఫాం ఎక్స్ కు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఇటీవలి కాలంలో దేశీయ, అంతర్జాతీయ విమానాలను లక్ష్యంగా చేసుకుని నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నవారు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగానే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. దాంతో, ప్రభుత్వం ఎక్స్ (గతంలో ట్విట్టర్)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి ఖాతాలను నిలిపివేయాలని, వారి వివరాలను తమకు అందజేయాలని కోరింది. గత ఎనిమిది రోజుల్లో, 150 కి పైగా విమానాలకు నకిలీ బెదిరింపులు వచ్చాయి. దీని వల్ల ఎయిర్ లైన్స్ కు భారీగా ఆర్థిక నష్టమే కాకుండా, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అకాసా, ఎయిరిండియా, ఇండిగో, విస్తారా విమానయాన సంస్థలు ఢిల్లీ నుంచి వివిధ గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నడుపుతున్నాయి.

సైబర్ సెక్యూరిటీ చర్యలు

ఈ బెదరింపులకు పాల్పడుతున్న సుమారు 10 సోషల్ మీడియా ఖాతాలను సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు సోమవారం నుండి నిలిపివేశాయి. ఈ బెదిరింపులకు పాల్పడుతున్నవారి భౌగోళిక ప్రదేశాలను గుర్తించడానికి చురుకుగా పనిచేస్తున్నాయి. విమానయాన సంస్థలపై బాంబు బెదిరింపులకు సంబంధించిన అన్ని కేసులను చట్ట అమలు సంస్థలు చురుకుగా దర్యాప్తు చేస్తున్నాయని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయని ప్రభుత్వం ధృవీకరించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంటోందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కృషి చేస్తున్నామని పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు.

తదుపరి వ్యాసం