Civil Aviation Minister: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు ఇక మహర్దశ.. విమానయాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు
Civil Aviation Minister: భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు వస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దుతామన్నారు.
Rammohan Naidu: కేంద్ర క్యాబినెట్‌లో అతి చిన్న వియస్కుడైన తనపై నరేంద్ర మోదీ నమ్మకంతో పై పెట్టిన బాధ్యతల్ని నెరవేరుస్తానని రామ్మోహన్ నాయుడు చెప్పారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఢిల్లీలో బాధ్యతలు చేపట్టారు.
ప్రతి డిపార్ట్‌మెంట్‌లో 100రోజుల ప్రణాళికను అమలు చేయనున్నట్టు చెప్పారు. ఐదేళ్లు సివిల్ ఎవియేషన్ మినిస్ట్రీలో బలమైన పునాదులు వేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. దేశంలో ఈజ్ ఆఫ్ ఫ్లైయింగ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తానని, సామాన్యులు కూడా విమానయానం చేసేలా 100డేస్ యాక్షన్ ప్లానింగ్, రానున్న 25ఏళ్ల ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.
పర్యావరణ అనుకూలంగా తన మంత్రిత్వ శాఖను తీర్చిదిద్దుతానని చెప్పారు. పర్యావరణ హితంగా తమ శాఖను తీర్చిదిద్దుతామని రామ్మోహన్ చెప్పారు. ఎయిర్ పోర్ట్‌లకు కావాల్సిన బడ్జెట్ లభిస్తుందన్నారు. టైర్ 2, టైర్ 3 సిటీలకు కూడా విమాన సదుపాయాలను విస్తరిస్తామన్నారు. సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులో తీసుకొస్తామన్నారు.
2014లో అశోక్ గజపతి కేంద్ర మంత్రిగా విమానయాన మంత్రిత్వ శాఖను నిర్వహించారని, ఆయన వచ్చాక ఏపీలో విమాన యాన రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారని, ఆయన దార్శనికతతోనే విమానయాన రంగం ముందుకు వెళ్లిందన్నారు.
ఉడాన్ స్కీమ్‌ను అశోక్ గజపతి హయంలోనే ప్రారంభించారని ఎంతోమంది దాని ద్వారా విమానయానం అందుబాటులోకి వచ్చిందన్నారు. దేశంలో మరింత డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. విమానయానశాఖలో సింధియా అమలు చేసిన సంస్కరణలు కొనసాగిస్తామన్నారు. గత పదేళ్లుగా వికసిత్ భారత్‌లో భాగంగా విమానయాన రంగంలో చాలా మార్పులు వచ్చాయన్నారు.
ఏపీలో రాజమండ్రి, కడప, కర్నూలు విమానాశ్రయాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఏవియేషన్ రంగంలో స్కిల్ నైపుణ్యాలను పెంచుతామన్నారు. ఏవియేషన్ ఇండస్ట్రీ అవసరాలను అనుగుణంగా ఉపాధి రంగాన్ని మెరుగుపరుస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవసరాలను కూడా ఖచ్చితంగా గుర్తించి వారికి సహకరిస్తామని ప్రకటించారు. తెలంగాణలో కూడా సివిల్ ఏవియేషన్ అవసరాలను తీర్చేందుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. విజయవాడ విమానాశ్రయంలో ఉన్న సమస్యలను చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా గుర్తించినట్టు రామ్మోహన్ నాయుడు చెప్పారు.
విజయవాడ కేంద్రంగా ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీని అభివృద్ధి చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల ప్రధాన నగరాలకు, ఇతర దేశాలకు కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. అమరావతి రాజధానిగా కేంద్రం గుర్తించిందని, విజయవాడ నగర విమానాశ్రయాన్ని రాజధాని అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేస్తామన్నారు.