Oppo Reno 11 : లాంచ్‌కు రెడీ అవుతున్న ఒప్పో రెనో 11 సిరీస్.. ఫీచర్స్ ఇవేనా?
10 November 2023, 13:40 IST
- Oppo Reno 11 : ఒప్పో రెనో 11 సిరీస్.. లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లోని స్మార్ట్‌ఫోన్స్‌కు చెందిన ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆ వివరాలు..
ఒప్పో రెనో 11 సిరీస్..
Oppo Reno 11 : రెనో 11 సిరీస్‌ని ఒప్పో సంస్థ తయారు చేస్తున్న సమాచారం. చైనా మార్కెట్లో లాంచ్‌కు ఈ సిరీస్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ నెల 23న చైనాలో ఓ ఈవెంట్ ఉంటుందని, ఇందులో లాంచ్ అయ్యే గ్యాడ్జెట్ ఈ ఒప్పో రెనో 11 సిరీస్ అని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. వీటన్నింటి మధ్య.. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కీలక ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆ వివరాలు..
ఒప్పో రెనో 11 సిరీస్ ఫీచర్స్ ఇవేనా?
ఆన్లైన్లో లీక్ అయిన డేటా ప్రకారం.. ఈ ఒప్పో రెనో 11 సిరీస్ డిజైన్.. ఈ ఏడాది తొలినాళ్లల్లో లాంచ్ అయిన ఒప్పో రెనో 10ని పోలి ఉంటుంది. ఇక త్వరలో రాబోతున్న స్మార్ట్‌ఫోన్ రేర్‌లో ఎలిప్టికల్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. రెండు కెమెరా రింగ్స్ ఉంటాయి. టాప్ కెమెరా రింగ్‌లో 2 కెమెరా సెన్సార్లు, రెండొవ రింగ్‌లో మూడో లెన్స్ ఉన్నాయి.
Oppo Reno 11 pro : ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ప్రో మోడల్లో.. కర్వ్డ్ ఎడ్జ్‌తో కూడిన ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుందట. 1.5కే రిసొల్యూషన్ దీని సొంతం. ఈ గ్యాడ్జెట్లో డైమెన్సిటీ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్సెట్ ఉండనుందని టాక్ నడుస్తోంది. ఒప్పో రెనో 10 ప్రో+ లోనూ ఇదే ప్రాసెసర్ ఉంది.
ఇతర లీక్స్ ప్రకారం.. ఇక రెనో 11లో డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది. ఒప్పో రెనో 10 ప్రోలో ఈ ప్రాసెసర్‌ని చూడవచ్చు. ఈ బేస్ వెరియంట్లోనూ కర్వ్డ్ ఎడ్జ్‌లతో కూడిన ఓఎల్ఈడీ ప్యానెల్ ఉండొచ్చు.
Oppo Reno 11 pro price : ఇక ఈ సిరీస్‌లోని రెనో 11, రెనో 11 ప్రో మోడల్స్‌లో 32ఎంపీ టెలిఫొటో కెమెరా, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ వంటివి వస్తాయి. ఈ రెండిట్లోనూ ప్లాస్టిక్ మిడల్ ఫ్రేమ్ ఉంటుంది.
కాగా.. రెనో 10 ప్రో+ వేరియంట్లో పెరిస్కోపిక్ టెలిఫొటో కెమెరా ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకరాం.. ఒప్పో రెనో 11 సిరీస్‌లో ఎలాంటి ప్రో+ ఉండదట! అంటే.. ఈసారి రెండు మోడల్స్ మాత్రమే లాంచ్ అవుతాయని తెలుస్తోంది. అవి.. రెనో 11, రెనో 11 ప్రో. అంటే.. ఈ సిరీస్‌లో పెరిస్కోపిక్ టెలిఫొటో కెమెరా లేనట్టే!
Oppo Reno 11 features : ఈ ఒప్పో కొత్త సిరీస్‌కు సంబంధించిన ఇతర ఫీచర్స్, ధర వంటి వివరాలపై ప్రస్తుతం సమాచారం లేదు. సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇండియా లాంచ్పైనా సంస్థ స్పందించాల్సి ఉంది.