తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oppo Find X6 Pro Specifications : ఒప్పో ఫైండ్​ ఎక్స్​6 ప్రో స్పెసిఫికేషన్స్​ లీక్​..!

Oppo Find X6 Pro Specifications : ఒప్పో ఫైండ్​ ఎక్స్​6 ప్రో స్పెసిఫికేషన్స్​ లీక్​..!

22 November 2022, 10:22 IST

google News
    • Oppo Find X6 Pro Specifications : ఫైండ్​ ఎక్స్​ సిరీస్​ను రివీల్​ చేసే పనిలో ఒప్పో ఉన్నట్టు తెలుస్తోంది. ఈలోపే.. ఫైండ్​ ఎక్స్​6 ప్రో స్పెసిఫికేషన్స్​ లీక్​ అయ్యాయి.
ఒప్పో ఫైండ్​ ఎక్స్​
ఒప్పో ఫైండ్​ ఎక్స్​

ఒప్పో ఫైండ్​ ఎక్స్​

Oppo Find X6 Pro Specifications : ఒప్పో నుంచి మరో స్మార్ట్​ఫోన్​ సిరీస్​ వస్తున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పో ఫైండ్​ ఎక్స్​6 సిరీస్​లో ఒప్పో ఫైండ్​ ఎక్స్​6, ఒప్పో ఫైండ్​ ఎక్స్​6 ప్రో మొబైల్స్​ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ సిరీస్​ లాంచ్​ డేట్​పై సంస్థ.. అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇంతలో ఒప్పో ఫైండ్​ ఎక్స్​6 ప్రోకు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి.

లీక్స్​ ప్రకారం.. ఒప్పో ఫైండ్​ ఎక్స్​6 ప్రోలో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ఎస్​ఓసీ ఉండొచ్చు. అదే సమయంలో ఒప్పో ఫైండ్​ ఎక్స్​6లో స్నాప్​డ్రాగన్​ 8 ప్లస్​ జెన్​ 1 ఎస్​ఓసీ ఉండే అవకాశం ఉంది.

Oppo Find X6 Pro : డిజిటల్​ ఛాట్​ స్టేషన్​ అనే టిప్​స్టర్​.. ఒప్పో ఫైండ్​ ఎక్స్​6 ప్రోకి సంబంధించిన కెమెరా స్పెసిఫికేషన్లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. టిప్​స్టర్​ ప్రకారం.. ఒప్పో ఫైండ్​ ఎక్స్​6 ప్రోలో 50ఎంపీ ట్రిపుల్​ రేర్​ కెమెరాలు ఉండొచ్చు. సోనీ ఐఎంఎక్స్​989 సెన్సార్​లు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఆప్టికల్​ ఇమేజ్​ స్టెబిలైజేషన్​ సపోర్టు ఈ సెన్సార్​కు ఉండొచ్చు.

టిప్​స్టర్​ ప్రకారం.. ప్రస్తుతం ఉన్న ఒప్పో ఫైండ్​ ఎక్స్​6 ప్రో థిక్​నెస్​ 9.3ఎంఎం. లెన్స్​ మాడ్యూల్​తో కలుపుకుని.. ఫోన్​ థిక్​నెస్​ 14ఎంఎం.

గతంలో వెలువడిన లీక్స్​ ప్రకారం.. ఒప్పో నుంచి రానున్న స్మార్ట్​ఫోన్​లో మారిసిలికాన్​ ఎక్స్​ చిప్​సెట్​ ఉండొచ్చు.

ఒప్పో ఎక్స్​5...

Oppo Find X5 Pro : ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒప్పో ఫైండ్​ ఎక్స్​5, ఒప్పో ఫైండ్​ ఎక్స్​5 ప్రో, ఒప్పో ఫైండ్​ ఎక్స్​5 లైట్​లను లాంచ్​ చేసింది స్మార్ట్​ఫోన్​ సంస్థ. ఒప్పో ఫైండ్​ ఎక్స్​5 ప్రోలో ఆక్టా కోర్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 1 ఎస్​ఓసీ ఉంది. 6.7ఇంచ్​ 10బిట్​ క్యూహెచ్​డీ ఆమోలెడ్​ డిస్​ప్లే దీని సొంతం. ఇందులోనూ ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. 5,000ఎంఏహెచ్​ డ్యూయెల్​ సెల్​ బ్యాటరీ దీని సొంతం.

తదుపరి వ్యాసం