Oppo ColorOS 13 Update: ఒప్పో మొబైల్ వాడుతున్నారా.. మీ ఫోన్‍కు కలర్ఓఎస్ 13 ఎప్పుడు వస్తుందంటే!
07 November 2022, 12:05 IST
- ColorOS 13 Update for Oppo Smartphones: ఆండ్రాయిడ్ 13 బేస్డ్ కలర్ఓఎస్ 13 అప్‍డేట్ గురించి ఒప్పో వెల్లడించింది. ఏ మోడల్స్ కు.. ఎప్పుడు ఈ కొత్త యూఐ అప్‍డేట్‍ను ఇవ్వనున్నది ప్రకటించింది.
oppo mobile: ఒప్పో మొబైల్స్‌కు కలర్ఓఎస్ అప్‌డేట్
ColorOS 13 Update for Oppo Smartphones: పాపులర్ బ్రాండ్ ఒప్పో (Oppo).. కలర్ఓఎస్ 13 యూఐని సిద్ధం చేసింది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఈ కలర్ఓఎస్ 13 (ColorOS 13) అప్‍డేట్‍లను స్మార్ట్ ఫోన్‍లకు ఇవ్వనుంది. ఈ అప్‍డేట్ రోల్అవుట్‍ను ఇదేనెలలో ప్రారంభించనున్నట్టు ఒప్పో వెల్లడించింది. కొన్ని మోడళ్లకు బీటా వెర్షన్.. మరికొన్నింటికి స్టేబుల్ వెర్షన్ కూాడా ఇదే నెలలో ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మొత్తంగా ఇండియాలో ఒప్పో మొబైళ్లకు కలర్ఓఎస్ 13 రోల్అవుట్ ప్లాన్‍ను వెల్లడించింది. ఆ వివరాలు ఇవే.
ColorOS 13 Update: కలర్ఓఎస్ 13 బీటా ఈ మొబైళ్లకు..
ఒప్పో రెనో 6 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్19 ప్రో+ మొబైళ్లకు నవంబర్ 9వ తేదీ నుంచి కలర్ఓఎస్ 13 బీటా (ColorOS 13 Beta) వెర్షన్‍ను ఇవ్వనున్నట్టు ఒప్పో చెప్పింది. ఒప్పో ఏ74 5జీకి నవంబర్ 18న ఈ అప్‍డేట్ అందుతుంది. ఒప్పో రెనో 8 ప్రో 5జీ, ఒప్పో రెనో 8 5జీ, ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ, ఒప్పో రెనో 7 ప్రో 5జీ, ఒప్పో రెనో 7 5జీ, ఒప్పో రెనో 6 5జీ, ఒప్పో ఎఫ్21 ప్రో, ఒప్పో కే10 5జీ, ఒప్పో కే 10, ఒప్పో ఏ96, ఒప్పో ఏ76 స్మార్ట్ ఫోన్‍లకు ఇప్పటికే కలర్ఓఎస్ 13 బీటా వెర్షన్ అప్‍డేట్‍ను రోల్అవుట్ చేసినట్టు ఆ సంస్థ వెల్లడించింది.
ColorOS 13 Stable Update for Oppo Smartphones: కలర్ఓఎస్ 13 స్టేబుల్ వెర్షన్ ముందుగా వీటికే..
ఒప్పో రెనో 8 ప్రో 5జీ మొబైల్‍కు కలర్ఓఎస్ 13 స్టేబుల్ వెర్షన్ అప్‍డేట్‍ను నవంబర్ 8వ తేదీ నుంచి అందించనున్నట్టు ఒప్పో ప్రకటించింది. ఒప్పో రెనో 8 5జీ, ఒప్పో కే10 5జీ ఫోన్‍లకు నవంబర్ 18 నుంచి స్టేబుల్ వెర్షన్ అందుతుంది. ఆ తర్వాత మిగిలిన స్మార్ట్ ఫోన్‍లకు ఈ స్టేబుల్ వెర్షన్ అప్‍డేట్ రానుంది.
ColorOS 13 Features: కలర్ఓఎస్ 13 ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ఓఎస్ 13ను ఒప్పో లాంచ్ చేసింది. ఈ కొత్త యూఐలో అక్వామార్ఫిక్ డిజైన్ ఉంటుంది. అంటే నీటి నుంచి ఈ డిజైన్‍కు స్ఫూర్తి పొందడంతో.. ఇంటర్ఫేస్‍లో బ్లూ హ్యూస్ కాస్త ఎక్కువగా ఉంటాయి. సెక్యూరిటీ ఫీచర్లు మరింత అత్యుత్తమంగా ఉండేలా డైమనిక్ కంప్యూటింగ్ ఇంజిన్‍ను ఈ కొత్త యూఐలో తీసుకొచ్చింది ఒప్పో.
కలర్ ఓఎస్13 యూఐలో ఇంటర్నెట్, వైఫై టూగుల్స్ సైజ్ కూడా పెద్దగా మారనున్నాయి. ప్లేబ్యాక్ డివైజ్, సోర్స్ లను స్విచ్ చేసుకునేలా ప్లేబ్యాక్ కంట్రోల్ విడ్జెట్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్‍ప్లేలోనే ప్లే బ్యాక్‍ను కంట్రోల్ చేసుకునే సదుపాయం కూడా ఉండనుంది.
ముందుగా టెస్టింగ్ కోసం బీటా వెర్షన్‍లను మొబైల్ తయారీ సంస్థలు ఇస్తుంటాయి. బీటా వెర్షన్‍లో ఏవైనా బగ్స్ తలెత్తితే.. వాటిని పూర్తిగా ఫిక్స్ చేసి స్టేబుల్ వెర్షన్‍ను తీసుకొస్తాయి. ఇష్టమైన యూజర్లు ముందుగా కొత్త ఫీచర్లు కావాలంటే మొబైల్‍లో బీటా వెర్షన్ అప్‍డేట్ చేసుకోవచ్చు. అయితే కొన్ని బగ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైనా పర్వాలేదనుకుంటే స్టేబుల్ వెర్షన్ కోసం వేచిచూడవచ్చు.