Oppo A79 5G: ఇండియాలో లాంచ్ అయిన ఒప్పొ ఏ 79 స్మార్ట్ ఫోన్; 20 వేల లోపు ధరకే ప్రీమియం 5 జీ ఫోన్
27 October 2023, 20:57 IST
Oppo A79 5G: 5జీ స్మార్ట్ ఫోన్ ఏ 79 (Oppo A79 5G) ను ఒప్పొ భారత్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ అక్టోబర్ 28 నుంచి అన్ని ఈకామర్స్ సైట్స్ లో, ఒప్పొ స్టోర్స్ లో, ఇతర రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది.
ప్రతీకాత్మక చిత్రం
Oppo A79 5G: పండుగ సందర్భంగా కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ఒప్పొ తన లేటెస్ట్ 5జీ ఫోన్ A79 5G ను భారత్ లో లాంచ్ చేసింది. రూ. 20 వేల లోపు ధరలో, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువస్తోంది.
Oppo A79 5G: ఒప్పొ ఏ 79 5జీ ఫీచర్స్, స్పెసిఫికషన్స్
ఒప్పొ ఏ 79 5జీ స్మార్ట్ ఫోన్ గ్లోయింగ్ గ్రీన్, మిస్టరీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది కేవలం 193 గ్రాముల బరువుతో స్లీక్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, 90 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్ తో 6.72 ఇంచ్ ల ఎఫ్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. ఒప్పొ ఏ 79 5జీ స్మార్ట్ ఫోన్ లో 50MP AI కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో మీడియాటెక్ 6020 ఎస్ఓసీ ప్రాసెసర్ ను అమర్చారు. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. 1 టీబీ వరకు స్టోరేజ్ ను ఎక్సటర్నల్ గా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 33W ఛార్జర్‌తో 5000mAh బ్యాటరీ ని పొందుపర్చారు.
ధర, ఇతర వివరాలు..
ఒప్పొ ఏ 79 5జీ స్మార్ట్ ఫోన్ ధరను రూ. 19,999 లుగా నిర్ణయించారు. ఇవి ఫ్లిప్ కార్ట్, ఆమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్స్ లోనూ, ఒప్పొ స్టోర్స్ లోనూ, ఇతర రిటైల్ స్టోర్స్ లోనూ అక్టోబర్ 28 నుంచి అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. పండుగ సీజన్ సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏయూ ఫైనాన్స్ బ్యాంక్ ల క్రెడిట్ కార్డ్స్ తో 9 నెలల నో కాస్ట్ ఈఎంఐ విధానంలో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే రూ. 4 వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
టాపిక్