OPPO Find N3 Flip : ఇండియాలో ఒప్పో ఫైండ్​ ఎన్​3 ఫ్లిప్​ లాంచ్​.. ధర ఎంతంటే!-oppo find n3 flip launched in india check price and features here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oppo Find N3 Flip : ఇండియాలో ఒప్పో ఫైండ్​ ఎన్​3 ఫ్లిప్​ లాంచ్​.. ధర ఎంతంటే!

OPPO Find N3 Flip : ఇండియాలో ఒప్పో ఫైండ్​ ఎన్​3 ఫ్లిప్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Oct 13, 2023 07:20 AM IST

OPPO Find N3 Flip : ఇండియాలో ఒప్పో ఫైండ్​ ఎన్​3 ఫ్లిప్​ లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వివరాలివే..

ఇండియాలో ఒప్పో ఫైండ్​ ఎన్​3 ఫ్లిప్​ లాంచ్​..
ఇండియాలో ఒప్పో ఫైండ్​ ఎన్​3 ఫ్లిప్​ లాంచ్​..

OPPO Find N3 Flip : ఒప్పో ఫైండ్​ ఎన్​3 ఫ్లిప్​ మోడల్​ తాజాగా ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఇది.. ఫైండ్​ ఎన్​2 ఫ్లిప్​కి నెక్స్ట్​ వర్షెన్​. ఈ నేపథ్యంలో ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఈ ఫ్లిప్​ ఫోన్​ విశేషాలివే..

ఒప్పో ఫైండ్​ ఎన్​3 ఫ్లిప్​లో.. 6.8 ఇంచ్​ ఇన్నర్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 403పీపీఐ పిక్సెల్​ డెన్సిటీ, 1600 నిట్​ పీక్​ బ్రైట్​నెస్​, 120హెచ్​జెడ్​ అడాప్టివ్​ రిఫ్రెష్​ రేట్​ దీని సొంతం. ఇక 3.26 ఇంచ్​ ఔటర్​ అమోలెడ్​ స్క్రీన్​ కూడా ఇందులో ఉంటుంది. 720x382 పిక్సెల్స్​, 60 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, 900 నిట్​ పీక్​ బ్రైట్​నెస్​ దీని సొంతం.

OPPO Find N3 Flip price : ఈ ఫ్లిప్​ ఫోన్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 9200 ఎస్​ఓసీ చిప్​సెట్​ ఉంటుంది. 12జీబీ ర్యామ్​- 265జీబీ స్టోరేజ్​ లభిస్తోంది.

ఇక ఈ ఒప్పో ఫైండ్​ ఎన్​3 ఫ్లిప్​లో 50ఎంపీ ప్రైమరీ, 32ఎంపీ టెలిఫొటో, 48ఎంపీ అల్ట్రవైడ్​ రేర్​ కెమెరా వస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సైతం లభిస్తోంది. ఆండ్రాయిడ్​ 13 ఆధారిత కలర్​ఓఎస్​ 13.2 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది. 4ఏళ్ల పాటు సాఫ్ట్​వేర్​ అప్డేట్స్​ ఇస్తామని సంస్థ చెబుతోంది.

ఈ మొబైల్​ ధర ఎంతంటే..

OPPO Find N3 Flip price in India : ఇండియా మార్కెట్​లోకి గురువారం లాంచ్​ అయిన ఈ ఒప్పో ఫైండ్​ ఎన్​3 ఫ్లిప్ ధర రూ. 94,999గా ఉంది. స్లీక్​ బ్లాక్​, క్రీమ్​ గోల్డ్​ కలర్​ ఆప్షన్స్​ లభిస్తున్నాయి. అక్టోబర్​ 22 నుంచి ఈ మోడల్​ సేల్స్​ మొదలుతాయి. ఆసక్తి గల వారు.. అధికారిక వెబ్​సైట్​ను సందర్శించాల్సి ఉంటుంది.

ఒప్పో ఏ77ఎస్​ ఫీచర్స్​ చూశారా..?

ఇండియా మార్కెట్​పై ఒప్పో సంస్థ ఎక్కువగానే ఫోకస్​ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నెలలో ఇప్పటికే ఒక స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేసింది. దీని పేరు ఒప్పో ఏ77ఎస్​. జూన్​లో లాంచ్​ అయిన ఒప్పో ఏ77 లైనప్​లోదే ఇది!

OPPO Find N3 Flip featues : ఈ గ్యాడ్జెట్​ ధర రూ. 17,999. ఈ ఫోన్ అక్టోబర్ 7 నుంచి అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం