తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oppo A38 : బడ్జెట్​ ఫ్రెండ్లీ ఒప్పో ఏ38 ఫీచర్స్​, ధర లీక్​..!

Oppo A38 : బడ్జెట్​ ఫ్రెండ్లీ ఒప్పో ఏ38 ఫీచర్స్​, ధర లీక్​..!

Sharath Chitturi HT Telugu

27 August 2023, 18:30 IST

google News
    • Oppo A38 : బడ్జెట్​ ఫ్రెండ్లీ ఒప్పో ఏ38 ఫీచర్స్​, ధర లీక్​ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఒప్పో ఏ38 ఫీచర్స్​, ధర లీక్​.. పూర్తి వివరాలివే!
ఒప్పో ఏ38 ఫీచర్స్​, ధర లీక్​.. పూర్తి వివరాలివే! (HT Tech/ Representative image)

ఒప్పో ఏ38 ఫీచర్స్​, ధర లీక్​.. పూర్తి వివరాలివే!

Oppo A38 : సరికొత్త ఎంట్రీ లెవల్​ స్మార్ట్​ఫోన్​ను ఒప్పో సంస్థ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే.. ఒప్పో ఏ38! అంతర్జాతీయ మార్కెట్​లో ఈ మోడల్​ను త్వరలోనే లాంచ్​ చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన సర్టిఫికేషన్స్​ ఇప్పటికే అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలు లీక్​ అయ్యాయి. వాటిని ఇక్కడ తెలుసుకుందాము..

బడ్జెట్​ ఫ్రెండ్లీ ఒప్పో స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ ఇవే..!

లీక్స్​ ప్రకారం.. ఒప్పో ఏ38లో 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.56 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. 16.7 మిలియన్​ కలర్స్​ను ఈ డివైజ్​ సపోర్ట్​ చేస్తుంది. 4జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ దీని సొంతం. మీడియాటెక్​ హీలియో జీ80 ప్రాసెసర్​ ఇందులో ఉంటుంది. ఆండ్రాయిడ్​ 13 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది.

Oppo A38 specifications : ఇక కెమెరా విషయానికొస్తే.. సెల్ఫీ కోసం ఫ్రెంట్​లో 5ఎంపీ సెన్సార్​ ఉండొచ్చు. రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండరీ కెమెరా సెటప్​ ఉంటుందని తెలుస్తోంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, యూఎస్​బీ టైప్​-సీ పోర్ట్​తో పాటు ఇతర కనెక్టివిటీ ఫీచర్స్​ కూడా ఇందులో ఉంటాయని సమాచారం.

ఇదీ చూడండి:- Vivo V29e : వివో వీ29ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర లీక్​..

ఈ ఒప్పో ఏ38లో ప్లాస్టిగ్​ బాడీ డిజైన్​ వస్తుంది. ఐపీ54 డస్ట్​, వాటర్​ రెసిస్టెన్స్​ సైతం లభిస్తుంది. సైడ్​- మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​, డ్యూయెల్​ నానో-సిమ్​ కార్డ్​ స్లాట్స్​, మైక్రో ఎస్​డీ కార్డ్​ స్లాట్​, 3.5ఎంఎం హెడ్​ఫోన్​ జాక్​, బ్లూటూత్​ 5.3, ఎన్​ఎఫ్​సీ, వైఫై 5 వంటివి వస్తాయి.

ఈ స్మార్ట్​ఫోన్​ ధర ఎంత ఉంటుంది..?

Oppo A38 price in India : ఈ ఒప్పో ఏ38 తొలుత యూరోపియన్​ మార్కెట్​లో లాంచ్​ అవుతుందని సమాచారం. అక్కడ దీని ధర 159 యూరోలుగా ఉండొచ్చు. అంటే ఇండియన్​ కరెన్సీలో అది రూ. 14,170. వచ్చే నెలలో లాంచ్​ ఈవెంట్​ ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత.. రానున్న నెలల్లో ఇండియాతో పాటు ఇతర ఆసియా మార్కెట్స్​లోకి ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ అడుగుపెడుతుందని టాక్​ నడుస్తోంది.

ఒప్పో ఏ58ని చూశారా..?

ఒప్పో ఏ58 4జీలో 6.72 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ ప్లస్​ ఎల్​సీడీ స్క్రీన్​ ఉంటుంది. సైడ్​ ఫేసింగ్​ ఫింగర్​ప్రింట్​ సెన్సార్​ దీని సొంతం. ఇందులో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ పోట్రైట్​ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 8ఎంపీ కెమెరా వస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం