Vivo V29e : వివో వీ29ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర లీక్​..-vivo v29e indian pricing features leaked ahead of launch see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo V29e : వివో వీ29ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర లీక్​..

Vivo V29e : వివో వీ29ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర లీక్​..

Sharath Chitturi HT Telugu
Aug 26, 2023 08:50 AM IST

Vivo V29e : వివో వీ29ఈ మరికొన్ని రోజుల్లో ఇండియాలో అడుగుపెట్టనుంది. ఈలోపు.. ఫీచర్స్​, ధర లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..

వివో వీ29ఈ ఫీచర్స్​ లీకే!
వివో వీ29ఈ ఫీచర్స్​ లీకే! (Representative image)

Vivo V29e : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​పై ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు మరో కొత్త మోడల్​ను సిద్ధం చేసింది వివో సంస్థ. వివో వీ29ఈ స్మార్ట్​ఫోన్​.. ఈ నెల 28న ఇండియాలో లాంచ్​కానుంది. అయితే, అనేక లీక్స్​ ఇప్పటికే ఆన్​లైన్​లో దర్శనమిచ్చాయి. లీక్స్​ ద్వారా ఈ గ్యాడ్జెట్​కు సంబంధించి కొన్ని కీలక ఫీచర్స్​ బయటకొచ్చాయి. వాటిని ఓసారి చూద్దాము..

కొత్త స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ ఇవేనా..?

వివో వీ29ఈలో రెండు స్టోరేంజ్​, రెండు కలర్​ ఆప్షన్స్​ ఉంటాయని తెలుస్తోంది. 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 26,999 అని సమాచారం. 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 28,999 అని తెలుస్తోంది. ఆర్క్​టిక్​ రెడ్​, ఆర్క్​టిక్​ బ్లూ షేడ్స్​లో ఇవి అందుబాటులో ఉండనున్నాయి.

Vivo V29e price in India : రూమర్స్​ ప్రకారం.. ఈ స్మార్ట్​ఫోన్​​లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.78 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. స్నాప్​డ్రాగన్​ 695 చిప్​సెట్​ దీని సొంతం! 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 44వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ వంటివి కూడా ఉంటాయి. సెల్ఫీ, వీడియో కాల్​ కోసం 50ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తుంది. రేర్​లో 64ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్​ కెమెరా సెటప్​ ఉంటుంది. మంచి ఫొటోలు తీయాలి అనుకునే వారికి ఈ మొబైల్​ బాగా ఉపయోగపడుతుంది!

ఫ్రెంట్​ ఫేసింగ్​ కెమెరాలో ఐ- ఆటోఫోకస్​ కేపబులిటీతో పాటు రేర్​ కెమెరాకు ఆప్టికల్​ ఇమేజ్​ స్టెబులైజర్​ వంటి ఫీచర్స్ ఈ వివో వీ29ఈలో ఉంటాయని తెలుస్తోంది.

Vivo V29e specifications : ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. లాంచ్​ టైమ్​లో వీటిపై ఓ క్లారిటీ వస్తుంది.

వివో వై27 ఫీచర్స్​ చూశారా..?

వివో వై27 స్మార్ట్​ఫోన్​ను గత నెలలో లాంచ్​ చేసింది సంస్థ. ఇందులో.. 2.5డీ గ్లాస్​ బాడీ డిజైన్​ ఉంటుంది. 6.64 ఇంచ్​ ఫుల్​హెచ్​డీ+ సన్​లైట్​ డిస్​ప్లే దీని సొంతం. ఫింగర్​ప్రింట్​ స్కానర్​ సైడ్​లో వస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్​లో 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. 44వాట్​ ఫ్లాష్​ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తోంది. బర్గెండి బ్లాక్​, వైబ్రెంట్​ గార్డెన్​ గ్రీన్​ కలర్​ ఆప్షన్స్​ వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం