Neeraj Chopra Cars : ఒలంపిక్స్‌లో రజతం సాధించిన నీరజ్ చోప్రా గ్యారేజీలో భలే కార్లు!
13 August 2024, 10:35 IST
- Neeraj Chopra Cars : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలంపిక్స్‌లో రజతం సాధించాడు. అయితే అతడికి కార్లు అంటే చాలా ఇష్టం. నీరజ్ దగ్గర మంచి మంచి కార్లు ఉన్నాయి. ఆ కార్లు ఏంటో చూద్దాం..
నీరజ్ చోప్రా
గోల్డెన్ బాయ్‌గా పేరొందిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ఆగస్టు 8న పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ ఫైనల్‌లో సీజన్‌లోనే అత్యుత్తమంగా 89.45 మీటర్ల దూరం విసిరి రజత పతకం సాధించాడు. వరుసగా రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా 26 ఏళ్ల ఈ యువకుడు చరిత్ర సృష్టించాడు. నీరజ్‌కు గొప్ప క్రీడాకారుడు మాత్రమే కాదు, కార్లు, బైక్‌లపై మక్కువ కూడా ఉంది. అతడికి కార్లు అంటే చాలా ఇష్టం. అందుకే నీరజ్ గ్యారేజీలో మంచి కార్ల కలెక్షన్స్ ఉంది.
మహీంద్రా XUV 700
టోక్యో గేమ్స్ 2020-2021లో ఒలింపిక్ స్వర్ణం గెలిచిన తర్వాత నీరజ్ కస్టమైజ్ చేసిన మహీంద్రా XUV 700ని బహుమతిగా అందుకున్నాడు. ఈ లగ్జరీ SUV భారతదేశంలో రూ. 13.99 - 26.04 లక్షల వరకు ఉంటుంది.
రేంజ్ రోవర్ స్పోర్ట్
నీరజ్ చోప్రా లగ్జరీ కార్ కలెక్షన్‌లో రేంజ్ రోవర్ స్పోర్ట్ కూడా ఉంది. దీని ధర భారతదేశంలో రూ. 2 కోట్లు. దీంట్లో తిరిగేందుకు నీరజ్ ఇష్టపడుతాడని చెబుతుంటారు.
మహీంద్రా థార్ SUV
నీరజ్ చోప్రా క్లాసిక్ మహీంద్రా థార్ SUVని కలిగి ఉన్నాడు. ఇది సుమారు రూ. 12 లక్షల ధర కలిగిన మోడల్.
టయోటా ఫార్చ్యూనర్
చోప్రా కార్ల కలెక్షన్స్‌లో టయోటా ఫార్చ్యూనర్ కూడా ఉంది. ఈ కారు ధర దాదాపు రూ.33 లక్షలుగా ఉంది
ఫోర్డ్ ముస్టాంగ్ GT
నీరజ్ చోప్రా ఫోర్డ్ ముస్టాంగ్ GTని కలిగి ఉన్నాడు. ఇది ఒక లగ్జరీ స్పోర్ట్స్ కారు. అనేక ఫీచర్లు కలిగి ఉంది. దీని ధర సుమారు రూ.93.52 లక్షలు.
ఒలంపిక్స్ పోటీలు ముగిసిన తర్వాత నీరజ్ చోప్రా భారత్‌కు తిరిగి రాలేదు. జర్మనీకి వెళ్లాడు. గాయానికి శస్త్రచికిత్సకు సంబంధించి వైద్య సలహా కోసం అక్కడకు చేరుకున్నాడు. వచ్చే డైమండ్ లీగ్‌లో పాల్గొనాలా? వద్దా అని నిర్ణయించుకునేందుకు అక్కడకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. నీరజ్ జర్మనీకి వెళ్లాడని, కనీసం నెలన్నరపాటు ఇండియాకు రాడు అని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.