Nothing Phone 2a Plus: త్వరలో ఇండియాలో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లాంచ్: ఇందులోని స్పెషాలిటీస్ ఇవే..
18 July 2024, 19:29 IST
Nothing Phone 2a Plus: నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ స్మార్ట్ ఫోన్ త్వరలోనే మరిన్ని స్పెసిఫికేషన్లు, మరిన్ని ఫీచర్లతో ఇండియాలో లాంచ్ కానుంది. ఇప్పటికే భారత్ లో నథింగ్ 2 ఏ స్మార్ట్ ఫోన్ భారీగా అమ్ముడవుతూ, విజయవంతమైన మోడల్ గా నిలిచింది.
త్వరలో ఇండియాలో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్
Nothing Phone 2a Plus: యూకేకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్ ఇటీవల తన కొంత చౌకైన స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 2ఏ ను లాంచ్ చేసింది. ఆకట్టుకునే డిజైన్, పెర్ఫార్మెన్స్, కెమెరాతో ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీకి పెద్ద విజయాన్ని అందించింది. ఇప్పుడు ఫోన్ 2ఎ సిరీస్ లో కొత్త మోడల్ ను లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నథింగ్ ఫోన్ 2 ఏ కు "ప్లస్" వెర్షన్ గా ఉంటుందని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ కూడా యూఏఈ టీడీఆర్ ఎ సర్టిఫికేషన్, బీఐఎస్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియాలను కలిగి ఉంది.
నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ వివరాలు
‘ఇది కేవలం "+" సంకేతం మాత్రమే’ అని నథింగ్ ఇటీవల దాని అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ ను షేర్ చేసింది. ఈ పోస్ట్ చాలా మంది యూజర్ల దృష్టిని ఆకర్షించింది. నథింగ్ ఫోన్ 3 ఎప్పుడు లాంచ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తుండగా, కంపెనీ త్వరలో ప్రపంచవ్యాప్తంగా నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ స్మార్ట్ ఫోన్ (smart phone) ను లాంచ్ చేయబోతోందని, ఆ ఎక్స్ పోస్ట్ ఆ విషయాన్నే కన్ఫర్మ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. యూఏఈ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ సైట్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ కనిపించింది, దీని పేరు "ఫోన్ 2ఎ ప్లస్" అని తేలింది. తరువాత, భారతదేశపు బీఐఎస్ సర్టిఫికేషన్ లో కూడా ఇదే మోడల్ కనిపించింది.
నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ లాంచ్ ఎప్పుడు?
నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ (Nothing Phone 2a plus) లో మోడల్ నంబర్ ఎ 142 పీ అని ఉంది. ఇది త్వరలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, కంపెనీ ఈ ఉత్పత్తి గురించి చాలా రహస్యంగా ఉంది. అయితే, ఇది పోకెమాన్, "+" గుర్తును నిరంతరం టీజ్ చేస్తోంది నథింగ్ ఫోన్ 2ఎ "ప్లస్" వేరియంట్ కాబట్టి, ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎక్కువగా ఉంటుందని, ఇందులో అప్ గ్రేడెడ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండవలసి ఉంటుంది.
నథింగ్ ఫోన్ 2ఏ స్పెసిఫికేషన్లు
నథింగ్ ఫోన్ 2ఏ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరాతో పాటు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. నథింగ్ ఫోన్ 2ఏ (Nothing Phone 2a)లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.