Nothing Phone 2a Special Edition : నథింగ్​ ఫోన్​ 2ఏ స్పెషల్​ ఎడిషన్​ లాంచ్​- ధర ఎంతంటే..-nothing phone 2a special edition launched in india check all details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nothing Phone 2a Special Edition : నథింగ్​ ఫోన్​ 2ఏ స్పెషల్​ ఎడిషన్​ లాంచ్​- ధర ఎంతంటే..

Nothing Phone 2a Special Edition : నథింగ్​ ఫోన్​ 2ఏ స్పెషల్​ ఎడిషన్​ లాంచ్​- ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
May 30, 2024 12:53 PM IST

Nothing Phone 2a Special Edition : నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ లాంచ్​ అయ్యింది. ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నథింగ్​ ఫోన్​ 2ఏ స్పెషల్​ ఎడిషన్​..
నథింగ్​ ఫోన్​ 2ఏ స్పెషల్​ ఎడిషన్​.. (Nothing)

Nothing Phone 2a Special Edition price : నథింగ్​ ఫోన్​ 2ఏ స్మార్ట్​ఫోన్​లో స్పెషల్​ ఎడిషన్​ తాజాగా లాంచ్​ అయ్యింది. ఎరుపు, పసుపు, నీలం రంగుల్లో కొత్త కలర్ ఆప్షన్స్​ వస్తున్నాయి. కంపెనీ తన కొత్త కలర్ ఆప్షన్స్​ గురించి టీజ్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఎరుపు, పసుపు అనే రెండు కొత్త రంగులు ఉంటాయని ఊహాగానాలు వినిపించాయి. కానీ, స్పెషల్ ఎడిషన్ నథింగ్ ఫోన్ 2ఏ లాంచ్ అయిన తరువాత.. మూడు కొత్త కలర్ ఆప్షన్స్​ వస్తున్నాయని స్పష్టమైంది. ఇది డివైజ్​ను ప్రత్యేకంగా కనిపించేలా చేసింది. కలర్ స్కీమ్ మినహా డిజైన్, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పరంగా అన్నీ ఒకేలా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.

నథింగ్​ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్..

‘ఏ స్టోరీ ఆఫ్​ కలర్​ టోల్డ్​ థ్రూ లేటెస్ట్​ స్మార్ట్​ఫోన్​ (మా కొత్త స్మార్ట్​ఫోన్​ ద్వారా రంగుల కథలను చెబుతున్నాము,)’ అని నథింగ్​ ఫోన్​ 2ఏ స్పెషల్​ ఎడిషన్​ని వర్ణించింది దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ. ఈ స్మార్ట్​ఫోన్​ బ్యాక్​ ప్యానెల్​లో గ్రే కలర్​ సెక్షన్​ వస్తుంది. దాని మీద నథింగ్​ డిజైన్​ పాటర్న్​ కనిపిస్తుంది.

నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు..

Nothing Phone 2a Special Edition launch in India : నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇతర మోడళ్ల మాదిరిగానే ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్ ఇందులో అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.7 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ అమోఎల్ఈడీ డిస్ల్పే ఇందులో అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ ఫ్రెంట్ కెమెరా ఉన్నాయి. నథింగ్ ఫోన్ 2ఏలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

నథింగ్​ ఫోన్​ 2ఏ స్పెషల్​ ఎడిషన్​లో కేవలం ఒకటే స్టోరేజ్​ వేరియంట్​ ఉంది. అది 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​. ఇండియాలో దీని ధర రూ. 27,999గా ఉంది. జూన్​ 5 నుంచి ఫ్లిప్​కార్ట్​లో సేల్​ మొదలవుతుంది. లిమిటెడ్​ పీరియడ్​ డిస్కౌంట్​ కింద.. ఈ స్మార్ట్​ఫోన్​పై రూ. 1000 తగ్గింపు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. ఫలితంగా రూ. 26,999కే ఈ మొబైల్​ని కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాదు.. లండన్​లోని నథింగ్​ సోహో స్టోర్​లో జూన్​ 1 నుంచి ఈ స్మార్ట్​ఫోన్​ అందుబాటులో ఉండనుంది.

Nothing Phone 2a specifications : ఇండియా మార్కెట్​పై ఫోకస్​ చేసిన నథింగ్​ సంస్థ.. తమ ఇన్నోవేషన్స్​తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్​ని లాంచ్​ చేయాలని భావిస్తోంది. మరి తాజాగా లాంచ్​ అయిన నథింగ్​ ఫోన్​ 2ఏ స్పెషల్​ ఎడిషన్​.. భారత కస్టమర్లను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్స్​లో అందుబాటులో ఉంది! టెక్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని వెంటనే సబ్​స్క్రైబ్​ చేసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం