Nothing Phone 2a : మార్చ్​ 5న నథింగ్​ ఫోన్​ 2ఏ లాంచ్​.. ఫీచర్స్​, ధర ఇవే!-nothing phone 2a to launch on march 5 expected price specifications ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nothing Phone 2a : మార్చ్​ 5న నథింగ్​ ఫోన్​ 2ఏ లాంచ్​.. ఫీచర్స్​, ధర ఇవే!

Nothing Phone 2a : మార్చ్​ 5న నథింగ్​ ఫోన్​ 2ఏ లాంచ్​.. ఫీచర్స్​, ధర ఇవే!

Sharath Chitturi HT Telugu
Mar 03, 2024 05:30 PM IST

Nothing Phone 2a launch date : నథింగ్​ ఫోన్​ 2ఏపై కీలక అప్డేట్​! ఈ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ డేట్​ రివీల్​ అయ్యింది. పూర్తి వివరాలు మీకోసం..

మార్చ్​ 5న నథింగ్​ ఫోన్​ 2ఏ లాంచ్​.. ఫీచర్స్​, ధర వివరాలివే!
మార్చ్​ 5న నథింగ్​ ఫోన్​ 2ఏ లాంచ్​.. ఫీచర్స్​, ధర వివరాలివే!

Nothing Phone 2a price in India : నెలల తరబడి సాగిన ఊహాగానాలు, చర్చలు మధ్య.. నథింగ్​ ఫోన్​ 2ఏ గ్యాడ్జెట్​పై కీలక్​ అప్డేట్​ బయటకి వచ్చింది. ఈ స్మార్ట్​ఫోన్​.. మార్చ్​ 5న లాంచ్​కానుంది. అఫార్డిబుల్​ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి.. రియల్​మీ, షావోమీ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడానికి కార్ల్ పీ ఆధారిత కంపెనీ చేస్తున్న ప్రయత్నమే ఈ స్మార్ట్​ఫోన్​ అని వార్తలు వస్తున్నాయి.

నథింగ్ ఫోన్ 2ఎ డిజైన్:

అధికారిక చిత్రాల నుంచి ఒక కీలక విషయం స్పష్టమైంది. నథింగ్ ఫోన్ 2ఏలో ఐకానిక్ గ్లైఫ్ ఇంటర్ఫేస్​ ఉంటుంది. ఇంటర్ఫేస్​ పనైపోయిందా? అన్న సందేహాలకు తెరపడింది. నథింగ్​ ఫోన్స్​లో మంచి, యునీక్​ ఎక్స్​పీరియెన్స్​ ఇచ్చేది ఈ గ్లైఫ్​ ఇంటర్ఫేస్​. స్పెసిఫిక్​ కాలర్స్​కు అసైన్​ చేసే విధంగా గ్లైఫ్​ పాటర్నర్స్​ని మనం అసైన్​ చేసుకోవచ్చు.

ఈ ఫోన్ 2ఏ రెండు క్లాసిక్ రంగులలో అందుబాటులో ఉంటుంది. వి.. నలుపు, తెలుపు. నథింగ్ సిగ్నేచర్ లుక్​కు కట్టుబడి, ట్రాన్స్​పరెంట్​ డిజైన్ ఫ్లాట్ డిస్​ప్లే, ఫ్లాట్ అంచులతో ఈ ఫోన్​ రిలీజ్​ అవుతోంది. మ్యాట్ ఫినిషింగ్​తో మంచి యూజర్​ ఎక్స్​పీరియెన్స్​ మరింత మెరుగుపడుతుంది.

ఈ నథింగ్​ ఫోన్​ 2ఏ స్పెసిఫికేషన్స్​పై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ.. నథింగ్ సీఈఓ కార్ల్ పీ.. ఈ ఫోన్.. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్​సెట్​తో పనిచేస్తుందని, 12 జీబీ ర్యామ్​ ఉంటుందని ధృవీకరించారు.

నథింగ్ ఫోన్ 2ఏ స్పెసిఫికేషన్లు- ధర..

Nothing Phone 2a specifications : పలు నివేదికల ప్రకారం.. నథింగ్ నుంచి రాబోయే స్మార్ట్​ఫోన్​ వెనుక భాగంలో డ్యూయెల్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్​తో పాటు సెల్ఫీ, వీడియో కాల్ సంబంధిత అవసరాల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది. 6.7 ఇంచ్​ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ స్మార్ట్​ఫోన్ లాంచ్ కానుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 ఆపరేటింగ్ సిస్టెంపై పనిచేసే నథింగ్ ఫోన్ (2ఏ) అద్భుతమైన, అత్యాధునిక యూజర్ ఎక్స్​పీరియన్స్ ను అందించే అవకాశం ఉంది.

భారతదేశంలో లేదా గ్లోబల్ మార్కెట్లో తన రాబోయే స్మార్ట్​ఫోన్​ ధరను సంస్థ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కాగా.. నథింగ్​ ఫోన్ 2ఏ.. ఫోన్​ 1 కంటే తక్కువ ధర ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అంటే.. ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ .30,000 లోపు ఉండవచ్చని మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నథింగ్​ ఫోన్​ 2ఏ స్పెసిఫికేషన్స్​, ధర వంటి వివరాలపై.. లాంచ్​ టైమ్​ నాటికి క్లారిటీ వస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం