Nothing Phone 2A: 24 వేలకే ప్రీమియం స్మార్ట్ ఫోన్ ‘నథింగ్ ఫోన్ 2 ఏ’; మార్చి 12 నుంచి ఈ స్టోర్ట్స్ లో అందుబాటులోకి..-nothing phone 2a price drop get it with a huge discount for just 23999 rupees on flipkart ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nothing Phone 2a: 24 వేలకే ప్రీమియం స్మార్ట్ ఫోన్ ‘నథింగ్ ఫోన్ 2 ఏ’; మార్చి 12 నుంచి ఈ స్టోర్ట్స్ లో అందుబాటులోకి..

Nothing Phone 2A: 24 వేలకే ప్రీమియం స్మార్ట్ ఫోన్ ‘నథింగ్ ఫోన్ 2 ఏ’; మార్చి 12 నుంచి ఈ స్టోర్ట్స్ లో అందుబాటులోకి..

HT Telugu Desk HT Telugu
Mar 09, 2024 07:06 PM IST

Nothing Phone 2A: నథింగ్ ఫోన్ (Nothing Phone) బ్రాండ్ నుంచి వచ్చిన లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ‘నథింగ్ ఫోన్ 2 ఏ’ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. తక్కువ ధరలో లేటెస్ట్ ప్రీమియం ఫోన్ కు అప్ గ్రేడ్ కావాలనుకునేవారికి.. ఇది మంచి అవకాశం.

నథింగ్ ఫోన్ 2 ఏ ధర తగ్గింపు
నథింగ్ ఫోన్ 2 ఏ ధర తగ్గింపు (Nothing)

Nothing Phone 2A: కార్ల్ పీ స్థాపించిన టెక్ స్టార్టప్ ‘నథింగ్’ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ‘నథింగ్ ఫోన్ 2ఏ’ ను ఇటీవల విడుదల చేసింది. లాంచ్ ఆఫర్ గా ఈ ప్రీమియం ఫోన్ 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ను రూ.23,999 లకే సొంతం చేసుకోవచ్చు. నథింగ్ ఫోన్ 2ఏ 128 జిబి వెర్షన్ ఫ్లిప్ కార్ట్ లో 7 శాతం డిస్కౌంట్ తో రూ. 23,999 లకు లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ డీల్స్ ఉన్నాయి.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

నథింగ్ ఫోన్ (2ఏ) మూడు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. అవి ఒకటి 8 జీబీ ర్యామ్ /128 జీబీ స్టోరేజ్; రెండవది 8 జీబీ ర్యామ్ /256 జీబీ స్టోరేజ్; మూడవది 12 జీబీ ర్యామ్ /256 జీబీ స్టోరేజ్. ఈ ఫోన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ ను అమర్చారు. ఈ నథింగ్ ఫోన్ (2ఎ) 50 మెగాపిక్సెల్ (ఓఐఎస్) + 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 వంటి ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది.

పనితీరు మరియు బ్యాటరీ

మీడియాటెక్ తో కలిసి డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ తో రూపొందించిన ఈ నథింగ్ ఫోన్ (2ఎ) (Nothing Phone 2A) ర్యామ్ బూస్టర్ టెక్నాలజీతో వేగవంతమైన మల్టీటాస్కింగ్ కు వీలు కల్పిస్తుంది. ఈ ఫోన్ లోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫుల్ ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు వాడుకోవచ్చు. ఇది 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

కెమెరా, డిస్ ప్లే

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ట్రూలెన్స్ ఇంజిన్ తో నడిచే డ్యూయల్ 50 మెగా పిక్సెల్ రియర్ కెమెరా సెటప్, హై క్వాలిటీ సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్ (2ఎ) (Nothing Phone 2A) కలిగి ఉంది. దీని 6.7" ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటును అందిస్తుంది.

నథింగ్ ఫోన్ (2ఎ) ధర తగ్గింపు

ఫ్లిప్ కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్ మరియు ఇతర ప్రముఖ అవుట్ లెట్లలో నథింగ్ ఫోన్ 2ఎ (Nothing Phone 2A) మార్చి 12, 2024 మంగళవారం నుండి లభిస్తుంది. లాంచ్ ఆఫర్లో భాగంగా ఆన్లైన్ లావాదేవీల కోసం హెచ్ డీ ఎఫ్ సీ కార్డులను ఉపయోగించే కస్టమర్లకు రూ.2,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలుదారులు అదనంగా రూ .2000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు.