Nothing Phone 2 sale: ఈ రోజు నుంచి నథింగ్ ఫోన్ 2 సేల్ ప్రారంభం; బెస్ట్ ప్రైస్ కు ప్రీమియం స్మార్ట్ ఫోన్; లాంచ్ ఆఫర్ కూడా-nothing phone 2 goes on sale today know its price offers specifications more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nothing Phone 2 Sale: ఈ రోజు నుంచి నథింగ్ ఫోన్ 2 సేల్ ప్రారంభం; బెస్ట్ ప్రైస్ కు ప్రీమియం స్మార్ట్ ఫోన్; లాంచ్ ఆఫర్ కూడా

Nothing Phone 2 sale: ఈ రోజు నుంచి నథింగ్ ఫోన్ 2 సేల్ ప్రారంభం; బెస్ట్ ప్రైస్ కు ప్రీమియం స్మార్ట్ ఫోన్; లాంచ్ ఆఫర్ కూడా

HT Telugu Desk HT Telugu
Jul 21, 2023 03:18 PM IST

Nothing Phone 2 sale: నథింగ్ ఫోన్ 2 సేల్ జులై 21 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. రెండు కలర్స్, మూడు వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది.

నథింగ్ ఫోన్ 2
నథింగ్ ఫోన్ 2 (Nothing)

Nothing Phone 2 sale: అంతర్జాతీయంగా ఈ నథింగ్ ఫోన్ 2 ని పది రోజుల క్రితం లాంచ్ చేశారు. తాజాగా, జులై 21 న తొలిసారి భారత్ లో సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం ఈ Nothing Phone 2 పలు లాంచ్ ఆఫర్స్ తో అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్స్ ట్రాన్స్ పరెంట్ బ్యాక్ డిజైన్ చాలా మందిని ఆకర్షించింది. నథింగ్ ఫోన్ 1 సేల్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఫోన్స్ అన్నీ అమ్ముడుపోయాయి. దాంతో, నథింగ్ ఫోన్ 2 కు కూడా భారీ రస్పాన్స్ ను ఆశిస్తున్నారు.

Nothing Phone 2 variants, price: నథింగ్ ఫోన్ 2 వేరియంట్స్, ధరలు

నథింగ్ ఫోన్ 2 మూడు వేరియంట్లలో, డార్క్ గ్రే, వైట్ అనే రెండు కలర్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో దీని ధర రూ. 44999. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో లభించే వేరియంట్ ధర రూ. 49999 గా, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ తో లభించే వేరియంట్ ధర రూ. 54999 గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్ లో భాగంగా యాక్సిస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, సిటి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ పై రూ. 3 వేల తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే 5% డిస్కౌంట్ లభిస్తుంది.

Nothing Phone 2: నథింగ్ ఫోన్ 2 స్పెసిఫికేషన్స్

నథింగ్ ఫోన్ 2 లో 6.7ఇంచ్ ల ఓఎల్ఈడీ ఎల్టీపీఓ డిస్ ప్లే ఉంటుంది. రిఫ్రెష్ రేట్ 120 హెర్జ్స్. ఇందులో హైఎండ్ పర్ఫార్మెన్స్ కోసం స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్ సెట్ ను అమర్చారు. ఈ ఫోన్ నథింగ్ ఓఎస్ 2 పై పని చేస్తుంది. నథింగ్ ఫోన్ 2 లో 50 ఎంపీ ప్రైమరీ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సర్ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం ముందువైపు 32 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 615 సెన్సర్ కెమెరా ఉంది. అలాగే, ఇందులో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఉంది.

WhatsApp channel