Nothing Phone 2 : నథింగ్​ ఫోన్​ 2 ప్రీ ఆర్డర్స్​ షురూ.. పూర్తి వివరాలు ఇవే!-nothing phone 2 pre orders goes live in india see all details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nothing Phone 2 : నథింగ్​ ఫోన్​ 2 ప్రీ ఆర్డర్స్​ షురూ.. పూర్తి వివరాలు ఇవే!

Nothing Phone 2 : నథింగ్​ ఫోన్​ 2 ప్రీ ఆర్డర్స్​ షురూ.. పూర్తి వివరాలు ఇవే!

Sharath Chitturi HT Telugu
Jun 30, 2023 12:57 PM IST

Nothing Phone 2 : నథింగ్​ 2 స్మార్ట్​ఫోన్​ను కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. ఈ స్మార్ట్​ఫోన్​ ప్రీ ఆర్డర్స్​ మొదలయ్యాయి. పూర్తి వివరాలు..

నథింగ్​ ఫోన్​ 2 ప్రీ ఆర్డర్స్​ షురూ.. పూర్తి వివరాలు ఇవే!
నథింగ్​ ఫోన్​ 2 ప్రీ ఆర్డర్స్​ షురూ.. పూర్తి వివరాలు ఇవే! (HT_Tech/ Representative image)

Nothing Phone 2 bookings : నథింగ్​ ఫోన్​ 2కి సంబంధించిన క్రేజీ అప్డేట్​ ఇది! ఈ స్మార్ట్​ఫోన్​ ప్రీ ఆర్డర్స్​.. ఇండియాలో మొదలయ్యాయి. ఫ్లిప్​కార్ట్​లో రూ. 2వేలకు ఈ నథింగ్​ ఫోన్​ 2ను బుక్​ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా రీఫండెబుల్​. బుకింగ్​ చేసుకున్న వారికి.. సాధారణ సేల్​ కన్నా ముందే ఈ స్మార్ట్​ఫోన్​ అందుతుంది. అంతేకాకుండా.. ప్రీ ఆర్డర్​ చేసుకునే కస్టమర్లకు ఎక్స్​క్లూజివ్​ ఆఫర్స్​ కూడా ఇస్తోంది నథింగ్​ సంస్థ.

ప్రీ ఆర్డర్స్​ షురూ..

నథింగ్​ ఫోన్​ 2 కోసం ముందుగా టోకెన్​ అమౌంట్​ కట్టాలి. అనంతరం జులై 11 రాత్రి 9 గంటలకు, జులై 20 రాత్రి 11:59 గంటలకు.. ఈ స్మార్ట్​ఫోన్​కు సంబంధించి డిజైన్​ చేసిన ఓ ప్రత్యేక విండో ఓపెన్​ అవుతుంది. అందులో వేరియంట్​తో పాటు ఇతర ఆప్షన్స్​ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగిలిన అమౌంట్​ను కట్టాలి.

ఇక మీరు ఇప్పుడు నథింగ్​ ఫోన్​ 2ను బుక్​ చేసుకుంటే.. సెటిల్​మెంట్​ రోజు అనేక ఎక్స్​క్లూజివ్​ ఆఫర్స్​ ఇస్తామంటోంది స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ. అవేంటంటే..

ఇయర్​ స్టిక్​- వాస్తవ ధర రూ. 8,499- డిస్కౌంట్​ ధర రూ. 4,250.

నథింగ్​ ఫోన్​ 2 కేస్​- వాస్తవ ధర రూ. 1,299- డిస్కౌంట్​ ధర రూ. 499.

నథింగ్​ ఫోన్​ 2 స్క్రీన్​ ప్రొటెక్షన్​ - వాస్తవ ధర రూ. 999, డిస్కౌంట్​ ధర రూ. 399

నథింగ్​ పవర్​ అడాప్టర్​- వాస్తవ ధర రూ. 2499, డిస్కౌంటెడ్​ ప్రైజ్​ రూ. 1,499

ఇదీ చూడండి:- Nothing Phone 1 vs Phone 2 : నథింగ్​ ఫోన్​ 1- నథింగ్​ ఫోన్​ 2 మధ్య తేడాలు ఇవే!

నథింగ్​ ఫోన్​ 2 హైలైట్స్​ ఇవే..

Nothing Phone 2 launch date : ఈ కొత్త స్మార్ట్​ఫోన్​లో టాప్​ సెంటర్డ్​ పంచ్​ హోల్​ కటౌట్​, ఫ్లాట్​ అల్యుమీనియం ఫ్రేమ్​, డిస్​ప్లే కింద ఫింగర్​ప్రింట్​ రీడర్​లు వస్తున్నాయి. అధికారిక టీజర్​ ప్రకారం.. గ్లింఫ్​ కంపోజర్​ ఫీచర్​ ఇందులో ఉంది. వివిధ సౌండ్స్​, లైట్​ పాటర్న్​లతో కస్టమ్​ రింగ్​టోన్స్​ను క్రియేట్​ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఇక ఈ మొబైల్​లో 6.7 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ప్యానెల్​ విత్​ 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ ఉంటుంది. రేర్​లో 50ఎంపీతో కూడిన డ్యూయెల్​ కెమెరా, ఫ్రెంట్​లో 32ఎంపీ సెల్ఫ కెమెరాలు లభిస్తున్నాయి. ఇందులో స్నాప్​డ్రాగన్​ 8+ జెన్​ 1 ఎస్​ఓసీ చిప్​సెట్​ ఉంటుంది. 128జీబీ ర్యామ్​, 256జీబీ/ 512జీబీ స్టోరేజ్​ ఆప్షన్స్​ ఉండొచ్చని తెలుస్తోంది. 4,700ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం.

ఈ మోడల్​ ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇతర ఫీచర్స్​ వివరాలు కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

నథింగ్​ సంస్థ నుంచి స్పీకర్​..!

Nothing Phone 2 price : నథింగ్ బ్రాండ్ క్రమంగా తన ప్రొడక్టుల పోర్ట్‌ఫోలియోను పెంచుకుంటోంది. ముందుగా టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌తో అడుగుపెట్టిన ఆ కంపెనీ ఆ తర్వాత నథింగ్ ఫోన్ (1) మొబైల్‍తో అదరగొట్టింది. ఇక తదుపరి స్పీకర్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ స్పీకర్‌కు సంబంధించిన డిజైన్ తాజాగా లీక్ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం