Nokia C12 Plus: నోకియా సీ12 లైనప్‍లో మూడో ఫోన్ లాంచ్.. ఇది కూడా బడ్జెట్ రేంజ్‍లోనే..
03 April 2023, 18:56 IST
- Nokia C12 Plus launched: నోకియా సీ12 ప్లస్ ఇండియాలో విడుదలైంది. హెచ్‍డీ+ డిస్‍ప్లే, 4జీ కనెక్టివిటీతో వచ్చింది.
Nokia C12 Plus: నోకియా సీ12 లైనప్‍లో మూడో ఫోన్ లాంచ్.. (Photo: Nokia)
Nokia C12 Plus launched: నోకియా సీ12 లైనప్‍లో మూడో ఫోన్‍ను నోకియా తీసుకొచ్చింది. నోకియా సీ12 ప్లస్ లాంచ్ అయింది. ఇప్పటికే ఈ సిరీస్‍లో నోకియా సీ12, సీ 12 ప్రో విడుదల కాగా.. ఇప్పుడు తాజాగా సీ12 ప్లస్ విడుదలైంది. ఈ మూడో ఫోన్ కూడా ఎంట్రీ లెవెల్‍లోనే అడుగుపెట్టింది. గత రెండు మొబైళ్లతో పోలిస్తే స్వల్ప మార్పులతో నోకియా సీ12 ప్లస్ వచ్చింది. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‍తో ఈ మొబైల్ లాంచ్ అయింది. Nokia C12 Plus ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే.
నోకియా సీ12 ప్లస్ స్పెసిఫికేషన్లు
Nokia C12 Plus Specifications: నోకియా సీ12 ప్లస్ ఫోన్ ఎంట్రీ లెవెల్ స్పెసిఫికేషన్లే కలిగి ఉంది. బేసిక్ హార్డ్‌వేర్‍తో వస్తోంది. 6.3 ఇంచుల హెచ్‍డీ+ ఎల్‍సీడీ డిస్‍ప్లేను నోకియా సీ12 ప్లస్ కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా కోసం డిస్‍ప్లే టాప్ సెంటర్లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉంది. ఆక్టాకోర్ యునిఎస్‍ఓసీ (UniSoc) ప్రాసెసర్ ఈ ఫోన్‍లో ఉంటుంది. గరిష్ట క్లాక్ స్పీడ్ 1.6 హెర్ట్జ్ గా ఉంది. 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో ఈ మొబైల్ వస్తోంది. స్టోరేజీని పొడింగించుకునేందుకు మైక్రో ఎస్‍డీ కార్డు స్లాట్ ఈ ఫోన్‍లో ఉంటుంది.
Nokia C12 Plus: నోకియా సీ12 ప్లస్ మొబైల్ వెనుక 8 మెగాపిక్సెల్ సామర్థ్యం ఉన్న కెమెరా ఉంటుంది. ఆటో ఫోకస్ ఫీచర్, ఎస్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ఇక వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ మొబైల్‍కు ఇచ్చింది నోకియా.
4జీ, వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్‍బీ-పోర్టు, 3.5mm హెడ్‍ఫోన్ జాక్, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లతో నోకియా సీ12 ప్లస్ వస్తోంది. ఈ ఫోన్‍లో 4,000mAh బ్యాటరీ ఉంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉండదు. నోకియా సీ12లో 3,000mAh బ్యాటరీ ఉండగా.. దీంట్లో కాస్త ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంది.
నోకియా సీ12 ప్లస్ ధర
Nokia C12 Plus Price: నోకియా సీ12 ప్లస్ ఒకే వేరియంట్‍లో వస్తోంది. 2జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ధరను రూ.7,999గా నోకియా నిర్ణయించింది. ఇప్పటికే నోకియా ఇండియా వెబ్‍సైట్‍లో ఈ మొబైల్ లిస్ట్ అయింది. అయితే నోకియా సీ12 ప్లస్ సేల్ తేదీని నోకియా ఇంకా ప్రకటించలేదు. త్వరలో వెల్లడించే ఛాన్స్ ఉంది.
కాగా, నోకియా సీ12 ధర రూ.5,999గా ఉండగా.. నోకియా సీ12 ప్రో ప్రారంభ ధర రూ.6,999గా ఉంది. కాగా ఈ లైనప్‍లో ఈ మూడు ఫోన్ల స్పెసిఫికేషన్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. స్పల్ప మార్పులతో వస్తున్నాయి.