Nokia: రూ.5,999 ధరకే నోకియా సీ12 ఫోన్ లాంచ్: స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే!
14 March 2023, 10:44 IST
- Nokia C12 launched in India: నోకియా సీ12 ఫోన్ భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. ఎంట్రీ లెవెల్‍లో విడుదలైంది. అమెజాన్‍లో ఈ మొబైల్ సేల్‍కు రానుంది. పూర్తి వివరాలివే.
Nokia: రూ.5,999 ధరకే నోకియా సీ12 ఫోన్ లాంచ్: స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే! (Photo: Nokia)
Nokia C12 launched in India: నోకియా (Nokia) సీ సిరీస్‍లో మరో బడ్జెట్ మొబైల్ లాంచ్ అయింది. నోకియా సీ12 (Nokia C12) 4జీ ఎంట్రీ లెవెల్ ఫోన్ భారత మార్కెట్‍లో అడుగుపెట్టింది. హెచ్‍డీ+ డిస్‍ప్లే, యునీఎస్ఓసీ (Unisoc) ప్రాసెసర్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఇంట్రడక్టరీ ధరకు ఈ బడ్జెట్ ఫోన్ సేల్‍కు రానుంది. వెనుక ఓ కెమెరా ఉంటుంది. నోకియా సీ12 గురించి పూర్తి వివరాలు ఇవే.
నోకియా సీ12 ధర, సేల్
Nokia C12 Price in India, Sale: 2జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ఉండే నోకియా సీ12 ధర రూ.5,999గా ఉంది. ఈనెల 20వ తేదీన ఈ-కామర్స్ సైట్ అమెజాన్(Amazon)లో ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది. చార్కోల్, డార్క్ సియాన్, లైట్ మింట్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. రూ.5,999ను ఇంట్రడక్టరీ ధరగా నోకియా పేర్కొంది. అయితే ఎంత కాలం ఈ ధర కొనసాగుతుందో వెల్లడించలేదు.
నోకియా సీ12 స్పెసిఫికేషన్లు
Nokia C12 Specifications: 6.3 ఇంచుల హెచ్‍డీ+ డిస్‍ప్లేతో నోకియా సీ12 వస్తోంది. ఫ్రంట్ కెమెరా కోసం డిస్‍ప్లే టాప్ సెంటర్ వద్ద వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. యునిఎస్‍ఓసీ 9863ఏ1 (Unisoc 9863A1) ప్రాసెసర్‌పై ఈ మొబైల్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ (Android 12 Go Edition) ఆపరేటింగ్ సిస్టమ్‍తో వస్తోంది. 2జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని 2జీబీ వరకు వర్చువల్ ర్యామ్‍ను పొడిగించుకునే ఫీచర్ ఉంటుంది.
Nokia C12 Specifications: నోకియా సీ12 ఫోన్ వెనుక 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆటో ఫోకస్ ఫీచర్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‍కు ఇచ్చింది నోకియా.
Nokia C12 Specifications: నోకియా సీ12 మొబైల్‍లో 3,000mAh బ్యాటరీ ఉంటుంది. కేవలం 5 వాట్ల చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ మొత్తంగా 177 గ్రాముల బరువు ఉంటుంది. 4జీ ఎల్‍టీఈ, వైఫై, బ్లూటూత్, 3.5mm హెడ్‍ఫోన్ జాక్, మైక్రో యూఎస్‍బీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం, చార్జింగ్ స్పీడ్ కాస్త ప్రతికూలతగా ఉన్నాయి.