Nissan X-Trail : ఫార్చ్యునర్కి పోటీగా నిస్సాన్ ఎక్స్-ట్రయల్.. లాంచ్ ఎప్పుడంటే..
25 June 2024, 14:29 IST
- Nissan X-Trail price in India : 2024 నిస్సాన్ ఎక్స్-ట్రయల్ లాంచ్‌కు రెడీ అవుతోంది. ఫార్చ్యునర్కు పోటీగా వస్తున్న ఈ ఎస్యూవీ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
2024 నిస్సాన్ ఎక్స్-ట్రయల్
2024 Nissan X-Trail SUV : ఇండియా ఆటోమొబైల్ సెక్టార్లో క్రేజీ డిమాండ్ ఉన్న ఎస్యూవీ సెగ్మెంట్‌పై ఫోకస్ చేసిన నిస్సాన్ మోటార్.. 2024 నిస్సాన్ ఎక్స్-ట్రయల్‌ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ఈవెంట్‌ని జులై 17న నిర్వహిస్తోంది సంస్థ. అక్కడి నుంచి కొన్ని వారాల తర్వాత.. ఇండియాలో ఈ మోడల్ లాంచ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
2024 నిస్సాన్ ఎక్స్-ట్రయల్ ఎస్యూవీ విశేషాలు..
ఈ 2024 నిస్సాన్ ఎక్స్-ట్రయల్ ఎస్‌యూవీని దాదాపు రెండేళ్ల క్రితం ప్రపంచానికి పరిచయం చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఎట్టకేలకు ఇది లాంచ్‌కు సిద్ధమైంది. ఇక ఇండియాలో.. ఈ మోడల్.. టయోటా ఫార్చ్యునర్, ఎంజీ గ్లాస్టర్కి పోటీగా అడుగుపెట్టనుంది.
వాస్తవానికి ఈ నిస్సాన్ ఎక్స్-ట్రయల్.. ఒకప్పుడు ఇండియాలో అందుబాటులో ఉండేది. కానీ దానిని సంస్థ డిస్కంటిన్యూ చేసింది. 2005లోనే ఇది ఇండియాలో లాంచ్ అయ్యి, మంచి గుర్తింపును సంపాదించుకుంది.
2022లో కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రయల్‌ని సంస్థ అంతర్జాతీయ మార్కెట్లో ప్రదర్శించింది. ఇండియాలో కూడా లాంచ్ చేసేందుకు చూస్తున్నట్టు పేర్కొంది. ఎట్టకేలకు ఇండియాలో లాంచ్ అవ్వనుంది. లాంచ్‌కి ముందు.. అనేకమార్లు ఈ ఎస్యూవీ టెస్ట్ డ్రైవ్ కూడా జరిగింది.
ఈ 2024 నిస్సాన్ ఎక్స్-ట్రయల్ పొడవు 4680ఎంఎం. వెడల్పు 2065ఎంఎం. ఎత్తు 1725ఎంఎం. వీల్‌బేస్ 2705ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 205ఎంఎం. ఇండియాలో లాంచ్ అయ్యే మోడల్లో డైమెన్షన్స్ కొద్దిగా మారే అవకాశం ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో.. ఈ ఎక్స్-ట్రయల్.. 5 సీటర్, 7 సీటర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. మరి ఇండియాలో ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయా? లేక ఒకటే వస్తుందా? చూడాలి.
ఈ 2024 నిస్సాన్ ఎక్స్-ట్రయల్ ఎస్‌యూవీని సీఎంఎఫ్-సీ ప్లాట్‌ఫామ్‌పై సంస్థ రూపొందిస్తోంది. ఇందులో సంస్థకు చెందిన ఈ-పవర్ డ్రైవ్ సిస్టెమ్ ఉంటుంది. ఇది.. హై-ఔట్పుట్ బ్యాటరీ, ఇంజిన్ ఇంటిగ్రేషన్‌కి పెట్టింది పేరు!
ఈ-పవర్ స్ట్రాంగ్ హైబ్రీడ్ ఇంజిన్.. 201 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ ఈ-పవర్ వేరియంట్.. 211 హెచ్‌పీ పవర్‌ని ఆఫర్ చేస్తుంది. మైల్డ్ హైబ్రీడ్ వేరియంట్లో 12వీ మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది 160 హెచ్‌పీ పవర్, 300 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
ఈ 2024 నిస్సాన్ ఎక్స్-ట్రయల్‌ని సీబీయూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్)గా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఫలితంగా.. ఈ ఎస్యూవీ ధర కాస్త ఎక్కువే ఉండొచ్చు!
ఇందాక చెప్పినట్టు.. టయోటా ఫార్చ్యునర్, ఎంజీ గ్లాస్టర్కు ఈ ఎస్యూవీ గట్టి పోటీని ఇస్తుంది. వీటితో పాటు హ్యుందాయ్ టుక్సాన్, వోక్స్వ్యాగన్ టైగన్, సిట్రోయెన్ సీ5 ఎయిర్క్రాస్లకు సైతం మంచి పోటీ ఇస్తుంది ఈ నిస్సాన్ ఎక్స్-ట్రయల్.
ఈ నిస్సాన్ ఎస్యూవీ ఫీచర్స్, ధరతో పాటు ఇతర వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. సంస్థ నుంచి త్వరలోనే ఒక అప్డేట్ వస్తుందని సమాచారం.
ఇంకో విషయం! ఇప్పుడు హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ తెలుకునేందుకు.. హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి!