తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nifty Bank F&o Expiry : నిఫ్టీ బ్యాంక్​ ఎఫ్​ అండ్​ ఓ కాంట్రాక్ట్స్​ ఎక్స్​పైరీలో మార్పులు..

Nifty Bank F&O expiry : నిఫ్టీ బ్యాంక్​ ఎఫ్​ అండ్​ ఓ కాంట్రాక్ట్స్​ ఎక్స్​పైరీలో మార్పులు..

Sharath Chitturi HT Telugu

06 June 2023, 11:11 IST

google News
    • Nifty Bank F&O contracts expiry : నిఫ్టీ బ్యాంక్​ ఫ్యూచర్​ అండ్​ ఆప్షన్స్​ కాంట్రాక్ట్స్​ ఎక్స్​పైరీ డేను గురువారం నుంచి శుక్రవారానికి మార్చింది ఎన్​ఎస్​ఈ. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.
నిఫ్టీ బ్యాంక్​ ఎఫ్​ అండ్​ ఓ కాంట్రాక్ట్స్​ ఎక్స్​పైరీలో మార్పులు..
నిఫ్టీ బ్యాంక్​ ఎఫ్​ అండ్​ ఓ కాంట్రాక్ట్స్​ ఎక్స్​పైరీలో మార్పులు..

నిఫ్టీ బ్యాంక్​ ఎఫ్​ అండ్​ ఓ కాంట్రాక్ట్స్​ ఎక్స్​పైరీలో మార్పులు..

Nifty Bank F&O contracts expiry day : బ్యాంక్​ నిఫ్టీ ఎఫ్​ అండ్​ ఓ(ఫ్యూచర్​ అండ్​ ఆప్షన్స్​) కాంట్రాక్ట్స్​​ ఎక్స్​పైరీలో కీలక మార్పులు చేసింది ఎన్​ఎస్​ఈ. ఇప్పటివరకు గురువారంగా ఉన్న కాంట్రాక్ట్స్​ ఎక్స్​పైరీని శుక్రవారానికి మార్చుతున్నట్టు పేర్కొంది. ఈ కొత్త రూల్​ జులై 14 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ సర్క్యులర్​ను విడుదల చేసింది.

"బ్యాంక్​ నిఫ్టీ ఎఫ్​ అండ్​ ఓ కాంట్రాక్టుల ఎక్స్​పైరీని గురువారం నుంచి శుక్రవారనికి మారుస్తున్నాము. ఇది జులై 7 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే తొలి ఫ్రైడే ఎక్స్​పైరీ మాత్రం జులై 14న జరుగుతుంది," అని నేషనల్​ స్టాక్​ ఎక్స్​ఛేంజ్​ వెల్లడించింది. ఒక వేళ శుక్రవారం సెలవు వస్తే.. ముందు ట్రేడింగ్​ సెషన్​లో ఎక్స్​పైరీ ఉంటుంది.

గురువారం నుంచి షిఫ్ట్​..

ప్రస్తుతం నిఫ్టీ బ్యాంక్​ వీక్లీ కాంట్రాక్ట్స్​ గురువారం ఎక్స్​పైర్​ అవుతున్నాయి. నెలవారీ, క్వార్టర్లీ కాంట్రాక్ట్స్​.. సంబంధిత నెల చివరి గురువారం ఎక్స్​పైర్​ అవుతున్నాయి.

తాజా ప్రకటనతో జులై 6న జరగాల్సిన నిఫ్టీ బ్యాంక్​ ఎక్స్​పైరీ.. శుక్రవారానికి వాయిదా పడుతుంది. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టుల ఎక్స్​పైరీ.. జులై 13 (గురువారం)గా ఉంటే.. అది జులై 14 (శుక్రవారం)కు వాయిదా పడుతుంది.

గత నిబంధనల ప్రకారం.. 2023 ఆగస్టులో బ్యాంక్​ నిఫ్టీ ఎఫ్​ అండ్​ ఓ ఎక్స్​పైరీ ఆ నెల 31న జరగాల్సి ఉంది. తాజా రూల్స్​ ప్రకారం.. అది ఆగస్టు 25నే జరుగుతుంది.

స్టాక్​ మార్కెట్​లంటేనే రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. ఇక ఎఫ్​ అండ్​ ఓ ట్రేడింగ్​ చాలా రిస్కీ అని స్టాక్​ మార్కెట్​ నిపుణులు చెబుతుంటారు.

ఎన్​ఎస్​ఈకి పోటీగా.. గత నెలలో బీఎస్​ఈ సైతం కాంట్రాక్ట్స్​ను ప్రవేశపెట్టింది. వీటి లాట్​ సైజ్​ చాలా తక్కువగా ఉంది. 

సాధారణంగా స్టాక్​ మార్కెట్​లో ఒక్క షేరు కొనుగోలు చేయవచ్చు. కానీ ఎఫ్​ అండ్​ ఓలో ‘లాట్స్​’ అని ఉంటాయి. లాట్స్​లో 100కుపైగా షేర్లు ఉంటాయి. 

స్టాక్​ మార్కెట్​ టుడే..

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 156 పాయింట్లు కోల్పోయి 62,631 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో 18,552 వద్ద ట్రేడ్​ అవుతోంది.

తదుపరి వ్యాసం