తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sip As New Year's Resolution: కొత్త సంవత్సరం నుంచి ‘సిప్’ చేయండిలా..

SIP as New Year's resolution: కొత్త సంవత్సరం నుంచి ‘సిప్’ చేయండిలా..

HT Telugu Desk HT Telugu

28 December 2022, 20:47 IST

  • SIP as New Year's resolution: పెట్టుబడిపై ఆదాయాన్ని పెంచుకునేలా, మెరుగైన రిటర్న్స్ వచ్చేలా అనేక పథకాలు ఉన్నాయి. అందులో ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం బాగా పాపులర్ అయింది. 2020 తరువాత డీమ్యాట్(demat) ఖాతాల సంఖ్యలో భారీ పెరుగుదలే ఇందుకు నిదర్శనం. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (iStock)

ప్రతీకాత్మక చిత్రం

SIP as New Year's resolution: స్టాక్ మార్కెట్లో ఎలాంటి పరిజ్ఞానం, అనుభవం లేకుండా పెట్టుబడులు పెట్టడం కొంత వరకు రిస్క్. అందులో పరిజ్ఞానం సంపాదించడం, రోజూ మార్కెట్ స్థితిగతులను అధ్యయనం చేయడం చాల సమయం తీసుకుంటాయి. అందువల్ల అలా ఫుల్ టైమ్ ట్రేడింగ్ చేయలేని వారి కోసం, ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టలేనివారి కోసం ‘సిప్’ (Systematic investment plans SIP)) సిస్టమ్ ఉంది.

SIP as New Year's resolution: మంచి రిటర్న్స్..

2022 స్టాక్ మార్కెట్ అనేక ఒడిదుడుకులకు లోనైంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్యం, కోవిడ్ .. మొదలైనవి ఇన్వెస్టర్లను భయాందోళనలకు, తద్వారా స్టాక్ మార్కెట్ కుప్పకూలడానికి కారణమయ్యాయి. ఇంత ఒడిదుడుకుల సమయంలోనూ సిప్స్(Systematic investment plans SIP) ద్వారా పెట్టుబడులు పెట్టిన మ్యుచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇవ్వడం గమనార్హం. నిజానికి ఇప్పుడు సిప్ (SIP) కంట్రిబ్యూషన్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయి. క్రమం తప్పని చిన్నిచిన్ని పెట్టుబడులతో సంపదను పెంచుకోవడానికి మ్యుచువల్ ఫండ్స్ లో సిప్ (SIP) ద్వారా పెట్టుబడులు పెట్టడం మెరుగైన మార్గమని అనేకమంది భావిస్తున్నారు.

SIP as New Year's resolution: న్యూ ఈయర్ లో ప్రారంభించండి

అందువల్ల, భవిష్యత్ లో మంచి రాబడి లభించే పెట్టుబడుల కోసం చూస్తున్న వారు ఇకనైనా, ఈ నూతన సంవత్సరం నుంచైనా సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్(systematic investment plans SIP) ద్వారా ఈక్విటీల్లో పెట్టుబుడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్ కేటగిరీలో సిప్(SIP) ద్వారా పెట్టిన పెట్టుబడులకు, సంవత్సరం లోపు కేటగిరీలో మదుపర్లకు మంచి రిటర్న్స్ లభించాయి. ముఖ్యంగా ఫార్మా, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ల్లో లాభాలు భారీగా ఉన్నాయి. వీటిలో 25.8% వరకు రిటర్న్స్ లభించాయి.

SIP as New Year's resolution: ఇండివిడ్యువల్ స్కీమ్స్ లో..

ఈక్విటీ కేటగిరీల్లోని ఇండివిడ్యువల్ స్కీమ్స్ లో ఎస్భీఐ పీఎస్యూ ఫండ్(SBI PSU) 41.7% , Quant Quantamental Fund 37% , ICICI Pru Infrastructure Fund 36.4% చొప్పున లాభాలను అందించాయి. ఈ ఆర్థిక సంవత్సరం లో ఇప్పటివరకు సిప్ (SIP) ద్వారా పెట్టిన పెట్టుబడులు రూ. 1 లక్ష కోట్లు దాటడం విశేషం. ఒక్క అక్టోబర్, నవంబర్ నెలల్లోనే సిప్ పెట్టుబడులు రూ. 13 వేల కోట్లు దాటాయి.

సూచన: ఇది మార్కెట్ నిపుణుల సూచనలతో కూడిన వార్తాకథనం మాత్రమే. ఇన్వెస్టర్లు సొంత విశ్లేషణతో నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.