తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Volkswagen Suv : టాటా నెక్సాన్​కి పోటీగా.. వోక్స్​వ్యాగన్​ కొత్త ఎస్​యూవీ!

Volkswagen SUV : టాటా నెక్సాన్​కి పోటీగా.. వోక్స్​వ్యాగన్​ కొత్త ఎస్​యూవీ!

Sharath Chitturi HT Telugu

15 September 2024, 9:00 IST

google News
    • Volkswagen new SUV : కొత్త ఎస్​యూవీని లాంచ్​ చేసేందుకు వోక్స్​వ్యాగన్​ రెడీ అవుతోంది. ఈ ఎస్​యూవీ టీజర్​ని ఇటీవలే రిలీజ్​ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త ఎస్​యూవీ విశేషాలను ఇక్కడ చూసేయండి..
వోక్స్​వ్యాగన్​ కొత్త ఎస్​యూవీ
వోక్స్​వ్యాగన్​ కొత్త ఎస్​యూవీ

వోక్స్​వ్యాగన్​ కొత్త ఎస్​యూవీ

వోక్స్​వ్యాగన్ కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్​యూవీని లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త ఎస్​యూవీ టీజర్​ని తాజాగా విడుదల చేసింది. ఇది ఈ స్పేస్​లో బ్రాండ్​కి చెందిన కొత్త ఎంట్రీ లెవల్ ఆఫర్ అవుతుంది. దీనిని టాటా నెక్సాన్​కు పోటీగా వోక్స్​వ్యాగన్ తీసుకొస్తోంది. అయితే, రాబోయే వోక్స్​వ్యాగన్ ఎస్​యూవీ 'ఎ0' కోడ్ నేమ్​తో లాటిన్ అమెరికన్ మార్కెట్ల కోసం అభివృద్ధి చేస్తోంది. వచ్చే సంవత్సరం ఇది మొదట బ్రెజిల్​లో లాంచ్​ అవుతుంది. భారతదేశంలో లాంచ్ అయితే, రాబోయే మోడల్ టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ మొదలైన వాటికి పోటీగా ఉంటుంది. 

రాబోయే వోక్స్​వ్యాగన్ సబ్​కాంపాక్ట్ ఎస్​యూవీకి 'యేహ్​​' అనే పేరు పెట్టే అవకాశం ఉంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కోసం అభివృద్ధి చేసిన MQB A0 ప్లాట్​ఫామ్​పై సంస్థ దీనిని తయారు చేస్తోంది. ఇదే ప్లాఠ్​ఫామ్​ దక్షిణ అమెరికా మార్కెట్లో విక్రయించే కొత్త తరం పోలో, నివస్ ఎశ్​యూవీ, టీ-క్రాస్ కాంపాక్ట్ ఎస్​యూవీతో సహా అనేక వాహనాలకు సపోర్ట్​ చేస్తుంది.

కొత్త వోక్స్ వ్యాగన్ ఎ0 సబ్ కాంపాక్ట్ ఎస్​యూవీ

ఎంక్యూబీ ఎ0 ప్లాట్​ఫామ్​కి చెందిన ఇండియన్​ వర్షెన్​ ఎంక్యూబీ ఎ0 ఐఎన్​ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇది వోక్స్​వ్యాగన్ టైగన్, విర్టస్, అలాగే స్కోడా కుషాక్, స్లావియా వంటి మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. ఇదే ఎంక్యూబీ ఎ0 ఐఎన్ రాబోయే స్కోడా కైలాక్ సబ్ కాంపాక్ట్ ఎస్​యూవీకి కూడా మద్దతు ఇస్తుంది.

రాబోయే వోక్స్ వ్యాగన్ యేహ్​ సుమారు 4 మీటర్ల పొడవు, 2,500ఎంఎం వీల్​బేస్​తో ఉంటుందని భావిస్తున్నారు. ఈ టీజర్ పెద్ద కొత్త తరం టిగువాన్ నుంచి తీసుకొని అభివృద్ధి చెందిన డిజైన్ లాంగ్వేజ్​ని వెల్లడిస్తుంది. స్పోర్టీ డిజైన్ లాంగ్వేజ్​లో స్లిమ్ గ్రిల్, ఎల్​ఈడీ డీఆర్​ఎల్​లు, సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్​తో కనెక్టెడ్ టెయిల్ లైట్స్ ఉన్నాయి. టైగన్, టీ-క్రాస్​లలో నిటారుగా ఉన్న బాక్సీ స్టైలింగ్​ కాకుండా సబ్ కాంపాక్ట్ ఎస్​యూవీలో కూపే రూఫ్​లైన్ కనిపిస్తుంది.

రాబోయే వోక్సవ్యాగన్​ ఎస్​యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే వారాల్లో అందుబాటులో ఉంటాయి. అయితే వోక్స్​వ్యాగన్ ఇండియా సబ్ కాంపాక్ట్ ఎస్​యూవీని ఇక్కడ మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రణాళికలను ప్రకటించలేదు. వోక్స్​వ్యాగన్ ఈ మోడల్ భారతీయ వెర్షన్​ను తరువాత మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తుందో లేదో చూడాలి.

థారు ఎస్​యూవీ..

వోక్స్​వ్యాగన్ కొత్త ఎస్​యూవీని చైనాలో మార్కెట్​లో ఆవిష్కరించింది. దాని పేరు​ థారు ఎక్స్​ఆర్. చైనాలో అమ్ముడవుతున్న చిన్న టి-క్రాస్, థారు మధ్యలో ప్లేస్​ అయ్యి ఉంటుంది ఈ కొత్త వోక్స్​వ్యాగన్ థారు ఎక్స్​ఆర్. అయితే ఇది భారత్​ మార్కెట్​లో వోక్స్​వ్యాగన్​ టైగన్​లా అనిపిస్తుంది. కాకపోతే.. ఈ కొత్త ఎస్​యూవీ పొడవు కాస్త ఎక్కువ! థారు ఎక్స్ఆర్ ఎంక్యూబీ ఏ0 ప్లాట్​ఫామ్​పై ఆధారపడి ఉంటుంది. వీడబ్ల్యు టైగన్, విర్టస్​, స్కోడా కుషాక్, స్లావియాతో సహా అనేక వాహనాలను ఇదే ప్లాట్​ఫామ్​పై రూపొందిస్తోంది సంస్థ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం