Netflix password Sharing : ఇక నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ బంద్.. త్వరలోనే అమల్లోకి!
27 January 2023, 11:24 IST
- Netflix password Sharing : మీరు మీ ఫ్రెండ్స్‌తో నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకుంటున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. త్వరలో పాస్వర్డ్ షేరింగ్‌కు ముగింపు పడనుంది!
ఇక నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ బంద్
Netflix password Sharing India : ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు.. 'పాస్వర్డ్ షేరింగ్' అనేది తలనొప్పిగా మారిందన్న విషయం తెలిసినదే. ఇవాళో.. రేపో.. ఈ వ్యవహారంపై నెట్‌ఫ్లిక్స్ కఠిన నిబంధనలు తీసుకొస్తుందని ఊహాగానాలు జోరుగా సాగాయి. ఈ ఊహాగానాలను నెట్‌ఫ్లిక్స్ నిజం చేసింది! పాస్వర్డ్ షేరింగ్‌ను నియంత్రించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. త్వరలోనే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
నెట్‌ఫ్లిక్స్ పెయిడ్ షేరింగ్ మోడల్..
ఒక అకౌంట్ మీద చాలా మంది, చాలా డివైజ్‌లలో నెట్‌ఫ్లిక్స్‌ను యాక్సిస్ చేస్తూ ఉంటారు. పాస్వర్డ్ షేరింగ్ వెసులుబాటు ఉండటం ఇందుకు కారణం. ఇండియాలో ఇది సాధారణ విషయమే. దీంతో తమకు నష్టం జరుగుతోందని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. అందుకే.. 'పెయిడ్ షేరింగ్ మోడల్'ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. 2023 ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
Netflix password Sharing rules : "క్యూ1 తర్వాత.. పెయిడ్ షేరింగ్ మోడల్‌ను అమల్లోకి తీసుకొస్తాము," అని నెట్‌ఫ్లిక్స్ తమ ఇన్వెస్టర్లకు వెల్లడించింది. అంటే.. ఏప్రిల్ నుంచి నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ పనిచేయదు. నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేసే వాళ్లు.. ఇక నుంచి అదనంగా డబ్బులు కట్టాల్సిందే!
Netflix OTT Subscription Plans: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ మోడల్లో భాగంగా.. సబ్‌స్క్రిప్షన్‌కి తగ్గట్టు.. యూజర్ల డివైజ్‌లను రివ్యూ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది నెట్‌ఫ్లిక్స్. వాటిల్లోనే నెట్‌ఫ్లిక్స్ పనిచేస్తుంది! దీనితో పాటు.. కొత్త అకౌంట్లకు తమ ప్రొఫైల్స్ మార్చుకునే వెసులుబాటును కూడా ఇస్తుంది.
Netflix paid sharing model : "పెయిడ్ షేరింగ్‌ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత. యూజర్లు.. పాస్‌వర్డ్‌ను షేర్ చేయాలంటే అదనంగా డబ్బులు కట్టాల్సిందే. దీనిపై షార్ట్ టర్మ్‌లో ప్రతికూల ప్రభావం పడొచ్చు. కానీ క్రమంగా సానుకూల పరిస్థితులు కనిపిస్తాయి. మేము డెలివరీ చేసే ప్రొగ్రామ్‌లపై మాకు నమ్మకం ఉంది. వాటిని చూసేందుకు.. ఇంతకాలం నెట్‌ఫ్లిక్స్ అకౌంట్లను అప్పుగా తీసుకున్న వారు.. భవిష్యత్తులో కొత్త అకౌంట్లు తీసుకుంటారు," అని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.
పాస్వర్డ్ షేరింగ్ బంద్..
పెయిడ్ షేరింగ్ మోడల్లో భాగంగా.. ఐపీ అడ్రెస్లు, డివైజ్ ఐడీలు, నెట్ఫలిక్స్ అకౌంట్ యాక్టివీటీలు వంటిని పరిశీలిస్తుంది నెట్‌ఫ్లిక్స్. ఫలితంగా బయట వ్యక్తులు లాగిన్ అవ్వకుండా చేస్తుంది!
Netflix India news : ఈ పెయిడ్ షేరింగ్ మోడల్‌పై రానున్న రోజుల్లో నెట్‌ఫ్లిక్స్ నుంచి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇండియా, ఇండియా యూజర్లపై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది చూడాలి.