తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mutual Funds : నెలకు రూ.10,000 పెట్టుబడితో మీ బిడ్డకు 21 ఏళ్ల వచ్చేసరికి లక్షాధికారిని చేయండి!

Mutual Funds : నెలకు రూ.10,000 పెట్టుబడితో మీ బిడ్డకు 21 ఏళ్ల వచ్చేసరికి లక్షాధికారిని చేయండి!

Anand Sai HT Telugu

18 December 2024, 12:30 IST

google News
    • Mutual Funds SIP : మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి రాబడులతోపాటుగా రిస్క్ కూడా ఉంటుంది. మీ బిడ్డ కోసం డబ్బులు దాచాలనుకుంటే సిప్‌లో పెట్టుబడి పెట్టండి. వారికి 21 ఏళ్ల వయసు వచ్చేసరికి లక్షాధికారి అవుతారు.
మ్యూచువల్​ ఫండ్స్
మ్యూచువల్​ ఫండ్స్

మ్యూచువల్​ ఫండ్స్

ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు ఆర్థిక సమస్యలు రాకూడదని కోరుకుంటారు. అందుకోసం తమ జీవితంలో చాలా కష్టపడుతారు. తల్లిదండ్రులకు వారి పిల్లల భవిష్యత్తును సేఫ్టీగా ఉంచడం మెుదటి ప్రాధాన్యత. వారి చదువు కోసం, వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం ఆర్థికంగా అండగా ఉంటారు. అయితే మీరు చిన్నప్పటి నుంచే వారికోసం సరిగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచాలని, దాని కోసం డబ్బును ఆదా చేయాలని అనుకుంటారు. దీనికి ముందుచూపుతో కూడిన పెట్టుబడి చాలా అవసరం. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగపడతాయి. మీ బిడ్డకు 21 ఏళ్లు వచ్చే నాటికి రూ. 1.13 కోట్లకు పైగా పొదుపు చేసేందుకు సిప్ అవకాశం కల్పిస్తుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లేదా SIP అనేది దీన్ని సాధ్యం చేస్తుంది. ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించవచ్చు.

SIPలు ప్రత్యేకించి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మీ పెట్టుబడులు విపరీతంగా పెరిగేలా చేస్తాయి. కాలక్రమేణా మీ డబ్బు భారీగా వడ్డీని పొందుతుంది. సంపద సృష్టిలో మీరు ముందు వరుసలో ఉంటారు.

మీరు నెలకు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే 21 సంవత్సరాల తర్వాత మీ మొత్తం పెట్టుబడి రూ.25,20,000 అవుతుంది. మీరు 12 శాతం వార్షిక రాబడిని ఆశించినప్పటికీ మీ మొత్తం రాబడి రూ. 87,98,000 అవుతుంది. అంటే 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీ మొత్తం రూ.1,13,18,000 అవుతుంది. సిప్‌లో పెట్టుబడి పెడితే వడ్డీ బాగా ఉంటుంది.

మీ బిడ్డకు 21 ఏళ్లు వచ్చే సమయానికి రూ. 1.13 కోట్ల పొదుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉన్నత విద్య కోసం ట్యూషన్ ఫీజులు, ఖర్చులు లేదంటే ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి సాయపడుతుంది. ఈ కార్పస్ వారి కలలకు అవసరమైన మూలధనాన్ని కూడా అందిస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో సంపదను పెంచేందుకు అత్యంత ప్రభావవంతమైన పెట్టుబడుల్లో ఒకటి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్లు వంటి సాంప్రదాయ పొదుపు సాధనాలతో పోలిస్తే ఇవి అధిక రాబడికి అందిస్తుంది. అయితే రిస్క్ కూడా ఉంటుంది.

గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిలో కొన్నిసార్లు వడ్డీలో మార్పులు ఉండవచ్చు. సంబంధిత నిపుణులను సంప్రందించి ఇన్వెస్ట్ చేయండి.

తదుపరి వ్యాసం