Muthoot Finance dividend: 220 శాతం డివిడెండ్ ప్రకటించిన ముతూట్ ఫైనాన్స్
06 April 2023, 19:35 IST
Muthoot Finance dividend: ప్రముఖ గోల్డ్ లోన్ ఎన్బీఎఫ్సీ(gold loan NBFC) ముతూట్ ఫైనాన్స్ (Muthoot Finance) తమ షేర్ హోల్డర్లకు రూ. 22 ల డివిడెండ్ ప్రకటించింది.
ప్రతీకాత్మక చిత్రం
బంగారంపై రుణాలు ఇచ్చే సంస్థల్లో టాప్ 1 గా ఉన్న ముతూట్ ఫైనాన్స్ (Muthoot Finance) 2023 ఆర్థిక సంవత్సరంలో తమ మదుపర్లకు 220% మధ్యంతర డివిడెండ్ (interim dividend) ఇవ్వనున్నట్లు గురువారం ప్రకటించింది.
Muthoot Finance dividend: 22 రూపాయలు
రూ. 1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుపై మధ్యంతర డివిడెండ్ (interim dividend) గా రూ. 22 ఇవ్వనున్నట్లు ముతూట్ ఫైనాన్స్ (Muthoot Finance) ప్రకటించింది. డివిడెండ్ చెల్లింపునకు రికార్డు డేట్ ఏప్రిల్ 18వ తేదీ అని సెబీకి సమర్పించిన పత్రాల్లో వెల్లడించింది. ఆ తరువాత నెల రోజుల్లోగా డివిడెండ్ (dividend) మొత్తాన్ని షేర్ హోల్డర్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేసింది. మార్చి 2022 తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో తమ షేర్ హోల్డర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ పై ముతూట్ ఫైనాన్స్ (Muthoot Finance) రూ. 20 లను మధ్యంతర డివిడెండ్ (interim dividend) గా అందించింది.
Muthoot Finance profits: తగ్గుతున్న లాభాలు
ప్రస్తుతం ముతూట్ ఫైనాన్స్ (Muthoot Finance) మార్కెట్ క్యాప్ రూ. 37,256 కోట్లు గా ఉంది. డిసెంబర్ 2022 తో ముగిసే త్రైమాసికంలో ముతూట్ ఫైనాన్స్ లాభాలు, అంతకుముందు ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3) లో వచ్చిన లాభాలతో పోలిస్తే 12.4% తగ్గాయి. ఆ మూడు నెలల కాలంలో (Muthoot Finance) సంస్థ నెట్ ఇంటరెస్ట్ ఇన్ కం (net interest income NII) 9.6% తగ్గింది. డిసెంబర్ 2022 తో ముగిసే త్రైమాసికం (Q3) లో ముతూట్ ఫైనాన్స్ రూ. 901.6 కోట్ల లాభాలు సముపార్జించింది. 2021 డిసెంబర్ తో ముగిసే త్రైమాసికంలో ముతూట్ ఫైనాన్స్ లాభాలు రూ. 1,028.9 కోట్లు. డిసెంబర్ 2022 తో ముగిసే త్రైమాసికంలో (Q3) ముతూట్ ఫైనాన్స్ నెట్ ఇంటరెస్ట్ ఇన్ కం (net interest income NII) రూ. 1,704.3 కోట్లు కాగా, 2021 డిసెంబర్ తో ముగిసే త్రైమాసికం (Q3) లో ముతూట్ ఫైనాన్స్ (Muthoot Finance) నెట్ ఇంటరెస్ట్ ఇన్ కం (net interest income NII) రూ. 1,886.1 కోట్లు. ఏప్రిల్ 6, గురువారం బీఎస్ఈ (BSE) లో ముతూట్ ఫైనాన్స్ (Muthoot Finance) షేర్ రూ. 1,019 వద్ద ట్రేడ్ అయింది.