తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Motorola Edge 30 Ultra Price Cut : 200ఎంపీ కెమెరా ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ధర తగ్గింపు!

Motorola Edge 30 Ultra Price Cut : 200ఎంపీ కెమెరా ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ధర తగ్గింపు!

06 November 2022, 18:12 IST

    • Motorola Edge 30 Ultra Discount : మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఫ్లిప్‍కార్ట్ లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
200ఎంపీ కెమెరా ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ధర తగ్గింపు!
200ఎంపీ కెమెరా ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ధర తగ్గింపు!

200ఎంపీ కెమెరా ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ధర తగ్గింపు!

Motorola Edge 30 Ultra Discount : ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లతో మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఇటీవల లాంచ్ అయింది. ప్రీమియమ్ ఫీచర్లతో ఈ ఫోన్‍ను మోటోరోలా తీసుకొచ్చింది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, పవర్ ఫుల్ స్నాప్‍డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తోంది. ప్రస్తుతం మోటో డేస్‍లో భాగంగా ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ లో ఈ ఫోన్ డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఈనెల 7వ తేదీ వరకు మోటో డేస్ సేల్ నడవనుంది. దీంట్లో భాగంగా మోటోరోలా ఫోన్స్ డిస్కౌంట్‍ ధరతో లభిస్తాయి. ఈ క్రమంలోనే మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కూడా తగ్గింపు ధరకు ప్రస్తుతం అందుబాటులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Stocks to buy today : భారీగా పతనమైన టాటా మోటార్స్​ షేర్లు ఇప్పుడు కొంటే.. భారీ ప్రాఫిట్స్​!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Motorola Edge 30 Ultra Price : మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ధర

8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ప్రస్తుతం రూ.54,999కు లభిస్తోంది. ఈ ఫోన్ రూ.59,999కు లాంచ్ కాగా.. ప్రస్తుతం మోటో డేస్‍లో భాగంగా రూ.5,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. 12జీబీ ర్యామ్+256జీబీ వేరియంట్ కూడా డిస్కౌంట్‍తో లభిస్తోంది.

Motorola Edge 30 Ultra Specifications : మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్పెసిఫికేషన్లు

144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే 6.67 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ పీఓఎల్ఈడీ కర్వ్ డ్ ఎడ్జెస్ డిస్‍ప్లేను మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కలిగి ఉంది. హెచ్‍డీఆర్ 10+ సపోర్ట్ ఉంటుంది. శక్తివంతమైన స్నాప్‍డ్రాగన్ 8+ జెన్ 1 5జీ ప్రాసెసర్ పై ఈ మొబైల్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో వస్తోంది.

4,160ఎంఏహెచ్ బ్యాటరీతో మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా వస్తోంది. 125వాట్స్ వైర్డ్, 50 వాట్స్ వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్‍కు ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. 10 వాట్స్ రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 5జీ నెట్‍వర్క్ ఎనేబుల్ అయ్యేలా ఈ ఫోన్‍కు అప్‍డేట్ కూడా వచ్చింది.

మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాలు ఉంటాయి. 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది.

తదుపరి వ్యాసం