Moto G13 Launch : మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. త్వరలోనే లాంచ్!
06 December 2022, 13:43 IST
- Moto G13 Launch : మోటో జీ13.. త్వరలోనే ఇండియాలో లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వివరాలు..
మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. త్వరలోనే లాంచ్!
Moto G13 Launch update : మోటోరోలా నుంచి ఇండియా మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్ రానుంది. ఎక్స్‌టీ2331 పేరుతో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ని బీఐఎస్ అథారిటీతోపాటు థాయ్‌లాండ్‌కు చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్ ఆమోదించాయి. కాగా.. థాయ్‌లాండ్‌లో.. మోటో జీ13 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాలో కూడా అదే పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఎన్బీటీసీ డేటాబేస్‌లో ఎక్స్‌టీ2331-3 పేరుతో ఈ మోటో జీ13 దర్శనమిచ్చింది. ఇండియాలో ఎక్స్‌టీ2331-2 మోడల్ నెంబర్ పేరు ఉంది. ఇండియాలో లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఇప్పటికే ఎఫ్‌సీసీ అథారిటీ నుంచి సర్టిఫికేట్ వచ్చినట్టు తెలుస్తోంది.
Moto G13 price : ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం.. మోటో జీ13లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని, 10డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. ఈ మోటో జీ13కు 'పెనాంగ్' అనే కోడ్‌నేమ్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రిపోర్టుల ప్రకారం.. పెనాంగ్ 5జీ, పెనాంగ్ 4జీ, పెనాంగ్+ వేరియంట్స్ ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది.
పెనాంగ్ 5జీకి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ 5జీ మోడల్.. తొలుత నార్త్ అమెరికా మర్కెట్లలో లాంచ్ అవుతుందని సమాచారం. 4జీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ వేరియంట్లో ఇది లభించొచ్చు. ఆప్టికల్ సిల్వర్, బలాస్ట్ బ్లూ షేడ్స్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రావొచ్చు.
మోటో జీ13 స్మార్ట్‌ఫోన్‌పై సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రానున్న రోజుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర, లాంచ్ డేట్‌తో పాటు ఇతర వివరాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే.. అఫార్డిబుల్ ప్రైజ్లోనే ఇది ఇండియా మార్కెట్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
చైనాలో మరో మోటో స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
Moto G13 price in India : మరోవైపు.. ఎక్స్‌టీ2335-3 మోడల్ నెంబర్‌తో మరో మోటోరోలా 5జీ స్మార్ట్‌ఫోన్.. చైనాలో లాంచ్‌కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 6.5ఇంచ్ ఎల్సీడీ ప్యానెల్, హెచ్డీ+ రిసొల్యూషన్, 2.2 జీహెచ్‌జెడ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, 5000ఎఏహెచ్ బ్యాటరీ ఉండొచ్చు. ఇందులో 8ఎంపీ ఫ్రంట్ కెమెరా, 50ఎంపీ + 2ఎంపీ డ్యూయెల్ కెమెరా సెటప్, సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్స్ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి. ఈ ఫోన్‌పై చైనాలో ఈ నెలలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడుతుందని వార్తలు వస్తున్నాయి.